
అష్గబాత్ (తుర్క్‌మెనిస్తాన్): ఆసియా ఇండోర్ క్రీడల్లో చివరిరోజు బుధవారం టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణం, రజతం లభించాయి. భారత్‌కే చెందిన సుమీత్ నాగల్, విజయ్ సుందర్ ప్రశాంత్‌ల మధ్య జరిగిన ఫైనల్లో సుమీత్ 6–1, 6–1తో నెగ్గి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు.
చెస్‌లో శశికిరణ్–సూర్యశేఖర గంగూలీ ద్వయం పురుషుల బ్లిట్జ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం, అండర్–23 విభాగంలో వైభవ్ సూరి–దీప్తాయన్ జంట కాంస్యం గెలిచాయి. ఓవరాల్‌గా భారత్ 9 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 40 పతకాలతో 11వ స్థానంలో నిలిచింది.