Ramasatyanarayana
-
‘దెయ్యం గుడ్డిది ఐతే?’
సుమీత్, జాకీర్, హైమ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘దెయ్యం గుడ్డిది ఐతే?’. దాసరి సాయిరాం దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ– ‘‘నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. లెక్కలేనన్ని చూశాను. కానీ దెయ్యం సినిమాలో దెయ్యం గుడ్డిది కావడం అనే కథాంశంతో ఉన్న సినిమా ఇప్పటివరకూ చూడలేదు. ‘దెయ్యం గుడ్డిది ఐతే’ అనే టైటిల్ పెట్టడం ఇంకా చాలా కొత్తగా ఉంది’’ అన్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
డాన్స్ రాజా
ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ, మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య పాత్రల్లో వెంకీ ఎ.ఎల్. దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రం ‘డాన్స్ రాజా డాన్స్’గా తెలుగులో విడుదల కానుంది. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రచయిత చిన్నికృష్ణ విడుదల చేసి, ‘‘నృత్య ప్రధానంగా రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించాలి’’ అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తమిళ ప్రేక్షకులను డాన్సులతో ఉర్రూతలూగించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది. భారతీబాబు మాటలు–పాటలు అందించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకూ సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ గాత్రం అందించడం విశేషం. చిన్నికృష్ణ చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ విడుదలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ట్రైలర్ విడుదలలో ప్రొడక్షన్ డిజైనర్ చందు ఆది పాల్గొన్నారు. -
నిజాలే చూపించాం
‘‘1982 మార్చి నెలలో రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. ఎన్టీ రామారావుగారు పెట్టిన పార్టీలో నేను చేసిన కృషి ‘బగ్గిడి గోపాల్’ చిత్రంలో చూపించాం. నా జీవితంలో జరిగిన కీలక సంఘటనలు ఈ సినిమాలో చూపిస్తాం’’ అన్నారు బగ్గిడి గోపాల్. ఆయన జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘బగ్గిడి గోపాల్’. బగ్గిడి గోపాల్ నిర్మించిన ఈ సినిమాకు అర్జున్ కుమార్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఈ కథ ఆదర్శంగా ఉంటుంది. పోలీస్ అధికారిగా నటిస్తున్నాను’’ అన్నారు సుమన్. ‘‘గోపాల్ ఎంఎల్ఏ అయిన తర్వాత జరిగిన సంఘటనలు నాకు తెలుసు. ఈ సినిమాలో అన్నీ నిజాలు చూపించారు. ముక్కుసూటి మనిషి అయిన తనను చాలా ఇబ్బంది పెట్టారు. అవి ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు మాజీ ఎంఎల్ఏ సంజయ్రావు. ‘‘దర్శకత్వంతో పాటు ఓ పాత్రలోనూ నటించాను’’ అన్నారు అర్జున్ కుమార్. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హీరోయిన్ చందన మాట్లాడారు. -
ఇద్దరమ్మాయిల ప్రేమకథ!
ఇద్దరమ్మాయిల మధ్య ఏర్పడిన అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫైర్’. శ్రీరాజన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ప్రశాంతి, గీతాంజలి ముఖ్యతారలు. ‘‘శ్రీరాజన్ చెప్పిన కథ రామ్గోపాల్వర్మగారికి కూడా బాగా నచ్చింది. డిఫరెంట్ పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెల 13న విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ‘‘నా 16 ఏళ్ల కష్టం ఈ సినిమా. హీరో స్థానంలో అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది? అనే ఐడియాతో ఈ కథ తయారు చేసుకున్నా’’ అని దర్శకుడు తెలిపారు. -
నీతులు చెప్పడానికి బూతులు అవసరంలేదు
సోనియా అగర్వాల్ గర్తుంది కదా! ‘7/జి బృందావన కాలనీ’ అనే ఒకే ఒక్క సినిమాతో స్టార్ అయిపోయారామె. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా ఏదీ బ్రేక్ ఇవ్వలేదు. కొంత విరామం తర్వాత తెలుగులో ‘నాకు కొంచెం టైమ్ కావాలి’ అనే చిత్రం అంగీకరించారామె. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. సీతారామ ఫిలింస్ పతాకంపై వెంకటేశ్ రెబ్బ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భానూరు నాగరాజు (జడ్చర్ల) నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్చేయగా, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రేపు గురించి మనకు ఈరోజే తెలిసిపోతే సంతోషంగా ఉండలేం... అందుకే భవిష్యత్తుని తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. నీతులు చెప్పడానికి బూతులు అవసరంలేదని చెబుతున్నాం’’ అన్నారు. మూడు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని నాగరాజు చెప్పారు. కాలేజ్ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం ఇదని సోనియా అగర్వాల్ తెలిపారు. నాగేంద్ర, వంశీ, ఫణిచంద్ర, పల్లవి, శ్రేష్ట హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి.