ఇద్దరమ్మాయిల ప్రేమకథ! | three girl love story | Sakshi
Sakshi News home page

ఇద్దరమ్మాయిల ప్రేమకథ!

Published Fri, Sep 4 2015 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

ఇద్దరమ్మాయిల ప్రేమకథ!

ఇద్దరమ్మాయిల ప్రేమకథ!

ఇద్దరమ్మాయిల మధ్య ఏర్పడిన  అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన  చిత్రం ‘ఎఫైర్’. శ్రీరాజన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ప్రశాంతి, గీతాంజలి ముఖ్యతారలు.  ‘‘శ్రీరాజన్ చెప్పిన కథ రామ్‌గోపాల్‌వర్మగారికి కూడా  బాగా నచ్చింది. డిఫరెంట్ పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ నెల 13న విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ‘‘నా 16 ఏళ్ల కష్టం ఈ సినిమా. హీరో స్థానంలో అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది? అనే ఐడియాతో ఈ కథ తయారు చేసుకున్నా’’ అని దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement