
రామసత్యనారాయణ, చిన్నికృష్ణ
ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ, మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య పాత్రల్లో వెంకీ ఎ.ఎల్. దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రం ‘డాన్స్ రాజా డాన్స్’గా తెలుగులో విడుదల కానుంది. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రచయిత చిన్నికృష్ణ విడుదల చేసి, ‘‘నృత్య ప్రధానంగా రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించాలి’’ అన్నారు.
రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తమిళ ప్రేక్షకులను డాన్సులతో ఉర్రూతలూగించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది. భారతీబాబు మాటలు–పాటలు అందించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకూ సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ గాత్రం అందించడం విశేషం. చిన్నికృష్ణ చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ విడుదలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ట్రైలర్ విడుదలలో ప్రొడక్షన్ డిజైనర్ చందు ఆది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment