Producer Dil Raju Launched 'Krishna Gadu Ante Oka Range' Trailer - Sakshi
Sakshi News home page

Krishna Gadu Ante Oka Range: ‘కృష్ణగాడు’ ప్రేమను గెలిచాడా?

Published Thu, Jul 27 2023 6:07 AM | Last Updated on Thu, Jul 27 2023 4:02 PM

Producer Dil Raju Launched Krishna Gadu Ante Oka Range - Sakshi

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రాజేష్‌ దొండపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్‌’. పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పీఎన్‌కే శ్రీలత నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్‌ 4న రిలీజ్‌ కానుంది.

ఈ సినిమా ట్రైలర్‌ని నిర్మాత ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేసి, సినిమా పెద్ద హిట్టవ్వాలన్నారు. ట్రైల‌ర్ చూస్తుంటే ఓ వైపు యూత్‌కు న‌చ్చే ఎలిమెంట్స్‌తో పాటు స‌స్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలున్నాయి. ఎమోష‌న‌ల్ ఎలిమెంట్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ఎడిటర్‌గా సాయి బాబు తలారి పని చేస్తున్నారు. ‘‘కృష్ణ అనే కుర్రాడి లైఫ్‌లోకి ఓ అమ్మాయి వచ్చాక, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనేది ఈ చిత్రం ప్రధానాంశం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement