‘రౌడీ బాయ్స్‌’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్‌ హీరో | Jr NTR Chief Guest To Rowdy Boys Movie Trailer Launch Event On 9th January | Sakshi
Sakshi News home page

Rowdy Boys Movie: ‘రౌడీ బాయ్స్‌’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్‌ హీరో

Published Sat, Jan 8 2022 9:20 AM | Last Updated on Sat, Jan 8 2022 9:27 AM

Jr NTR Chief Guest To Rowdy Boys Movie Trailer Launch Event On 9th January  - Sakshi

సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సినిమాలు థియేటర్ల బాట పడుతున్నాయి. అలాంటి సినిమాల్లో 'రౌడీ బాయ్స్' ఒకటి. ఈ సినిమాతో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నాడు. దిల్ రాజు - శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి హర్ష కానుగంటి దర్శకత్వం వహించాడు. కొంతకాలం క్రితమే పూర్తయిన ఈ సినిమా సరైన విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తోంది.

చదవండి: బాహుబలి ‘కట్టప్ప’కు కరోనా, ఆకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిక

ఈ నేపథ్యంలో సంక్రాంతి బరి నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో, చిన్న సినిమాలకి అవకాశం దొరికింది. అలా 'రౌడీ బాయ్స్' కూడా బరిలోకి దిగాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రేపు  సాయంత్రం 6 గంటలకు ట్రైలర్‌ విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ హజరై ట్రైలర్‌ రిలీజ్ చేయించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆశిష్ జోడీగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement