Dil Raju Talks On Rowdy Boys Movie Collections: సంక్రాంతి సెకండ్‌ విన్నర్‌ మాదే! - Sakshi
Sakshi News home page

సంక్రాంతి సెకండ్‌ విన్నర్‌ మాదే!

Published Thu, Jan 20 2022 5:32 AM | Last Updated on Thu, Jan 20 2022 9:00 AM

Dil Raju Talks On Rowdy Boys Movie Collections - Sakshi

‘‘రౌడీ బాయ్స్‌’ ఆశిష్‌కి తొలి చిత్రం. నా దృష్టిలో తను ఇప్పుడు ఒక నటుడు. ఒక్క సినిమాకే హీరో అని అనను.. ప్రేక్షకులు తనని బాగా ఆదరించినప్పుడే హీరో’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ‘రౌడీ బాయ్స్‌’ ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘రౌడీ బాయ్స్‌’ ఆశిష్‌కు చక్కటి శుభారంభం. తొలి సినిమా అయినా నటన, డ్యాన్స్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆకట్టుకున్నాడని అందరూ ప్రశంసిస్తున్నారు. మా సినిమా కథ, పాత్రలతో యువతరం కనెక్ట్‌ అవుతుండటంతో విడుదల నుంచి ఇప్పటివరకూ వసూళ్లు నిలకడగా ఉన్నాయి.

ఆంధ్ర, తెలంగాణలో ఐదు రోజుల్లో ఏడుకోట్ల గ్రాస్, నాలుగున్నర కోట్ల షేర్‌ లభించింది. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం హ్యాపీ. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ మా సినిమాకు అడ్వాంటేజ్‌గానే భావిస్తున్నాం. తెలంగాణలో కంటే ఆంధ్రాలో వసూళ్లు బాగున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన పాటలకు మంచి స్పందన లభిస్తుండటంతో మ్యూజికల్‌ కాంటెస్ట్‌ పెట్టి ఈవెంట్‌ నిర్వహించబోతున్నాం. ఈ సంక్రాంతి తొలి విన్నర్‌ ‘బంగార్రాజు’ సినిమానే. రెండో స్థానం ‘రౌడీ బాయ్స్‌’ది. ‘సెల్ఫిష్‌’ పేరుతో తెరకెక్కనున్న ఆశిష్‌ రెండో చిత్రానికి  సుకుమార్‌ శిష్యుడు కాశీ దర్శకుడు. సుకుమార్‌ డైలాగ్స్‌ అందిస్తారు. ‘ఆర్య’ తర్వాత నేను, సుకుమార్‌ కలిసి చేస్తున్న చిత్రమిది (నిర్మాతలుగా).. అందుకే బాధ్యతగా భావిస్తున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement