Rowdy Boys Movie Ready To Streaming On OTT: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు వారసుడిగా ఆయన సోదరుడు శిరీష్ తనయుడు అశిష్ హీరోగా పరిచమైన చిత్రం ‘రౌడీ బాయ్స్’. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. హుషారు ఫేం శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
చదవండి: ‘కచ్చా బాదం’ పాటకు అర్హ డ్యాన్స్, వీడియో షేర్ చేసి మురిసిపోయిన బన్నీ
ఈ చిత్రంలో ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి రిలీజ్ రెడీ అవుతోంది. తాజా బజ్ ప్రకారం.. ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 యాప్‌లో మార్చి 4 నుంచి రౌడీ బాయ్స్ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ అయ్యంగార్, విక్రమ్, కార్తిక్ రత్నం, తేజ్ కురపాటి తదితరులు ఈ సినిమాలో నటించారు.
చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న ‘బంగార్రాజు’!, ఎక్కడంటే..
Comments
Please login to add a commentAdd a comment