‘‘ఇండస్ట్రీలోనే కాదు.. ఏ రంగంలో అయినా ప్రతిభ ఒక్కటే కాదు.. క్రమశిక్షణ ముఖ్యం. క్రమశిక్షణ ఉంటే అవకాశాలు తెచ్చిపెడుతుంది. ప్రతిభ ఉండీ క్రమశిక్షణ లేకుంటే వేస్ట్. మా నాన్నగారు(చిరంజీవి) నాకు డ్యాన్స్, యాక్టింగ్ నేర్పలేదు.. క్రమశిక్షణే నేర్పారు’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. ఆశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘రౌడీ బాయ్స్ మ్యూజికల్ ఈవెంట్’లో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘రౌడీ బాయ్స్’కి అద్భుతమైన పాటలిచ్చిన దేవిశ్రీగారికి థ్యాంక్స్.
చదవండి: 'ఆర్‌ఆర్‌ఆర్' వాయిదా పై స్పందించిన రామ్ చరణ్
హర్ష.. ఈ సంక్రాంతి నీదే. ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్‌లో ఆశిష్‌లోని ఫైర్, ఎనర్జీ, డ్యాన్స్, క్యూట్ నెస్ కనిపించాయి. రాజు, లక్ష్మణ్‌గార్లు ఉండటం వల్లనో, నేను, మహేశ్ బాబు, ప్రభాస్ సపోర్ట్ చేయడం వల్లనో గొప్ప స్థాయి రాదు.. నీ కష్టమే(ఆశిష్) నిన్ను నిలబెడుతుంది. ప్రతి రోజూ వర్కవుట్స్ చేయడం, సమయానికి సెట్స్‌లో ఉండటం, షూటింగ్ చేయడం బోరింగ్‌గా ఉంటుంది. అయినా ఈ రోజు సక్సెస్ అయిన వారంతా అదేపని చేశారు. యాక్టింగ్ కుటుంబం నుంచి వచ్చిన నేను ‘సైరా’ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసినా నా మనసంతా నటనవైపే ఉంటుంది.
చదవండి: అప్పుడు భయపడ్డాను.. కానీ ఆ అనుభవం ఉపయోగపడింది: నాగ చైతన్య
మీ నాన్న, మీ బాబాయ్ ప్రొడక్షన్‌లో ఉన్నారు కాబట్టి నువ్వు(ఆశిష్) యాక్టింగ్‌పైనే దృష్టిపెట్టు. అనుపమా మంచి నటి. ఈ సంక్రాంతికి మా ‘ఆర్‌ఆర్‌ఆర్’ రాకపోయినా బాధగా లేదు.. ఎందుకంటే మూడున్నరేళ్లు కష్టపడ్డ సినిమా కరెక్ట్ టైమ్‌లో రావాలి. ఎప్పుడు రావాలన్నది రాజమౌళి, దానయ్యగార్లు నిర్ణయిస్తారు. నన్ను ఆశీర్వదించి నట్లే ఆశిష్‌ని కూడా ఆశీర్వదించండి.. ‘రౌడీ బాయ్స్’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ వేడుకలో డైరెక్టర్స్ వేణు శ్రీరాం, అనిల్ రావిపూడి, ‘ఆదిత్య’ మ్యూజిక్ ఆదిత్య, నిరంజన్, మాధవన్, పాటల రచయితలు సుద్దాల అశోక్ తేజ, కృష్ణకాంత్, శ్రీమణి, సహ నిర్మాత హర్షిత్, సింగర్స్ మంగ్లీ, రోల్ రైడా, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్, నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment