
కథ నచ్చితే చాలు స్టార్ హీరో, యంగ్ హీరో అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేసేందుకు సై అంటుంది అనుపమ పరమేశ్వరన్. ఈ క్రమంలో దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమవుతున్న 'రౌడీ బాయ్స్' సినిమాలో అనుపమ అతడితో జోడీ కట్టింది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌లో ఈ కుర్రహీరోతో లిప్‌లాక్ సీన్లలో నటించింది మలయాళ కుట్టి. ఇది ఆమె అభిమానులకు అస్సలు నచ్చలేదు. డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతావా? అంటూ ఆమెను ఓ ఆటాడుకుంటూ మీమ్స్ వదిలారు.
తాజాగా అనుపమ, ఆశిష్ ఈ ట్రోలింగ్‌పై స్పందించారు. ముద్దు సన్నివేశాలపై వచ్చిన మీమ్స్ చూసి గట్టిగా నవ్వేశారు. అయితే అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నందుకు సారీ చెప్పిన అనుపమ ఇకపై ఆశిష్‌ను టచ్ చేయనని స్పష్టం చేసింది. ఇకపోతే సినిమాలో ముద్దులిచ్చుకుంది తాము కాదని తమ పాత్రలని చెప్పుకొచ్చింది. ఆ సీన్లు ఎందుకున్నాయో సినిమా చూశాక జనాలకే అర్థమవుతుందని తెలిపింది. రౌడీ బాయ్స్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 థియేటర్లలో రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment