నిజాలే చూపించాం | Baggidi Gopal to release on February 28 | Sakshi
Sakshi News home page

నిజాలే చూపించాం

Published Tue, Jan 28 2020 3:34 AM | Last Updated on Tue, Jan 28 2020 3:34 AM

Baggidi Gopal to release on February 28 - Sakshi

బగ్గిడి గోపాల్, రామసత్యనారాయణ, సుమన్‌

‘‘1982 మార్చి నెలలో రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. ఎన్టీ రామారావుగారు పెట్టిన పార్టీలో నేను చేసిన కృషి ‘బగ్గిడి గోపాల్‌’ చిత్రంలో చూపించాం. నా జీవితంలో జరిగిన కీలక సంఘటనలు ఈ సినిమాలో చూపిస్తాం’’ అన్నారు బగ్గిడి గోపాల్‌. ఆయన జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘బగ్గిడి గోపాల్‌’. బగ్గిడి గోపాల్‌ నిర్మించిన ఈ సినిమాకు అర్జున్‌ కుమార్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేయాలనుకుంటున్నారు.

‘‘ఈ కథ ఆదర్శంగా ఉంటుంది. పోలీస్‌ అధికారిగా నటిస్తున్నాను’’ అన్నారు సుమన్‌. ‘‘గోపాల్‌ ఎంఎల్‌ఏ అయిన తర్వాత జరిగిన సంఘటనలు నాకు తెలుసు. ఈ సినిమాలో అన్నీ నిజాలు చూపించారు. ముక్కుసూటి మనిషి అయిన తనను చాలా ఇబ్బంది పెట్టారు. అవి ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు మాజీ ఎంఎల్‌ఏ సంజయ్‌రావు. ‘‘దర్శకత్వంతో పాటు ఓ పాత్రలోనూ నటించాను’’ అన్నారు అర్జున్‌ కుమార్‌. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హీరోయిన్‌ చందన మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement