మహబూబ్‌నగర్: తెల్లారితే పెళ్లి చూపులకు వెళ్లాల్సి ఉండగా.. గ్రానైట్ బండలు మీదపడి మండలానికి చెందిన యువకుడు మృత్యువాత పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన తెలుగు వాకిటి దొడ్డెన్న కుమారుడు తెలుగు వాకిటి ఇంద్ర (21) మండల కేంద్రంలోని రైస్ మిల్లులో ఆపరేటర్‌గా పని చేస్తుండేవాడు.
ఆదివారం రాత్రి ఇంటి నిర్మాణం కోసం తెచ్చుకున్న గ్రానైట్ బండల లోడు డీసీఎంలో మండల కేంద్రానికి చేరుకుంది. రైస్ మిల్లు దగ్గర డీసీఎం నుంచి బండలను కిందకు దింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు బండలు యువకుడిపై పడడంతో తలకు వెనుకభాగంలో బలమైన గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం ఆయనను గద్వాల ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని తండ్రి ఫిర్యా దు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ నందికర్ తెలిపారు.
సోమ వారం రోజు మృతుడికి పెళ్లి చూపులకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా తెల్లారక ముందే మృత్యు రూపంలో బండలు కబళించి వేయడంతో ఆ కుటు ంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలు సుకున్న గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment