ఇంద్ర మళ్లీ వస్తున్నాడు | Megastar Chiranjeevi 2002 Blockbuster Movie Indra To Re-Release On His Birthday, Check Release Date Details | Sakshi
Sakshi News home page

Indra Re Release Date: ఇంద్ర మళ్లీ వస్తున్నాడు

Published Thu, Jul 25 2024 12:23 AM | Last Updated on Thu, Jul 25 2024 1:14 PM

Megastar Chiranjeevi 2002 Blockbuster Indra To Re-Release On His Birthday

చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఇంద్ర’ (2002). ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ  బింద్రే హీరోయిన్లుగా నటించారు. బి. గోపాల్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ యాక్షన్‌ డ్రామా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. 

ఈ చిత్రంలో ఇంద్ర సేనారెడ్డి అలియాస్‌ శంకర్‌ నారాయణ పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమా రీ–రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. వైజయంతీ మూవీస్‌ 50 గోల్డెన్‌ ఇయర్స్‌ని సెలబ్రేట్‌ చేస్తూ,  చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘ఇంద్ర’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement