టాలీవుడ్‌లో కొంతకాలంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయినా చాలా చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. ఇటీవల హీరోల బర్త్ డే రోజున బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ సైతం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ఇంద్ర మూవీని మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకుంది.
కాగా..2002లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే మెగాస్టార్ సరసన హీరోయిన్లుగా నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించారు. కాగా.. ఆగస్టు 22న వైజయంతి మూవీస్ స్థాపించి 50 ఏళ్ల పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే 50 స్వర్ణోత్సవాల వేడుకతో పాటు చిరంజీవి బర్త్ డే కావడంతో ఇంద్ర సినిమాను మరోసారి టాలీవుడ్ ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
22 glorious years of MEGA BLOCKBUSTER #Indra, a film that etched its mark on cinema and our hearts forever ❤️
In celebration of 50 GOLDEN YEARS OF VYJAYANTHI MOVIES, let’s relive the magic with a 𝐆𝐫𝐚𝐧𝐝 𝐑𝐞-𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐨𝐧 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟐, in honour of Megastar… pic.twitter.com/jF3eSXrUX7— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2024
Comments
Please login to add a commentAdd a comment