Indra Movie
-
‘వన్స్ మోర్’ అంటున్న ఫ్యాన్స్.. పాత సినిమాలే సరికొత్తగా!
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ... ఇలా భాష ఏదైనా ప్రస్తుతం ‘వన్స్ మోర్’ అంటూ రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ ట్రెండ్ తెలుగులో ఇంకాస్త ఎక్కువగా ఉంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అమితాసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల పుట్టినరోజు కావచ్చు లేదా ఆ సినిమాకి ఏదైనా ప్రత్యేకమైన రోజు కావచ్చు... సందర్భం ఏదైనా రీ రిలీజ్‌కి హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా రీ రిలీజ్లో కూడా ఆయా సినిమాలు భారీగానే కలెక్షన్స్ కొల్లగొడుతుండటం కూడా ఓ కారణం. ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకులు కూడా ‘వన్స్ మోర్’ అంటూ ఆ సినిమాలను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత చిత్రాలను 4కె క్వాలిటీతో అందిస్తుండటంతో ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. చిరంజీవి ‘ఇంద్ర’ ఈ నెల 22న విడుదల కాగా, నాగార్జున ‘శివ’, పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’, ప్రభాస్ ‘ఈశ్వర్, డార్లింగ్’, ధనుష్ ‘త్రీ’ వంటి సినిమాలు రీ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఆ విశేషాల్లోకి...మొక్కే కదా అని... ‘వీరశంకర్ రెడ్డి... మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’, ‘షౌకత్ అలీఖాన్... తప్పు నావైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నా... లేకుంటే తలలు తీసుకెళ్లేవాణ్ణి’, ‘సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది... ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది’.. వంటి డైలాగులు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి చెబుతుంటే అభిమానుల, ప్రేక్షకుల ఈలలు, కేకలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘ఇంద్ర’. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమా చిరంజీవి బర్త్ డే కానుకగా 2002 జూలై 22న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రత్యేకించి మణిశర్మ సంగీతం, పాటలకు తగ్గట్టు చిరంజీవి డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఇంద్ర’ విడుదలైన 22 ఏళ్లకు సరిగ్గా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమాని మళ్లీ విడుదల చేశారు మేకర్స్. రీ రిలీజ్లోనూ థియేటర్లలో మెగా ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. ప్రత్యేకించి పాటల సమయంలో స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు వేస్తున్నారు. 22 ఏళ్లకు రీ రిలీజైన ‘ఇంద్ర’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళుతుండటం విశేషం. సైకిల్ చైన్‌తో... నాగార్జున నటించిన చిత్రాల్లో రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ వెండితెర పైకి రానున్నాయి. ఒకటి ‘శివ’, మరోటి ‘మాస్’. సైకిల్ చైన్ చేతికి చుట్టి విలన్లను రఫ్ఫాడించే ట్రెండ్ సెట్ చేసిన చిత్రం ‘శివ’. నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రంలో అమల హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ద్వారా రామ్‌గోపాల్ వర్మ దర్శకునిగా పరిచయమయ్యారు. కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు, గ్యాంగ్‌లు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం స్టూడెంట్స్‌ని ఎలా ఉపయోగించుకుంటారు? విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవలు సృష్టిస్తారు? ఇలాంటి సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించారు వర్మ. అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతంలో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాని ‘శివ’ (1990) పేరుతోనే హిందీలో రీమేక్ చేసిన రామ్‌గోపాల్ వర్మ అక్కడ కూడా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 35 ఏళ్లకి ‘శివ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 29న నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘శివ’ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే.. మరోసారి సైకిల్ చైన్ చేతికి చుట్టి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించేందుకు రానున్నాడు శివ. మమ్మమ్మాస్ ‘వచ్చే నెల ఒకటో తారీఖుకి నువ్వు ఉండవ్.. పదిహేనో తారీఖుకి నీకు భయమంటే ఏంటో తెలుస్తుంది.. ఇరవయ్యో తారీఖుకి నిన్ను ఎదిరించడానికి ఒక మగాడు వచ్చాడని జనానికి తెలుస్తుంది.. ఇరవైఅయిదో తారీఖుకి పబ్లిక్‌కి నువ్వంటే భయం పోతుంది.. ఒకటో తారీఖు నువ్వు ఫినిష్’ అంటూ తనదైన స్టైల్లో నాగార్జున చెప్పిన డైలాగ్స్ ‘మాస్’ చిత్రంలోనివి. కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘మాస్’. ఈ మూవీలో జ్యోతిక, ఛార్మీ కౌర్ హీరోయిన్లు. అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమా 2004 డిసెంబరు 23న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. కాగా దాదాపు 20 ఏళ్లకు మమ్మమ్మాస్ అంటూ ‘మాస్’ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 28న ‘మాస్’ సినిమాని రీ రిలీజ్ చేస్తోంది యూనిట్. తిక్క చూపిస్తా... ‘నాక్కొంచెం తిక్కుంది... కానీ దానికో లెక్కుంది... నా తిక్కేంటో చూపిస్తా... అందరి లెక్కలు తేలుస్తా’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్స్ మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘దబాంగ్’కి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’లో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. బండ్ల గణేశ్ నిర్మించిన ఈ సినిమా 2012 మే 11న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. కాగా 12 ఏళ్ల తర్వాత ‘గబ్బర్ సింగ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.ధూల్‌పేట్ ఈశ్వర్ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఒకటి... ఆయన తొలి చిత్రం ‘ఈశ్వర్’. మరోటి ‘డార్లింగ్’. నటుడు కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి చిత్రం ‘ఈశ్వర్’. ఈ మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్గా నటించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ తన మాస్ హీరోయిజమ్‌ను చూపించారు. కె. అశోక్ కుమార్ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న విడుదలై, ఘన విజయం సాధించింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం ఈ చిత్ర విజయానికి ప్లస్ అయింది. దాదాపు 22 ఏళ్లకు మరోసారి ‘ఈశ్వర్’ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఈశ్వర్’ని రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. లవర్ బాయ్ డార్లింగ్ ప్రభాస్ లోని లవర్ బాయ్‌ని చక్కగా తెరపై చూపించిన చిత్రం ‘డార్లింగ్’. ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 23న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రత్యేకించి ప్రభాస్–కాజల్ ఒకరినొకరు ఆట పట్టించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. పద్నాలుగేళ్ల తర్వాత ‘డార్లింగ్’ మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డేని పురస్కరించుకుని ‘డార్లింగ్’ని రిలీజ్ చేస్తున్నారు. సో.. తన బర్త్‌డే సందర్భంగా ‘ఈశ్వర్, డార్లింగ్’ సినిమాలతో ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇవ్వనున్నారు ప్రభాస్. మళ్లీ కొలవెరి ధనుష్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘3’. రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించారు. కస్తూరి రాజా విజయలక్ష్మి నిర్మించిన ఈ చిత్రం 2012 మార్చి 30న రిలీజై హిట్‌గా నిలిచింది. రామ్‌గా ధనుష్, జననిగా శ్రుతీహాసన్‌ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రత్యేకించి టీనేజ్ ప్రేమికుడిగా, మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా ధనుష్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా హిట్‌ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ధనుష్ పాడిన ‘వై దిస్ కొలవెరి డి’ పాట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా పన్నెండేళ్ల తర్వాత ‘త్రీ’ని మరోసారి పాన్ ఇండియా స్థాయిలో రీ రిలీజ్ చేయనుంది యూనిట్. సెప్టెంబర్ 14న రిలీజ్ చేయనున్నారని టాక్. ఇవే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా రీ రిలీజ్ కానున్నా యని టాక్. -
ఇంద్ర గుర్తుగా.. అశ్వనీదత్‌కు కానుక ఇచ్చిన చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఇంద్ర సినిమా రీ-రిలీజ్ అయింది. చిరు కెరియర్లో ఇంద్ర సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సినిమాను అందించిన నిర్మాత అశ్వనీదత్‌కు చిరంజీవి విలువైన కానుకను అందించారు. ఎన్నో రికార్డ్స్‌ను కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని 4కె వెర్షన్లో వైజయంతి మూవీస్ రీ-రిలీజ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొదటిరోజే ఏకంగా రూ.3.05 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సంతోష సమయంలో ఇంద్ర సినిమాకు పనిచేసిన కీలక వ్యక్తులను చిరంజీవి సత్కరించారు.ఇంద్ర సినిమాలో భాగమైన నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు బి.గోపాల్, సంగీత దర్శకుడు మణిశర్మ, సినీ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, కథ రచయిత చిన్నికృష్ణలను తన ఇంటికి ఆహ్వానించిన చిరు వారిని సత్కరించారు. ఈ క్రమంలో నిర్మాత అశ్వనీదత్‌కు ఒక శంఖాన్ని బహుమతిగా చిరు ఇచ్చారు. తాజాగా ఇదే విషయాన్ని అశ్వనీదత్ తన ఎక్స్ పేజీ ద్వారా ఇలా తెలిపారు. 'మీరు ఈ విజయశంఖాన్ని కానుకగా నాకు ఇచ్చారు ... కానీ ఇంద్రుడై, దేవేంద్రుడై పూరించింది మాత్రం ముమ్మాటికీ మీరే. ఈ కానుక అమూల్యం. ఈ జ్ఞాపకం అపురూపం. అదెప్పటికీ నా గుండెల్లో పదిలం.' అంటూ పేర్కొన్నారు. వైజయంతి మూవీస్‌లో మెగాస్టార్ ఇప్పటి వరకు జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని వుంది,ఇంద్ర, జై చిరంజీవ చిత్రాల్లో నటించారు. అయితే, త్వరలో ఐదో చిత్రం కూడా నిర్మిస్తానని అశ్వనీదత్ ప్రకటించారు.2002 జులై 22 ‘ఇంద్ర’ రిలీజ్ అయింది. మొత్తం 268 స్క్రీన్లలో ఇంద్ర సినిమాని రిలీజ్ చేశారు. 35 కేంద్రాలలో 100 రోజులు, 22 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. చిరు రెమ్యునరేషన్ కాకుండా రూ. 7కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తే రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. -
మెగాస్టార్‌తో డ్యాన్స్ చేసేందుకు భయపడ్డా: ఇంద్ర హీరోయిన్
తనదైన నటనతో అభిమానుల గుండెల్లో ప్రత్యేకస్థానం దక్కించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈనెల 22న ఆయన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ చేయనున్నారు. 2002లో విడుదలైన ఈ చిత్రంలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ మూవీని మరోసారి థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ సోనాలి బింద్రే.. ఇంద్ర రీ రిలీజ్ కావడంపై స్పందించింది. చిరంజీవి పక్కన నటించడం తనకు దక్కిన అతిపెద్ద గౌరవమని అన్నారు. ఆయనతో కలిసి స్టెప్పులు వేయడం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఇంద్ర షూటింగ్ సమయంలో చిరుతో డ్యాన్స్ వేసేందుకు భయపడేదాన్ని అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరిగిన సమయంలో చాలా ఎంజాయ్ చేశానని.. చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారని వెల్లడించారు. మరోసారి ఇంద్ర మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని.. బిగ్స్క్రీన్పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోనాలి బింద్రే తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ తన ట్విటర్లో షేర్ చేశారు. Relive the magic of #INDRA with @iamsonalibendre as she takes us down memory lane and shares her excitement for the August 22nd re-release. 🎬https://t.co/RBGJ5iBcYq#Indra4K Megastar @KChiruTweets @AshwiniDuttCh #BGopal #AarthiAgarwal @tejasajja123 #ManiSharma @GkParuchuri… pic.twitter.com/KFFkCHHlze— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 21, 2024 -
మెగాస్టార్ బర్త్ డే.. రీ రిలీజవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ!
టాలీవుడ్లో కొంతకాలంగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. గతంలో సూపర్ హిట్ అయినా చాలా చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేశాయి. ఇటీవల హీరోల బర్త్ డే రోజున బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ సైతం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన ఇంద్ర మూవీని మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకుంది.కాగా..2002లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే మెగాస్టార్ సరసన హీరోయిన్లుగా నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించారు. కాగా.. ఆగస్టు 22న వైజయంతి మూవీస్ స్థాపించి 50 ఏళ్ల పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే 50 స్వర్ణోత్సవాల వేడుకతో పాటు చిరంజీవి బర్త్ డే కావడంతో ఇంద్ర సినిమాను మరోసారి టాలీవుడ్ ఫ్యాన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.22 glorious years of MEGA BLOCKBUSTER #Indra, a film that etched its mark on cinema and our hearts forever ❤️In celebration of 50 GOLDEN YEARS OF VYJAYANTHI MOVIES, let’s relive the magic with a 𝐆𝐫𝐚𝐧𝐝 𝐑𝐞-𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞 𝐨𝐧 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟐𝟐, in honour of Megastar… pic.twitter.com/jF3eSXrUX7— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 24, 2024 -
'ఇంద్ర' సినిమాలో అందుకే నటించలేదు: పరుచూరి గోపాలకృష్ణ
ఇంద్ర సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా పూర్తై 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నాడు పరుచూరి గోపాలకృష్ణ. 'ఇంద్ర సినిమా చేయుండకపోతే ఆ వైభవాన్ని మేము అనుభవించేవాళ్లం కాదు. చిరంజీవి అభిమానులే కాదు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఇంద్ర. ఇందుకు చిన్నికృష్ణ కథ, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, బి.గోపాల్ దర్శకత్వం, చిరంజీవి నటనే కారణం.అంత గొప్ప సినిమా కథను మొదట బి.గోపాల్ వద్దన్నారు. కారణమేంటంటే.. ఆయన తెరకెక్కించిన గత రెండు చిత్రాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడులోని హీరోల పాత్ర చిత్రీకరణ కాస్త ఈ సినిమాలో ఉన్నట్లే ఉంది. కాబట్టి మళ్లీ అలాంటి సినిమానే చేస్తే ఏమవుతుందోనని భయపడ్డాడే తప్ప కథ బాలేదని మాత్రం అనలేదు. అలా బి.గోపాల్, అశ్వనీదత్ సినిమా చేయడానికి సముఖత వ్యక్తం చేయలేదు. చిరంజీవిగారు ఓ అద్భుతమైన సినిమా మిస్ అయిపోతున్నారు.. ఎలా అని బాధపడ్డా. విషయం చిరంజీవికి చెప్పాను. వాళ్లిద్దరూ లేకుండానే రేపు చిన్నికృష్ణతో వచ్చి నాకు కథ చెప్పండి అన్నారు. కథ చెప్పాం.. ఇంటర్వెల్ అవగానే లేచి కిళ్లీ వేసుకుని సెకండాఫ్ వినక్కర్లేదు.. హిట్ అవుతుందన్నారు. కథ పూర్తయ్యే సరికి పక్క గదిలో నుంచి అశ్వనీదత్, బి.గోపాల్ వచ్చి కూర్చున్నారు. అందరం కలిసి చేద్దామన్నారు. ఇంద్రలో తనికెళ్ళ భరణి పోషించిన పాత్ర మొదట నాకే వచ్చింది. కానీ మోకాలి నొప్పితో అంతదూరం ప్రయాణం చేయలేక నేను వదిలేసుకున్నా. అలాగే డైలాగ్స్ రైటర్ అయిన నేను మూగపాత్రలో నటిస్తే జనాలు ఆదరిస్తారా? అనుకున్నా. అందుకే మూగపాత్ర ఎందుకులే అని చేయనని చెప్పా! అలా మంచి సినిమాలో అవకాశం చేజారింది. కానీ మేము రాసిన 'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా' అనే డైలాగ్ ఇప్పటికీ మారుమోగిపోతూనే ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. చదవండి: షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్, వీడియో వైరల్ నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ -
ప్రపంచంలోనే అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక సినిమా అదే!
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా చిరంజీవి తనదైన ముద్ర వేసుకున్నారు. ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ప్రేక్షకులు చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ సినిమాలు హిట్‌గా నిలిచినప్పటికి ‘గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు’ అంతటి సక్సెస్ రాలేదు. ఇక కొంతకాలం తర్వాత ఆయన హీరోగా చేసిన ఫ్యాక్షన్ మూవీ ‘ఇంద్ర’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా గురించి చర్చించుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2002లో జూలై 24న విడుదలైంది. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రెలు కథానాయికలుగా నటించారు. ఈ మూవీ వచ్చి 18 ఏళ్లు గడిచిన ఇందులోని చిరంజీవి ఇంద్రసేనా రెడ్డిగా చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఇప్పటికి ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంటాయి. అప్పట్లోనే ఈ మూవీ రాష్ట్రంలోనే అత్యధిక సెంటర్లో విడుదలై 100 రోజులకు పైగా ఆడి రికార్డుల మోత మోగించింది. అలా ఫ్యాక్షన్ మూవీ ఇంద్ర ఓ ట్రెండ్ సెట్ చేసిందనడంలో సందేహం లేదు. అంతటి ఘన విజయం సాధించిన ఈ మూవీ టికెట్లు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా అమ్ముడవడం మరో రికార్డుగా చెప్పుకొవచ్చు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినిదత్ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లోనే రూ. 35 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం నిజంగా పెద్ద విశేషం. చదవండి: నితిన్‌కు జోడిగా హైబ్రిడ్ పిల్లా... ఈసారైనా ఒప్పుకుంటుందా! వైల్డ్‌డాగ్ మూవీపై చిరు రివ్యూ.. ఆయన ఏమన్నారంటే.. -
కాశీలో వదిలేస్తా!
సమ్సారం సంసారంలో సినిమా ‘‘ఒరేయ్! వెధవా! మా ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేశావా. ఏంటో కాశీలో గంగా స్నానం చేయక పోతే జీవితానికి పరిపూర్ణత వచ్చినట్లే ఉండదు’’ స్కూలు బ్యాగ్ ఖుషీ వీపుకి తగిలిస్తూ అడిగింది లక్ష్మీదేవి.‘‘నీకూ, నాన్నకీ రానుపోనూ టిక్కెట్లు, ఉండడానికి బస కూడా రెడీ. టిక్కెట్లు నిన్ననే నాన్నకిచ్చాను’’ భార్య ముందు ఒరేయ్తో సరిపెట్టకుండా వెధవా మకుటం కూడా చేర్చినందుకు లోలోపలే కస్సుబుస్సుమంటున్నాడు భాస్కర్.‘‘బై అమ్మా, నాన్నా, నానమ్మా స్కూలుకి వెళ్లొస్తా’’ అని బెడ్రూమ్లోకి చూస్తూ ‘‘తాతయ్యా! బై. సాయంత్రం నేనొచ్చే లోపు కాశీకెళ్లిపోతారా’’ అడిగింది ఖుషీ. ‘‘అవును తల్లీ, మధ్యాహ్నమే రైలు. నువ్వొచ్చేసరికి బయలుదేరుతాం’’ అంటూ తనూ హాల్లోకి వచ్చి మనుమరాల్ని దగ్గరకు తీసుకున్నాడు తాతయ్య. ‘‘మళ్లీ ఎప్పుడొస్తారు నానమ్మా’’లక్ష్మీదేవి దగ్గరకు వెళ్లి ఆమెను చుట్టుకుంటూ గారాలు పోయింది ఖుషీ. ‘‘ఫిఫ్టీన్ డేసే... రెండు సన్డేల తర్వాత వచ్చేస్తాం బంగారూ’’ ఎంతో దూరంలో లేదన్నట్లు ఆ చిట్టిబుర్రకు నచ్చేలా చెప్పాడు తాతయ్య. ‘‘పాపకు సాక్స్ వేసే ముందు పాదాలు, వేళ్ల సందుల్లో పౌడర్ వేయండి’’ అన్నది సౌందర్య కిచెన్‌లో పాప లంచ్‌బాక్స్ సర్దుతూ.‘‘నీకెన్ని సేవలు చేయాలే తల్లీ. కాళ్లకూ పౌడరేయాలా’’ అంటూ డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న పౌడర్ డబ్బా తీసుకుని ముందుగదిలోకొచ్చాడు భాస్కర్. ‘‘పౌడర్ వేయకపోతే సాయంత్రానికి పాదాలు చెమట పట్టి నానిపోతాయి నాన్నా’’ అన్నది ఖుషీ. కళ్లు, నోరు, చేతులూ తిప్పుతూ తనకంతా తెలుసన్నట్లు ఆరిందలా చెప్పింది కానీ, ఆ గొంతులో నాన్నా నీకిది కూడా తెలియదా అనే టోన్ వినిపిస్తోంది భాస్కర్‌కి. ఖుషీకి షూస్ వేసి బకిల్ పెడుతున్నాడు భాస్కర్. ‘‘ఇంకా వేయలేదా’’ అంటూ లంచ్‌బాక్స్, వాటర్ బాటిల్ సర్దిన బాస్కెట్ తెచ్చింది సౌందర్య. ‘‘షూస్ కరెక్ట్ సైజ్ తెచ్చావు. రెణ్నెల్లకే టైట్ అవుతాయి. మళ్లీ కొత్తవి కొనాలి. డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?’’ సౌందర్య కనిపించగానే భాస్కర్ అసహనం మాటల్లో ప్రవహించింది. భాస్కర్ వైపు ఓ సారి చూసి లోపలికి వెళ్లింది సౌందర్య స్కూల్ బ్యాగ్ తేవడానికి.‘‘నాన్నా! అమ్మ షూస్‌లోపల కాటన్ పెట్టింది. ఇప్పుడు నాకు సరిపోతున్నాయి. టైట్ అయినప్పుడు ఆ కాటన్ తీసేస్తుందట’’ ఖుషీ మెల్లగా చెవిలో చెప్పినట్లే చెప్పింది. కానీ భాస్కర్‌కి మాత్రం ‘నాన్నా! నీకిది కూడా తెలియదు’ అని ఎగతాళి చేస్తున్నట్లే ఉంది.‘‘నానమ్మ, తాతయ్య ఇంకా ఎన్నిరోజులకొస్తారు నాన్నా’’ అడిగింది ఖుషీ సడెన్‌గా. ‘‘దానికి రెండ్రోజులుగా వాళ్ల నానమ్మ గుర్తుకొస్తోంది. బెంగపెట్టుకున్నట్లుంది. ఫోన్ చేసినప్పుడు మాట్లాడించకపోయారా’’ స్కూలు బ్యాగ్ తెస్తూ అంది సౌందర్య. ‘‘నానమ్మా, తాతయ్యా’’ అరుస్తూ ఎదురెళ్లింది ఖుషీ.‘‘మీ నాన్న నీకు ఏమంటూ ఖుషీ అని పేరు పెట్టాడో కానీ, ఎప్పుడూ సంతోషంగా ఉంటావ్ బంగారు తల్లీ’’ మురిసిపోతూ మనుమరాలిని దగ్గరకు తీసుకుంది లక్ష్మీదేవి.‘‘మీ నాన్న నీకు లక్ష్మీదేవి అని పెట్టారు. ఏం లక్షలు కారిపోతున్నాయిక్కడ’’ బ్యాగ్ కింద పెట్టి సోఫాలో కూర్చుంటూ సాగదీశాడు ఖుషీ తాతయ్య. ‘‘నన్ను చేసుకోకముందు కోట్లు లెక్కపెట్టడానికి చేతులు నొప్పెట్టి పదిమంది జీతగాళ్లను పెట్టుకున్న వాళ్లాయే పాపం’’ మూతి విరిచింది లక్ష్మీదేవి. ‘‘స్నానాలు చేయండి, తర్వాత మాట్లాడుకుందాం’’ అంది సౌందర్య కాఫీ ఇస్తూ. ఖుషీ కోసం తెచ్చిన బొమ్మలు, కొడుకు, కోడలికి తెచ్చిన డ్రస్‌లు తీసి బయట పెడుతోంది లక్ష్మీదేవి. ‘‘నీకేం తెచ్చుకున్నావ్ నానమ్మా’’ అంటూ బ్యాగ్‌లో ఉన్న గులాబీ రంగు చీరను బయటకు తీసింది ఖుషీ. ‘‘ఈ కలర్ శారీస్ మీకు చాలానే ఉన్నాయి కదత్తయ్యా’’ అంటూ ఆ చీరను చేతిలోకి తీసుకుంది సౌందర్య.‘‘మీ మామయ్యతో వెళ్తే ఇక మరే రంగూ తీసుకోనివ్వడు కదా మరి’’ ఆ మాటలో విసుగు, కొంచెం మురిపెం కూడ.‘‘పెళ్లి చూపుల్లో ఈ రంగు చీరతోనే నన్ను మోసం చేశారు మీ వాళ్లు. కనీసం ఆ భ్రమలోనైనా బతుకుదామని’’ కౌంటర్ పడేసి తన బ్యాగ్ తీసుకుని గదిలోకి వెళ్లాడు ఖుషీ తాతయ్య.బ్యాగ్ ఓపెన్ చేసి లక్ష్మీదేవి తన కోసం కొన్న ముఖమల్ షాల్ని చేతిలోకి తీసుకున్నాడు. దానిని చేత్తో తడుముతూంటే పెదవుల మీద మెత్తటి చిరునవ్వు. ఎప్పుడో మాటల సందర్భంలో ముఖమల్ షాల్ తనకిష్టమని చెప్పాడు. ఎన్నేళ్లయిందో అలా చెప్పి. ఆ మాట గుర్తుపెట్టుకుని మరీ ఎక్కడికెళ్లినా అలాంటి షాల్ కోసమే వెతికేదట. అది దొరికే వరకు ఆ మాట కూడా చెప్పనేలేదు. రైల్లో వస్తూ చెప్పింది ఇన్నేళ్ల అన్వేషణ గురించి. తన ఇష్టాలను నేను గుర్తు పెట్టుకుని తీర్చినవి ఏమైనా ఉన్నాయా... అంతర్మధనం మొదలైంది ఆయనలో. ‘‘కాశీలో ఏం వదిలారత్తయ్యా’’ ఇడ్లీల హాట్‌బాక్స్ టేబుల్ మీద పెడుతూ అడిగింది సౌందర్య. లక్ష్మీదేవి పూజలో ఉంది.. విన్నట్లు లేదు. ‘‘కాశీలో ఏం వదులుతారమ్మా’’ ఖుషీ అందుకుంది. ‘‘కాశీకెళ్లిన వాళ్లు గయలో తమకు ఇష్టమైన వాటిని వదిలి వస్తారు. అమ్మమ్మ తనకు బాగా ఇష్టమైన గుత్తివంకాయ కూరను వదిలేసింది, తాతయ్యేమో...’’ సౌందర్య చెప్తుండగానే ‘‘మా నాన్నకు కొబ్బరి పచ్చడి ఇష్టం కదా, ఇడ్లీలోకి కొబ్బరి పచ్చడి చేయకూడదా సౌందర్యా’’ భాస్కర్ ప్లేటులో ఇడ్లీ పెట్టుకుంటూ అన్నాడు. మాటల్లోనే లక్ష్మీదేవి కూడా వచ్చి ప్లేటు తీసుకుంది ‘‘నానమ్మా! కాశీలో ఏం వదిలొచ్చావు’’ అడిగింది ఖుషీ. b‘‘మీ తాతయ్యను వదిలేద్దామనుకున్నా, వదిలేసినా రైలెక్కి ఇంటికే కదా వస్తాడు... అందుకే ఎక్కడికెళ్లినా తప్పని తద్దినాన్ని వదిలిపెట్టడం ఎందుకని తీసుకొచ్చా’’ అంది గదిలోకి వినిపించేటట్లు. ‘‘అందుకే చెబుతారు కాశీకి వెళ్లినా రాసినమొగుడేనని’’ గదిలో నుంచే రిటార్ట్. ‘‘నాన్నా! నువ్వు, అమ్మ కూడా కాశీకి వెళ్తారా’’ భాస్కర్ తలలో తెల్ల వెంట్రుకను లాగుతూ అడిగింది ఖుషీ.‘‘ఆ వెళ్తాం, నేనైతే మీ నాన్నను అక్కడే వదిలేసి వస్తా. మీ నానమ్మలా తిరిగి తీసుకురాను’’ అంది సౌందర్య దుప్పటి ముసుగుపెట్టుకుంటూ.‘‘నాన్నా! మరి... నసుగుతోంది’’ ఖుషీ.‘‘ఏంటి తల్లీ! చెప్పు’’ అన్నాడు భాస్కర్ కూతురిని బుగ్గలు పుణుకుతూ.‘‘మరి నాకు రోజూ స్కూల్‌కెళ్లేటప్పుడు షూస్ ఎవరేస్తారు, స్కూలు దగ్గర ఎవరు దింపుతారు?’’‘‘!?!’’ భాస్కర్‌కి నో డైలాగ్. స్టోరీ ఎండ్. సినిమాలో సంసారం తత్త్వం... బోధపడింది! శంకర్ నారాయణ (చిరంజీవి) వారణాశిలో(కాశీ) ట్యాక్సీ డ్రైవర్. కాశీ కొచ్చిన బాలుని(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) అన్ని ఘాట్ వద్దకు తీసుకెళ్లి చూపించడానికి, కాశీ విశిష్టతను వివరించడానికి రూ.300 బేరం కుదుర్చుకుంటాడు శంకర్ నారాయణ. ఇద్దరూ గంగా నదిలో పడవలో వెళుతుంటారు. ‘కళలు 64 ఎలా ఉన్నాయో అలాగే ఈ ఘాట్స్ కూడా 64 ఉన్నాయండీ. పురాణాల్లో హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేసిన ఘాట్ అదేనండీ. ప్రపంచమంతా బ్రతకడం కోసం చస్తుంటారండీ. కానీ, కాశీలో మాత్రం చావడం కోసమే బ్రతుకుతుంటారండీ’ అంటాడు శంకర్. నువ్వు మాట్లాడుతుంటే ట్యాక్సీ డ్రైవర్ మాట్లాడుతున్నట్లు లేదు. ఆ అర్జునుడి రథం తోలిన కృష్ణ పరమాత్ముడు మాట్లాడుతున్నట్లుంది అంటాడు బాలు. ‘పొగడ్త పన్నీరు లాంటిదండీ.. అది ఒంటిమీద చల్లుకోవాలే తప్ప బాగుంది కదాని తాగేయకూడదు’ బదులిస్తాడు శంకర్ నారాయణ ‘ఇంద్ర’ సినిమాలో. జీవితంలో అనురాగం, సంతోషం, త్యాగం, వైరాగ్యం... అన్నీ ఉండాలనే తత్త్వం బోధపడుతుంది. – మంజీర -
డై..లాగి కొడితే....
సినిమా : ఇంద్ర రచన: పరుచూరి బ్రదర్స్, దర్శకత్వం: బి.గోపాల్ వీరశంకర్ రెడ్డి (ముఖేష్ రిషి) చిన్న కొడుకును లారీ ప్రమాదం నుంచి ఇంద్రసేనా రెడ్డి (చిరంజీవి) కాపాడతాడు. ‘పగోడు పెట్టిన ప్రాణ భిక్షతో బ్రతికే బిడ్డ నాకొద్దు’ అంటూ వీరశంకర్ రెడ్డి తన కొడుకుని కత్తితో పొడిచి చంపి, శవాన్ని ఇంద్రన్నకు పంపిస్తాడు. ఆ బాలుడి శవాన్ని వీరశంకర్ రెడ్డి ఇంటికి తీసుకొస్తాడు ఇంద్రసేనా రెడ్డి. ఆ ఇంటి గుమ్మం ముందే పూడ్పించి, తులసి మొక్క నాటుతాడు. ‘చూడమ్మా.. నీ కొడుకు ఆకారం నీకు దూరమైందే తప్ప.. ఆత్మ ఈ తులసి మొక్కలో ఉంది. ప్రతిరోజు నీళ్లు పోసి పెంచు. పెరిగే ఈ మొక్కను చూస్తే ఎదిగే నీ కొడుకు నీకు గుర్తుకు రావాలి. అతనికి తను చేసిన పాపం గుర్తుకు రావాలి’ అని వీరశంకర్ రెడ్డి భార్యకు చెప్పి వెళుతుండగా, వీరశంకర్ రెడ్డి ఆ మొక్కను పీకేయబోతాడు. అప్పుడు ‘వీరశంకర్ రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అంటూ ఇంద్రసేనా రెడ్డి వార్నింగ్ ఇస్తాడు. ఆ డైలాగ్ తెగ పాపులర్ అయింది. -
వివాదంలో రజనీకాంత్ చిత్రం ’లింగ’