ప్రపంచంలోనే అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక సినిమా అదే! | Megastar Chiranjeevi Indra Movie Sold 2 Crore Tickets In World Wide Record | Sakshi
Sakshi News home page

చిరంజీవా? మజాకా! వరల్డ్‌ రికార్డు మెగాస్టార్‌దే..

Published Mon, Apr 5 2021 2:48 PM | Last Updated on Mon, Apr 5 2021 6:09 PM

Megastar Chiranjeevi Indra Movie Sold 2 Crore Tickets In World Wide Record - Sakshi

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా చిరంజీవి తనదైన ముద్ర వేసుకున్నారు. ‘గ్యాంగ్‌ లీడర్’‌, ‘ఘరానా మొగుడు’ వంటి సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో ప్రేక్షకులు చిరంజీవికి బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ సినిమాలు హిట్‌గా నిలిచినప్పటికి ‘గ్యాంగ్‌ లీడర్‌, ఘరానా మొగుడు’ అంతటి సక్సెస్‌ రాలేదు. ఇక కొంతకాలం తర్వాత ఆయన హీరోగా చేసిన ఫ్యాక్షన్‌ మూవీ ‘ఇంద్ర’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికి ఈ సినిమా గురించి చర్చించుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. బి గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2002లో జూలై 24న విడుదలైంది.

ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్‌, సోనాలి బింద్రెలు కథానాయికలుగా నటించారు. ఈ మూవీ వచ్చి 18 ఏళ్లు గడిచిన ఇందులోని చిరంజీవి ఇంద్రసేనా రెడ్డిగా చెప్పే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌ ఇప్పటికి ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉంటాయి. అప్పట్లోనే ఈ మూవీ రాష్ట్రంలోనే అత్యధిక సెంటర్లో విడుదలై 100 రోజులకు పైగా ఆడి రికార్డుల మోత మోగించింది. అలా ఫ్యాక్షన్‌ మూవీ ఇంద్ర ఓ ట్రెండ్‌ సెట్‌ చేసిందనడంలో సందేహం లేదు. అంతటి ఘన విజయం సాధించిన ఈ మూవీ టికెట్లు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా అమ్ముడవడం మరో రికార్డుగా చెప్పుకొవచ్చు. వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినిదత్‌ నిర్మించిన ఈ చిత్రం అప్పట్లోనే రూ. 35 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం నిజంగా పెద్ద విశేషం.

చదవండి: 
నితిన్‌కు జోడిగా హైబ్రిడ్‌ పిల్లా... ఈసారైనా ఒప్పుకుంటుందా!
వైల్డ్‌డాగ్‌ మూవీపై చిరు రివ్యూ.. ఆయన ఏమన్నారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement