మెగాస్టార్‌తో డ్యాన్స్‌ చేసేందుకు భయపడ్డా: ఇంద్ర హీరోయిన్ | Sonali Bendre Reacts On Megastar Chiranjeevi Indra Movie Re Release, Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

Sonali Bendre On Indra Re Release: 'చిరంజీవితో స్టెప్పులు వేసేందుకు భయపడ్డా'.. ఇంద్ర రీ రిలీజ్‌పై హీరోయిన్‌'

Published Wed, Aug 21 2024 3:56 PM | Last Updated on Wed, Aug 21 2024 4:35 PM

Sonali Bendre Reacts On Mehgastar Chiranjeevi Indra Movie Re Release

తనదైన నటనతో అభిమానుల గుండెల్లో ప్రత్యేకస్థానం దక్కించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్‌ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈనెల 22న ఆయన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ఇంద్ర రీ రిలీజ్‌ చేయనున్నారు. 2002లో విడుదలైన ఈ చిత్రంలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ మూవీని మరోసారి థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ సోనాలి బింద్రే.. ఇంద్ర రీ రిలీజ్‌ కావడంపై స్పందించింది.  చిరంజీవి పక్కన నటించడం తనకు దక్కిన అతిపెద్ద గౌరవమని అన్నారు. ఆయనతో కలిసి స్టెప్పులు వేయడం ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఇంద్ర షూటింగ్‌ సమయంలో చిరుతో డ్యాన్స్‌ వేసేందుకు భయపడేదాన్ని అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరిగిన సమయంలో చాలా ఎంజాయ్‌ చేశానని.. చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా వచ్చారని వెల్లడించారు. మరోసారి ఇంద్ర మూవీని థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని.. బిగ్‌స్క్రీన్‌పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సోనాలి బింద్రే తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్‌ తన ట్విటర్‌లో షేర్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement