మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈనెల 22న ఆయన బర్త్ డేను తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది మెగాస్టార్ పుట్టినరోజు మరింత స్పెషల్‌గా మారింది. ఎందుకంటే దాదాపు 22 ఏళ్ల తర్వాత ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఇంద్ర సినిమాను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ హంగామా చేశారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ ఇంద్ర మూవీ టీంను ఘనంగా సత్కరించారు. ఇంద్ర క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేసుకుంటూ నిర్మాత అశ్వనీదత్, డైరెక్టర్ బి గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు మణిశర్మ, కథ అందించిన చిన్ని క్రిష్ణను ఆయన సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోను చిరంజీవి తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
అదిరిపోయే కలెక్షన్స్
దాదాపు 22 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్ హిట్ మూవీ ఇంద్ర. మొదటి రోజు అదిరిపోయే రీతిలో కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.3.05 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘ఇంద్ర' క్రియేట్ చేసిన సునామీ గుర్తు చేస్తూ
22 సంవత్సరాల తర్వాత మరోసారి థియేటర్స్ లో రిలీజ్ అయిన సందర్భంగా, 'ఇంద్ర' టీంకి 'చిరు' సత్కారం!
అలాగే ప్రొడ్యూసర్ @AshwiniduttCh గారు, డైరెక్టర్ B.Gopal, మరపురాని డైలాగ్స్ ని అందించిన #ParuchuriBrothers , కధనందించిన చిన్ని క్రిష్ణ,… pic.twitter.com/UfGpOd2gkE— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024
Comments
Please login to add a commentAdd a comment