'ఆ డైలాగ్‌ వింటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తోంది'.. మెగాస్టార్‌ స్పెషల్ వీడియో! | Megastar Chiranjeevi Special Video On Indra Movie Re-Release | Sakshi
Sakshi News home page

Indra Movie: 'నా కెరీర్‌లో అలాంటి మూవీ ఇంద్రనే' .. మెగాస్టార్‌ స్పెషల్ వీడియో!

Published Tue, Aug 20 2024 2:42 PM | Last Updated on Tue, Aug 20 2024 3:10 PM

Megastar Chiranjeevi Special Video On Indra Movie Re-Release

మెగాస్టార్ చిరంజీవి, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్‌ చిత్రం ఇంద్ర. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై సి అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం బిగ్‌ కమర్షియల్‌ హిట్‌గా నిలిచింది. అయితే దాదాపు 22 ఏళ్ల తర్వాత మరోసారి ఈ హిట్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈనెల 22న మెగాస్టార్ బర్త్‌ డే కావడంతో ఇంద్ర మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పెషల్ వీడియోను విడుదల చేశారు. 

మెగాస్టార్‌ మాట్లాడుతూ..'ఇంద్ర.. ఇంద్రసేనారెడ్డి ఆ డైలాగ్‌ వినగానే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావడానికి ప్రధాన కారణం కథ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరూ మనసుపెట్టి పనిచేశారు. అందుకే ఇప్పటికీ ఇంద్ర గురించి మాట్లాడుకుంటున్నాం. నా సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న చిత్రం ఇంద్ర. ఒక్కమాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రాలకు నిర్వచనం ఇంద్ర. 22 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది' అంటూ మాట్లాడిన స్పెషల్ వీడియోను వైజయంతి మూవీస్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

కాగా.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా  బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర 4కే వెర్షన్ లో మరోసారి వస్తోంది. ఆగస్ట్ 22న ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌ ఒపెన్ కాగా.. టికెట్లన్నీ అమ్ముడైపోయాయి.  ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, ముకేశ్ రిషి కూడా తమదైన నటనతో మెప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement