ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు: శ్రీకాంత్ | Nagababu And Srikanth Launched Megastar Chiranjeevi Shankar Dada MBBS Movie Re-release Trailer, Watch Inside - Sakshi
Sakshi News home page

Shankar Dada MBBS Re Release Trailer: అన్నయ్యతో నటించడం నా అదృష్టం: శ్రీకాంత్

Published Fri, Oct 27 2023 4:30 PM | Last Updated on Fri, Oct 27 2023 5:46 PM

Nagababu and Srikanth Launched Re release trailer of Shankar Dada MBBS - Sakshi

మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. 2004లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా హీరో శ్రీకాంత్ మెప్పించారు. అయితే ఈ మూవీని మెగా ప్రొడక్షన్స్ ద్వారా నవంబర్ 4న భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈ రి రిలీజ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ట్రైలర్‌ను నాగబాబు, హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. 

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. '2004ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మున్నాభాయ్ లగేరహో రీమేక్ వార్త వినిపించింది. హీరో పక్కన ఉండే కారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అన్నయ్యా?' అని చిరంజీవిని అడిగా. అలా నవ్వి ఇలా వదిలేశారు. కానీ చివరకు ఆ పాత్ర నాకే వచ్చింది. అన్నయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయనది ఎంతో కష్టపడే మనస్తత్వం. ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.

నాగబాబు మాట్లాడుతూ.. 'ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతూ ఉంటుంది. టీవీ, యూట్యూబ్‌లో పాత సినిమాలను ఎవరూ చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు మళ్లీ మళ్లీ చూసే ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఇలాంటి చిత్రాలను ఒకప్పుడు థియేటర్లో మళ్లీ ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ, ఛానెళ్లలో వస్తున్నాయి. ఇలాంటి సినిమా మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి.' అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement