
బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో ఆకట్టుకున్న నటుడు తేజ సజ్జ. ముఖ్యంగా మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన ఇంద్ర, చూడాలని ఉంది లాంటి సినిమాలు తేజకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. యువరాజు, వసంతం, శ్రీరామదాసు లాంటి సినిమాలతో ఆకట్టుకన్న తేజ తరువాత వెండితెరకు దూరమయ్యాడు. హీరోగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా పరిచయం అవుతున్నాడన్న వార్తలు వినిపించాయి.
తాజాగా తేజకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. చిన్నారి ఇంద్రగా ఆకట్టకున్న తేజ ఓ క్యూట్ లవ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. మిణుగురులు సినిమాతో ఆకట్టుకున్న అయోధ్య కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తేజ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ కుమారి హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Comments
Please login to add a commentAdd a comment