డాటర్‌ ఆఫ్‌ పూర్ణ | Jayaprada As Porna's Daughter | Sakshi
Sakshi News home page

డాటర్‌ ఆఫ్‌ పూర్ణ

Published Fri, Aug 3 2018 2:29 AM | Last Updated on Fri, Aug 3 2018 2:29 AM

Jayaprada As Porna's Daughter - Sakshi

పూర్ణ, జయప్రద

ఈ మధ్య కాలంలో తల్లి పాత్రల్లో కనిపిస్తోన్న జయప్రద ఇప్పుడు కూతురిగా కనిపించనున్నారు. అది కూడా పూర్ణకి కూతురిగా. రామ్, ఇంద్ర, జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ముఖ్య తారలుగా సూర్య ఎమ్‌.ఎస్‌.ఎన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ సువర్ణ సుందరి’. ఎమ్‌.వి.కె. రెడ్డి సమర్పణలో ఎస్‌ టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌. లక్ష్మీ నిర్మించారు. ‘చరిత్ర భవిష్యత్‌ను వెంటాడుతోంది’ అనేది ట్యాగ్‌లైన్‌.

‘‘టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. హిస్టారికల్‌ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పూర్ణ కూతురిగా జయప్రద నటించారు. ఆమె పాత్ర సినిమాలో హైలైట్‌గా ఉంటుంది. దర్శకుడు సూర్య టేకింగ్, విజువల్‌ గ్రాఫిక్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. సాయి కార్తీక్‌ సంగీతం, ఎలు మహంతి విజువల్స్‌ సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం’’ అని పేర్కొంది చిత్రబృందం. కోట శ్రీనివాసరావు, నాగినీడు, సత్య ప్రకాష్‌ నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement