మూడు జన్మల థ్రిల్‌ | Suvarna Sundari release trailer | Sakshi
Sakshi News home page

మూడు జన్మల థ్రిల్‌

Published Fri, May 3 2019 1:35 AM | Last Updated on Fri, May 3 2019 1:35 AM

Suvarna Sundari release trailer - Sakshi

పూర్ణ

జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్‌.ఎన్‌. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘సువర్ణసుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్‌. టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌. లక్ష్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎం.ఎస్‌.ఎన్‌. సూర్య మాట్లాడుతూ– ‘‘మూడు జన్మల కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కొంతకాలంగా తెలుగులో స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. మా సినిమాలోనూ ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉంటుంది. 

విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం ఏడాది పట్టింది’’ అన్నారు. ‘‘సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో సాంకేతికంగా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం సెన్సార్‌కు సిద్ధమైన మా చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత లక్ష్మీ అన్నారు. ఇంద్ర, రామ్‌ మద్దుకూరి, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్, నాగినీడు, సత్యప్రకాష్, అవినాష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: ఎల్లు మహంతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement