చరిత్ర వెంటాడుతోంది | Suvarna Sundari movieSahoooo Saarva Bhaumi Song Making | Sakshi
Sakshi News home page

చరిత్ర వెంటాడుతోంది

Published Sun, Sep 30 2018 4:02 AM | Last Updated on Sun, Sep 30 2018 4:02 AM

Suvarna Sundari movieSahoooo Saarva Bhaumi Song Making - Sakshi

సాక్షీ చౌదరి

జయప్రద, పూర్ణ, సాక్షీ చౌదరి ప్రధాన పాత్రల్లో సూర్య ఎమ్‌.ఎస్‌.ఎన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సువర్ణ సుందరి’. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అన్నది ఉపశీర్షిక. ఎస్‌. టీమ్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎమ్‌.ఎల్‌. లక్ష్మీ నిర్మించారు. సాయి కార్తీక్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సాహో సార్వభౌమి’ పాటను విడుదల చేశారు. సాయి కార్తీక్‌ మాట్లాడుతూ– ‘‘సువర్ణసుందరి’ ఓ భారీ సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌. ప్రేక్షకులు థ్రిల్‌ అయ్యేలా సూర్య ఈ సినిమా తెరకెక్కించారు. నా సినీ కెరీర్‌లో ఇది ఓ అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోతుంది.

ఇందులోని అన్ని పాటలు వేటికవే విభిన్నంగా ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన పాట ‘సాహో సార్వభౌమి’. మ్యూజికల్‌గా, విజువల్‌గా బాగా  వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. భారీ బడ్జెట్‌ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. అతి త్వరలోనే సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు లక్ష్మీ. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement