Nikitha
-
#Men Too: నిఖితా సింఘానియా కుటుంబం అరెస్ట్
బెంగళూరు: భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ (34) కేసు కీలక మలుపు తిరిగింది. అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా, అత్త నిషా, బావమరిది అనురాగ్‌ను ఆదివారం ఉదయం కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అతుల్ భార్య నికితా సింఘానియాను హర్యానాలోని గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు మరో పోలీసు అధికారి ధృవీకరించారు.#AtulSubhash's wife Nikita Singhania, her mother & brother arrested by Karnataka Police. pic.twitter.com/sTB98N2XTN— Mr Sinha (@MrSinha_) December 15, 2024ఇదిలా ఉంటే.. తన సోదరుడు అతుల్ సుభాష్ అతని భార్య నిఖిత, ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పారని ఆరోపిస్తూ అతుల్ సోదరుడు బికాస్ కుమార్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిఖిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిపి ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణ కోసం ఓ దర్యాప్తు బృందాన్ని బెంగళూరు పోలీసులు జౌన్‌పూర్‌కు పంపారు. నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ఆదివారం ఉదయం వారిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే, కేసు విచారణ నిమిత్తం మూడు రోజుల్లోగా హాజరుకావాలని నిందితులకు బెంగళూరు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అతుల్ సుభాష్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు నిఖితా సింఘానియా.. 2019లో ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అతుల్ సుభాష్‌కు పరిచయమైంది. ఈ ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. అదే ఏడాది ఇద్దరికీ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత బెంగళూరుకు ఈ జంట మకాం మార్చింది. వీరిద్దరికి ఓ బాబు పుట్టాడు. అయితే.. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.आत्महत्या से पहले का #AtulSubhash का 63 मिनट का ये पूरा वीडियो सुनकर निःशब्द और विचलित हूं। उफ़ ! #JusticeForAtulSubhash pic.twitter.com/lFDQZFLEBV— Vinod Kapri (@vinodkapri) December 10, 2024కొడుకును తీసుకుని నిఖిత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. గత మూడేళ్లుగా ఆమె సుభాష్‌కు దూరంగానే ఉంటోంది. ఈ క్రమంలోనే జౌన్పూర్ కోర్టులో ఆమె విడాకుల కోసం కేసు వేసింది. అలాగే.. అతుల్, ఆయన కుటుంబ సభ్యులపై మొత్తం 9 కేసులు నమోదు చేయించింది. శారీరకంగా హింసించడం, అసహజ శృంగారం, పైగా వరకట్న వేధింపులతో తన తండ్రిని కుంగదీసి గుండెపోటుతో చనిపోయేలా చేయడం.. లాంటి అభియోగాలు అందులో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తోంది. అయితే అతుల్ మరణంతో.. అతన్ని అంతగా వేధించిన ఆమెను ఉద్యోగం తొలగించాలంటూ సదరు కంపెనీలకు పలువురు రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో బికాస్ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు ఆదివారం ఉదయం అతుల్ సుభాష్ భార్య,అత్త,బావమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రిలీజ్‌కు రెడీ అయిన ‘అనాధ’
శ్రీ ఇంద్ర ,నికిత స్వామి, యుక్త పెర్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ‘అనాధ’. అన్నాసేట్ కె. ఏ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోనేంద్ర ఫిలిమ్స్ పతాకంపై శ్రీ ఇంద్ర నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత శ్రీ ఇంద్ర మాట్లాడుతూ.. ‘ఇది ఒక మంచి కమర్షియల్ యాక్షన్ అడ్వెంచర్ త్రిల్లర్. ఈ చిత్రంలో యూత్ కికావలసిన అన్ని అంశాలు ఉంటాయి. పర్టిక్యులర్ గా మ్యూజికల్ గా ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక యూత్ కే కాకుండా సకుటుంబ సపరివార సమేతంగా చూసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అన్ని హంగులతో ఈ చిత్రాన్ని ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానునాం. ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం" అని అన్నారు. -
Nikitha Umesh: స్ట్రాంగ్‌గా ఉంటేనే మనుగడ
సాధారణంగా ఇళ్లలో ఆడవాళ్లే వంటలు చేస్తారు. వృత్తిపరంగా చూస్తే మగ చెఫ్‌లే ఎక్కువ కనిపిస్తారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న చెఫ్ నిఖితా ఉమేష్‌ను అడిగితే... ‘‘నేను చెఫ్‌గా ఈ వృత్తిని ఎంచుకోవాలనుకున్నప్పుడు ‘గిన్నెలు కడగడానికి వెళుతున్నావా’ అని వ్యంగ్యంగా అన్నవాళ్లే ఇప్పుడు నా వంటలు రుచి చూసి చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు’’ అని వివరించారు. మాస్టర్ చెఫ్ ఇండియా (తెలుగు) జ్యూరీ ప్యానెల్లో స్థానం దక్కించుకున్న నిఖిత ఉమేష్ ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘చదువుకునే రోజుల్లో టీవీలో మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా చూసేదాన్ని. ఇంట్లో రకరకాల వంటలు ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆ ఆసక్తితోనే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్స్ చేశాను. దుబాయ్, సింగపూర్లలో శిక్షణ కోసం రెండేళ్లపాటు పనిచేశాను. పేస్ట్రీ ప్రొఫెషనల్ అండ్ మాస్టర్ చాకోలేటియర్గా హైదరాబాద్‌లో ఏడేళ్లు పని చేశాను. అలా హైదరాబాద్ పేస్ట్రీ చెఫ్‌గా, క్యుజిన్ డిజైనర్‌గా పేరొచ్చింది. ఏడాది క్రితం హైదరాబాద్‌లో మావారితో కలిసి మూడు పేస్ట్రీ బ్రాంచ్‌లు ఏర్పాటు చేశాను. ఏ రంగమైనా మనల్ని మనం నిత్యం నిరూపించుకుంటూనే ఉండాలి. అందులోనూ ఆహారం విషయానికి వస్తే మరీ ప్రత్యేకం. ఇంట్లో తిన్నవారు ఆ వంట రుచి చెప్పేంతవరకు వంట వండినవారు ఒక తెలియని ఒత్తిడిని పీలవుతుంటారు. అలాగే, మేం ప్రతి రోజూ మా పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎంతోమందికి చేరవవుతుంటాం. కాబట్టి, ఈ రంగంలోనూ ఒత్తిడి ఉంటుంది. నైపుణ్యంతోపాటు రుచిగా అందించాలనే భావన కూడా మమ్మల్ని గెలిపిస్తుంటుంది. వర్క్ బాగుంటేనే... ఐటీసీ హోటల్స్‌లో చెఫ్‌గా వర్క్ చేసినప్పుడు నా వయసు 22 ఏళ్లే. టీమ్‌లో పద్దెనిమిది మంది చెఫ్స్ ఉండేవారు. అందరూ మగవాళ్లే. అందులో సీనియర్స్ కూడా ఉండేవారు. నా వర్క్ బాగుంటేనే వారందరూ నన్ను గౌరవిస్తారు. ఈ విషయంలో ఎప్పుడూ నేను అలర్ట్‌గా ఉండేదాన్ని. వారికి తగిన సూచనలు ఇస్తూ ఏడేళ్లు పనిచేశాను. ఈ వర్క్‌లో శారీరక శ్రమతో పాటు టైమ్‌కు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది కాబట్టి కుటుంబం కూడా సపోర్ట్‌గా ఉండాల్సి ఉంటుంది. నిజానికి ఇళ్లలో వంటలు చేసేవాళ్లు ఆడవాళ్లే కానీ. హోటల్స్‌లో వృత్తిపరంగా చెఫ్‌లుగా ఉన్న మహిళల శాతం మాత్రం తక్కువగానే ఉంది. కొత్తగా నేర్చుకుంటూ.. నేను బెంగళూరులో పుట్టి పెరిగాను. అమ్మ ప్రభ డిఫెన్స్‌లో సీనియర్ అడ్మిన్ ఆఫీసర్, నాన్న ఉమేష్ ఎల్ఐసీ రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. నేను కన్నడ అమ్మాయిని కాబట్టి తెలుగు రాదు. మాస్టర్ చెఫ్ ఇండియా అవకాశం వచ్చాక తెలుగు నేర్చుకున్నాను. అందుకు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను. చెఫ్ కమ్యూనిటీ నుంచి ఎవరో నన్ను రికమండ్ చేసి ఉంటారు. ఆ విధంగా నాకు జ్యూరీలో సభ్యురాలిగా ఉండే అవకాశం లభించింది. పనిలో చూపించే శ్రద్ధ, తపన మనల్ని విజయమార్గంలో తప్పక నడిపిస్తుంది’’ అని వివరించారు ఈ మాస్టర్ చెఫ్. ఆమె అనుభవ పాఠాలు మరికొందరికి విజయ సోపానాలు అవుతాయి కదా... – నిర్మలారెడ్డి -
చివరి శ్వాస వరకు ప్రేమిస్తూనే ఉంటా.. నా జీవితం నీదే
‘నువ్వేం చెప్పావ్.. నన్ను ప్రేమించాననే కదా! అయితే నాకన్నా దేశాన్నే ఎక్కువగా ప్రేమించావు. గర్వంగా ఉంది. నీ ప్రేమ గొప్పది. నువ్వెన్నడూ చూడనైనా చూడని వారి కోసం నీ ప్రాణాలను త్యాగం చేశావు. ధైర్యవంతుడివి. నీ జీవిత భాగస్వామిని అయి ఉండటం నాకొక గౌరవం. నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా జీవితం నీదే’’. వైఫాఫ్ మేజర్ విభూతి శంకర్ జమ్మూకశ్మీర్‌లో గత ఏడాది ఉగ్రవాదులతో ఎన్కౌంటర్లో ఆర్మీ మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ వీరమరణం పొందగా భర్త స్ఫూర్తితో ఆయన భార్య నిఖితా కౌల్ సైన్యంలో చేరనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసి ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు. త్వరలోనే శిక్షణ కోసం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి వెళ్లనున్నారు. ఏడాది క్రితం.. ఇదే నెలలో.. కశ్మీర్ నుంచి.. డెహ్రాడూన్ చేరుకున్న మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ భౌతికకాయం ఉన్న శవపేటికపై వాలి, ఆయన భార్య నిఖితా కౌల్ అన్నమాటలివి. మనసులో అనుకోలేదు. గొణుక్కున్నట్లు అనుకోలేదు. స్పష్టంగా.. బతికున్న మనిషితో మాట్లాడినట్లే భర్తపై తన ప్రేమను వ్యక్తం చేశారు నిఖిత. గత ఏడాది ఫిబ్రవరి 18న ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో అమరుడయ్యాడు శంకర్. భీకర పోరు అది. పుల్వామాలో నలభైమంది జవాన్లను పొట్టన పెట్టుకున్న జైషే–మొహమ్మద్ ఉగ్రనేత ఘాజీ రిషీద్ను నాలుగు రోజుల పాటు వెతికి వేటాడి హతమార్చాక, ఎదురు కాల్పుల్లో తనూ చనిపోయాడు మేజర్ శంకర్. అప్పటికి నిఖితతో అతడి పెళ్లి జరిగి ఏడాది కూడా కాలేదు. భర్త మరణవార్త ఆమెను కుదిపేసింది. అతడికి 33. ఆమెకు 27. ఇంకా చాలా జీవితం ఉంది. భర్త అంత్యక్రియల్లో నిఖిత అన్నమాట ఎవరూ మర్చిపోలేనిది. ప్రతి భారతీయుడిని ఉద్దేశించి ఆమె ఆ మాట అన్నారు. ‘‘ఇలాంటప్పుడే మనం బలంగా ఉండాలి. ఇప్పుడే మనం కలిసికట్టుగా ఉండాలి..’ అంటూ, హరిద్వార్‌లో గంగానది ఒడ్డున్న ఆయన చితికి సెల్యూట్ చేశారామె. ఆ క్షణంలోనే శత్రువుపై అంతకంతా తీర్చుకునేందుకు మానసికంగా ఆమె సైన్యంలోకి వెళ్లిపోయారు. ∙∙ ఏడాది గడిచింది. ఇండియన్ ఆర్మీలో చేరడానికి నిఖిత ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్.ఎస్.సి.) పరీక్ష రాశారు. ఇంటర్వ్యూలో ఎంపిక అయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఒక ఎమ్.ఎన్.సి. (మల్టీ నేషనల్ కంపెనీ)లో పని చేస్తున్నారు. ఆ ఉద్యోగాన్ని వదిలి, త్వరలోనే ఆర్మీ శిక్షణ కోసం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీకి వెళ్లబోతున్నారు. ఎస్.ఎస్.సి. పరీక్ష రాస్తున్నప్పుడు.. తన భర్త కూడా ఇలాగే పరీక్ష రాసి ఉంటారు కదా అన్న ఆలోచన వచ్చి ఆయనకు తనెంతో దగ్గరగా ఉన్నట్లు అనుభూతి చెందానని నిఖితా కౌల్ అన్నారు. భర్తకు ఒక జ్ఞాపకంగా మాత్రమే ఆమె మిగిలిపోదలచుకోలేదు. భర్త మిగిల్చి వెళ్లిన బాధ్యతల్ని తుపాకీలా భుజాన మోయాలని గట్టిగానే తీర్మానించుకున్నారు. అతడు.. ఆమె.. సైన్యం ‘మీ పెళ్లయి ఎన్నాళ్లయింది?’ అడిగింది ఇంటర్వ్యూ బోర్డు. ‘దాదాపు రెండేళ్లు’ జవాబిచ్చారు నిఖిత. ‘కాని మీ పెళ్లయి తొమ్మిది నెలలైనట్టు విన్నామే’ అని ఆశ్చర్యపోయారు బోర్డు సభ్యులు.‘ నా భర్త భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టినంత మాత్రాన మా పెళ్లి ముగిసినట్లు కాదు కదా?’ తిరిగి ప్రశ్నించారు నిఖిత. నిజమే.. పెళ్లయిన తొమ్మిదినెలలకే భర్త అమరుడయ్యాడు. కాని ఆమె అతని తోడును కోల్పోలేదు. దేశం పట్ల అతనికున్న భక్తి, ఆ యూనిఫామ్ అంటే అతనికున్న నిబద్ధత ఆమె మనసులో అతణ్ణి సజీవంగా ఉంచాయి. తనూ సైన్యంలో చేరడమే తన భర్తకు ఆమె ఇచ్చే ఘనమైన నివాళిగా భావించారు. నిఖిత కౌల్.. కశ్మీర్ వాసి. ఢిల్లీ దగ్గరి నోయిడాలో ఉద్యోగం.‘‘మన దేశ జెండా గుడ్డలో చుట్టి తెచ్చిన నా భర్త భౌతిక కాయాన్ని చూసినప్పుడే నిశ్చయించుకున్నాను ఆయన అడుగుజాడల్లో సాగాలని. ముందసలు నా భర్త లేడు అన్న సత్యాన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నెమ్మది నెమ్మదిగా అలవాటుపడ్డాను. విభూ చాలా ప్రోగ్రెసివ్. తన కన్నా నేను గొప్పగా ఉండాలని ఆశపడేవాడు. ఆయన ఆలోచనలు, ఆశయాలే నన్ను ఇండియన్ ఆర్మీ వైపు నడిపించాయి. నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా కాదా అన్న సందేహం ఏమాత్రం వచ్చినా.. ఏ కొంచెం ఆందోళన కలిగినా వెంటనే కళ్లు మూసుకొని విభూ ఉంటే ఏం చేసేవాడు అని ఆలోచించేదాన్ని. వెంటనే నాకున్న సందేహాలు, ఆందోళన మాయం అయిపోయేవి. విభు చనిపోయాక ఆర్నెల్లకు ఎస్ఎస్సికి దరఖాస్తు చేశాను. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ఎస్ఎస్సి ప్రిపరేషన్ ఎంతగానో ఉయయోగపడింది. నేను పరీక్ష రాస్తున్నప్పుడు, ఇంటర్వ్యూకి హాజరవుతున్నప్పుడు విభూనే తలుచుకున్నాను.. ఈ పరీక్ష, ఇంటర్వ్యూలప్పుడు తను ఎలా ఫీలయ్యుంటాడో అని. ఆయన భయాలు, ఆందోళనలతో నేనూ కనెక్ట్ అయ్యాను. ఒకరకంగా అదే నాకు శక్తినిచ్చిందని చెప్పొచ్చు’ అంటారు నిఖితా కౌల్. -
నిప్పులాంటివాడు
మోహన్‌లాల్, నిఖిత, షీలు అబ్రహాం ముఖ్య తారలుగా ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం ‘కనల్’. ఇప్పుడీ చిత్రం ‘మహా పల్లవ’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కె.వి.ఎస్ మూవీస్ పతాకంపై కల్లూరు సుబ్బయ్య సమర్పణలో కల్లూరు శేఖర్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ– ‘‘కనల్’ అంటే నిప్పులాంటివాడు, నిజాయితీపరుడు అని అర్థం. కొందరు సంఘవిద్రోహ శక్తుల ఆటను ఓ వ్యక్తి ఎలా ముగించాడన్నదే ఈ చిత్రకథ. రాజస్థాన్‌లోని థార్ ఎడారి, దుబాయ్, అమెరికా లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఇందులో ఐదు పాటలు, మూడు ఫైట్లు ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నాం. మలయాళంలో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని అన్నారు. -
బాలికలకు రోల్‌మోడల్‌గా నిలుస్తా
►మారథాన్‌తో 31 జిల్లాల్లో పర్యటన ►జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరవుతా ►మారథాన్ ప్లేయర్ నిఖితాయాదవ్ ► అభినందించిన కలెక్టర్ అమ్రపాలి హన్మకొండ అర్బన్: ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడమే తన లక్ష్యమని సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతానికి చెందిన కోర నిఖితాయాదవ్ అన్నారు. అసాధ్యమైన లక్ష్యాలు సుసాధ్యం చేసి బాలికల్లో రోల్ మోడల్‌గా నిలవాలని ఈ సాహస కార్యానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రసుతం మారథాన్‌తో తెలంగాణలోని 31 జిల్లాల్లో పర్యటించి బాలికల్లో ఆత్మస్తైర్యం నిపేందుకు ప్రయత్నిస్తున్న ఆమె.. ఇప్పటికి 13 జిల్లాల్లో పర్యటన ముగించుకుని మంగళవారం వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి తన లక్ష్యాలను వివరించింది. అనతంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను హైదరాబాద్‌లోని కస్తూర్భాగాంధీ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేశానని, కుంటుంబ పెద్దలు, యాదవ సంఘాల సహకారంతో ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పింది. ఆడపిల్ల అబలకాదు సబల అని నిరూపిస్తానని చెప్పింది. ప్రభుత్వం నుంచి సహకారం అందితే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని తెలిపింది. ప్రస్తుతం మారథాన్‌తో 31జిల్లాలో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకున్నాని మీడియా ముందు తెలియజేసింది. ఏప్రిల్ 27న ప్రారంభమైన మారథాన్‌లో ఇప్పటి వరకు సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్, కొమురంబీం, గోదావరిఖని, కరీంనగర్ జిల్లాల్లో పర్యటనతో 600 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాని వివరించింది. జూన్ 2నాటికి హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటానని నికిత తెలిపింది. కాగా, చిన్న వయస్సులోనే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకని ఆ దిశగా పయనిస్తున్న నిఖితను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పరంగా సహకారం అందిచేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు కృషి చేస్తా. ఆడపిల్ల అబలకాదు సబల అని నిరూపిస్తా. – నిఖితాయాదవ్ -
ఐటంసాంగ్స్ బాటలో నిఖిత
-
తొలి ప్రేమ కథ
తొలి ప్రేమ తియ్యనిది. కొంతమంది ఆ ప్రేమను బయటికి చెప్పకుండా కాలయాపన చేస్తుంటారు. చెప్పకుండానే లవర్‌కి దూరమైనవాళ్ల జాబితా చాలానే ఉంటుంది. అలాంటి జాబితాలో తను కూడా ఉంటానేమోననే బాధ అతన్ని వెంటాడుతుంది. తన తొలి ప్రేమను బయటికి చెప్పలేకపోయినందుకు తనని తాను నిందించుకుంటాడు. ఆ బాధ చానాళ్లు వెంటాడుతుంది. చివరికు తన ప్రేమను బయటపెట్టడానికి రెడీ అవు తాడు. ఆ ప్రయాణంలో అతను సక్సెస్ అవుతాడా, లేదా? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బాయ్ మీట్స్ గాళ్ - తొలిప్రేమ కథ’. సిద్ధార్ధ్, కనికా తివారి, నిఖితా అనిల్ నాయకా నాయికలుగా ప్రసన్నకుమార్ సమర్పణలో సునీత నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. వసంత్ దయాకర్ దర్శకుడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్టైనర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. -
‘తొలిప్రేమ’ స్ఫూర్తితో..!
ప్రేమకథల్లో ‘తొలిప్రేమ’ ఓ ట్రెండ్‌సెట్టర్. ఆ చిత్రం ఆదర్శంగా ‘బాయ్ మీట్స్ గాళ్ తొలి ప్రేమకథ’ అనే చిత్రాన్ని ప్రసన్నకుమార్ సమర్పణలో సునీత నిర్మించారు. సిద్ధు, కనికా తివారి, నిఖితా అనిల్ నాయకా నాయికలు. వసంత్ దయాకర్ దర్శకుడు. ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘పవన్‌కల్యాణ్ ‘తొలిప్రేమ’ స్ఫూర్తితో ఈ సినిమా తీశాం. దూరమైన తన తొలిప్రేమను వెతుక్కుంటూ వెళ్లే ఓ యువకుడి కథ ఇది’’ అని చెప్పారు.