తొలి ప్రేమ కథ | The first love story | Sakshi
Sakshi News home page

తొలి ప్రేమ కథ

Published Tue, Mar 25 2014 12:02 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

తొలి ప్రేమ కథ - Sakshi

తొలి ప్రేమ కథ

 తొలి ప్రేమ తియ్యనిది. కొంతమంది ఆ ప్రేమను బయటికి చెప్పకుండా కాలయాపన చేస్తుంటారు. చెప్పకుండానే లవర్‌కి దూరమైనవాళ్ల జాబితా చాలానే ఉంటుంది. అలాంటి జాబితాలో తను కూడా ఉంటానేమోననే బాధ అతన్ని వెంటాడుతుంది. తన తొలి ప్రేమను బయటికి చెప్పలేకపోయినందుకు తనని తాను నిందించుకుంటాడు.


ఆ బాధ చానాళ్లు వెంటాడుతుంది. చివరికు తన ప్రేమను బయటపెట్టడానికి రెడీ అవు తాడు. ఆ ప్రయాణంలో అతను సక్సెస్ అవుతాడా, లేదా? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బాయ్ మీట్స్ గాళ్ - తొలిప్రేమ కథ’.  సిద్ధార్ధ్, కనికా తివారి, నిఖితా అనిల్ నాయకా నాయికలుగా ప్రసన్నకుమార్ సమర్పణలో సునీత నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. వసంత్ దయాకర్ దర్శకుడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement