akhil karthik
-
వాలి స్ఫూర్తితో...
ముగ్గురు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. అయితే ఆ ముగ్గురిలో ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది? అనే సస్పెన్స్ కథాంశంతో రూపొందిన చిత్రం ‘శివరంజని’. రశ్మి, నందు, అఖిల్ కార్తీక్, ఇంద్ర ప్రధాన పాత్రల్లో నాగప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. యూ అండ్ ఐ ఎంటరై్టన్మెంట్ పతాకంపై ఎ. పద్మనాభ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఎ.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘రంగు’ సినిమా తర్వాత మా బ్యానర్లో వస్తోన్న సినిమా ఇది. లవ్, సస్పెన్స్, హారర్‌తో పాటు థ్రిల్లర్ అంశాలున్నాయి. ప్రేక్షకులు థ్రిల్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. శివరంజని ఎవరు? అనేది తెలుసుకోవడమే సినిమా. ధన్‌రాజ్ కామెడీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ‘‘కె. రాఘవేంద్రరావు, చంద్రమహేష్, వినాయక్ గార్ల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాను. ‘వాలి’ సినిమా నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథ ఇది. ముందు క్లయిమాక్స్ రాసుకుని ఆ తర్వాత కథ రెడీ చేశా. అనుకున్నదాని కంటే సినిమా బాగా వచ్చింది’’ అన్నారు నాగప్రభాకర్. నందినీరాయ్, అఖిల్ కార్తీక్, ధన్‌రాజ్, ఢిల్లీ రాజేశ్వరి నటించిన ఈ సినిమాకి కెమెరా: సురేందర్ రెడ్డి, సమర్పణ: నల్లా స్వామి, సహ నిర్మాత: కటకం వాసు. -
సామాన్యుల పరిస్థితి ఏంటి?
‘‘నాకు ఇష్టమైన దర్శకుడు భరత్. తను గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తాడు. కానీ, టైమ్ బాగా లేకనో, మరేంటో కానీ.. కొన్ని మిస్‌ఫైర్ అవుతున్నాయి. ‘మేరా భారత్ మహాన్’ పాటలు, ట్రైలర్స్ చూశాక సూపర్ హిట్ సాధించబోతున్నాడని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర చేశా. నిర్మాతలు ఎంతో అభిరుచితో ఈ సినిమా నిర్మించారు’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ జంటగా భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరా భారత్ మహాన్’. వరంగల్‌కు చెందిన వైద్యులు శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. లలిత్ సురేశ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను బాబూమో హన్ విడుదల చేసి, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌కు అందించారు. ‘‘విద్య, వైద్యం సామాన్యులకు అందడం లేదు. డబ్బున్న వాళ్లకే దక్కుతున్నాయి. డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి? అంటే వ్యవస్థలోని కొన్ని సమస్యలు. వాటిని సవరించమని చెప్పే ప్రయత్నమే తప్ప, ఎవరికీ వ్యతిరేకంగా ఉండదు’’ అన్నారు భరత్. శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాంబేష్, అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ, పాటల రచయిత పెద్దాడమూర్తి, మాటల రచయిత ఎర్రంశెట్టి సాయి, కథా రచయిత,నటుడు డా. శ్రీధర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్య.. వైద్యం.. యువతకు సందేశం
‘సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే సమాజం బాగుంటుంది’ అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మేరా భారత్ మహాన్’. అఖిల్ కార్తీక్, ప్రియాంకాశర్మ జంటగా భరత్ దర్శకత్వంలో ప్రథ ప్రొడక్షన్స్ పతాకంపై డా. శ్రీధర్ రాజు ఎర్ర, డా. తాళ్ల రవి, డా. టిపిఆర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పాటల రచయిత చంద్రబోస్ కెమెరా స్విచ్చాన్ చే యగా, దర్శకుడు బి.గోపాల్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘దేశం బాగుపడాలంటే యువత సంకల్పించాలి. సమాజంలోని సమస్యలను అరికట్టే బాధ్యత వారిదే. యువతను చైతన్యపరిచే విధంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘భారతీయుడు, అపరిచితుడు, ఠాగూర్’ చిత్రాల తరహాలో ఉండే కథ ఇది. ఈ సినిమా చేయడం నాకు సవాల్. ఇందులో నటించ నున్న ఓ స్టార్ హీరో పేరు త్వరలో చెబుతాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సోమర్తి సాంబేష్. -
థ్రిల్‌కి గురి చేసే కథ
నిషా కొఠారి, అఖిల్ కార్తీక్ ముఖ్య తారలుగా పి. శ్రీనివాసరావు, సీహెచ్‌వీ శర్మ నిర్మిస్తున్న చిత్రం ‘క్రిమినల్స్’. ‘మంత్ర’, ‘మంగళ’ చిత్రాల దర్శకుడు ఓషో తులసీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే కథ ఇది. ‘మంత్ర’ ఆనంద్ స్వరపరచిన పాటలు ప్రధాన ఆకర్షణ అవుతాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: కె.వి. సుబ్బారావు, కె. నాగశేఖర్. -
'తీయని కలవో' న్యూ మూవీ స్టిల్స్
-
ప్రేమలోని గొప్పతనం
‘‘తియ్యని కల లాంటి ప్రేమకథా చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్విస్తూనే ప్రేమలోని గొప్పతనాన్ని చాటుతుంది’’ అని ‘తీయని కలవో’ చిత్ర దర్శకుడు శివాజి. యు చెప్పారు. ఆయన దర్శకత్వంలో శివకేశవ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బలమూరి రామ్మోహనరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30 విడుదల కానుంది. అఖిల్ కార్తీక్, శ్రీతేజ్, హుదాషా ముఖ్యతారలు. యువతకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయని నిర్మాత తెలిపారు. అనుకున్న నిర్మాణ వ్యయంతో తక్కువ సమయంలో సినిమా పూర్తి చేశారని అఖిల్ కార్తీక్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రవీంద్ర ప్రసాద్, కెమెరా: జశ్వంత్, మాటలు: గుర్తి మల్లికార్జున్. -
తీయని కలవో...
అందరి మనసులకూ హత్తుకునే తీయని కలలాంటి ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు శివాజీ.యు పేర్కొన్నారు. అఖిల్ కార్తీక్, శ్రీతేజ, హుదుషా ముఖ్య తారలుగా బలమూరి రామమోహన్‌రావు నిర్మించిన ‘తీయని కలవో’ పాటల ఆవిష్కరణ హైరదాబాద్‌లో జరిగింది. పాటల సీడీని హీరోలు సుధీర్‌బాబు, నవీన్‌చంద్ర ఆవిష్కరించి దర్శకుడు శ్రీవాస్‌కి అందించారు. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు శివాజీ ఇంతకు ముందు నృత్య దర్శకునిగా చేశాడు. సినిమాను స్టయిలిష్‌గా తీశాడనుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీశాడని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో దామోదర్‌ప్రసాద్, శివాజీరాజా, సాయికార్తీక్, ధన్‌రాజ్, తాగుబోతు రమేశ్ తదితరులు పాలుపంచుకున్నారు.