
‘సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే సమాజం బాగుంటుంది’ అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మేరా భారత్ మహాన్’. అఖిల్ కార్తీక్, ప్రియాంకాశర్మ జంటగా భరత్ దర్శకత్వంలో ప్రథ ప్రొడక్షన్స్ పతాకంపై డా. శ్రీధర్ రాజు ఎర్ర, డా. తాళ్ల రవి, డా. టిపిఆర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పాటల రచయిత చంద్రబోస్ కెమెరా స్విచ్చాన్ చే యగా, దర్శకుడు బి.గోపాల్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘దేశం బాగుపడాలంటే యువత సంకల్పించాలి. సమాజంలోని సమస్యలను అరికట్టే బాధ్యత వారిదే. యువతను చైతన్యపరిచే విధంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘భారతీయుడు, అపరిచితుడు, ఠాగూర్’ చిత్రాల తరహాలో ఉండే కథ ఇది. ఈ సినిమా చేయడం నాకు సవాల్. ఇందులో నటించ నున్న ఓ స్టార్ హీరో పేరు త్వరలో చెబుతాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సోమర్తి సాంబేష్.
Comments
Please login to add a commentAdd a comment