Mera Bharat Mahan
-
మేరా భారత్ మహాన్
-
Independence Day 2024: మేరా భారత్ మహాన్
దేశం అంటే భక్తి... ప్రేమ ఉన్నవాళ్లు దేశం కోసం ప్రాణాలను వదిలేయడానికి కూడా వెనకడుగు వేయరు. ‘మేరా భారత్ మహాన్’ అంటూ నిజజీవితంలోప్రాణాలను పణంగా పెట్టిన అలాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. కొందరి జీవితాల ఆదర్శంగా వెండితెరపైకి వచ్చిన సినిమాలనూ చూశాం. ప్రస్తుతం నిర్మాణంలో అలాంటి నిజ జీవిత వీరుల నేపథ్యంలో, కల్పిత పాత్రలతోనూ రూపొందుతున్న దేశభక్తి చిత్రాలు చాలా ఉన్నాయి. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం.భూతల్లిపై ఒట్టేయ్... ‘‘భూతల్లిపై ఒట్టేయ్... తెలుగోడి వాడి చూపెట్టేయ్... తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టేయ్’ అంటూ ప్రజలను చైతన్యపరిచేలా, వారిలో దేశభక్తి ఉ΄÷్పంగేలా పాట పాడుతున్నాడు వీరశేఖరన్. ఇతని గురించి బాగా తెలిసిన వ్యక్తి సేనాపతి. ఎందుకంటే సేనాపతి తండ్రి వీర శేఖరన్. స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ (కల్పిత పాత్ర) ఏ విధంగా పోరాడాడు? అనేది వెండితెరపై ‘ఇండియన్ 3’ సినిమాలో చూడొచ్చు. హీరో కమల్‌హాసన్–దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఇండియన్’ (‘భారతీయుడు’) ఫ్రాంచైజీలో త్వరలో రానున్న చిత్రం ‘ఇండియన్ 3’. ఈ చిత్రంలో వీరశేఖరన్, సేనాపతి పాత్రల్లో తండ్రీకొడుకుగా కమల్‌హాసన్ కనిపిస్తారు. 1806 సమయంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా వీర శేఖరన్ ఏ విధంగా పోరాడాడు? అతని పోరాట స్ఫూర్తితో 1940లలో సేనాపతి ఏం చేశాడు? అనే అంశాలతో ‘ఇండియన్ 3’ ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. భారత్ మాతా కీ జై ‘తేరే పాకిస్తానీ అడ్డా మే బైట్ కే బతా రహా హూ... భారత్ మాతా కీ జై...’ అంటూ నాగచైతన్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ‘తండేల్’ సినిమాలోనిది. విజయనగరం, శ్రీకాకుళంప్రాంతాలకు చెందిన మత్య్సకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీరప్రాంతానికి వలస వెళ్తారు. వేటలో భాగంగా వారికి తెలియకుండానే పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్తారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డులు ఈ భారత మత్స్యకారులను బంధీలుగా పట్టుకుని జైల్లో వేస్తారు. పాకిస్తాన్ జైల్లో వీరి పరిస్థితి ఏంటి? వీరి కుటుంబ సభ్యులు వీరి కోసం ఏమైనా పోరాటం చేశారా? అనే అంశాల నేపథ్యంలో ‘తండేల్’ కథనం ఉంటుందని తెలిసింది. వాస్తవ ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, అతని భార్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. దేశభక్తి అంశాలతో పాటు ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలు మిళితమైన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది.మార్టిన్... ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీ మార్టిన్ అనే భారతీయుడిని క్రూరంగా శిక్షించాలనుకుంటుంది. మార్టిన్‌కు దేశభక్తి ఎక్కువ. ఎంతలా అంటే... అతని చేతిపై ఇండియన్ అనే ట్యాటూ ఉంటుంది. అసలు పాకిస్తాన్ జైల్లో మార్టిన్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అనేది కన్నడ చిత్రం ‘మార్టిన్’ చూస్తే తెలుస్తుంది. ధ్రువ్ సర్జా హీరోగా నటించిన చిత్రం ఇది. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించిన ఈ దేశభక్తి, యాక్షన్, ఎమోషనల్ మూవీ అక్టోబరు 11న రిలీజ్ కానుంది.అమరన్ ‘రమణ (తెలుగులో ‘ఠాగూర్’గా రీమేక్ అయింది), తుపాకీ, కత్తి’ వంటి సినిమాల్లో సామాజిక బాధ్యతతో పాటు కాస్త దేశభక్తిని కూడా మిళితం చేసి, హిట్ సాధించారు తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ప్రస్తుతం హీరో శివ కార్తికేయన్‌తో ‘అమరన్’ సినిమా చేస్తున్నారాయన. ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో కనిపిస్తారు శివ కార్తికేయన్. సాయిపల్లవి హీరోయిన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని టాక్. ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్ కానుంది. అలాగే ప్రస్తుతం మురుగదాస్ హిందీలో సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న ‘సికందర్’ కూడా దేశభక్తి నేపథ్యంలోనే ఉంటుందని టాక్.సరిహద్దు యుద్ధం దేశభక్తి ప్రధానాంశంగా ఉన్న చిత్రాల్లో నటించేందుకు అక్షయ్ కుమార్ ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన చేసిన ‘బేబీ, ఎయిర్ లిఫ్ట్, ‘మిషన్ మంగళ్’ వంటి చిత్రాలు ఇందుకు ఓ నిదర్శనం. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన చిత్రం ‘స్కై ఫోర్స్’. 1965లో ఇండియా–పాకిస్తాన్ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. వీర్ పహారియా, నిమ్రత్ కౌర్, సారా అలీఖాన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. సందీప్ కెవ్లానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబరు 2న రిలీజ్ కానుంది. అలాగే 1971లో ఇండియా–పాకిస్తాన్ల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో 1997లో హిందీలో ‘బోర్డర్’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించారు. కాగా ఇటీవల సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ను ప్రకటించారు. ఇంకా భారత్–పాకిస్తాన్ విడిపోయిన నాటి పరిస్థితుల నేపథ్యంలో ‘లాహోర్ –1947’ సినిమా కూడా చేస్తున్నారు సన్నీ డియోల్. ఇక పాకిస్తాన్ చిన్నారిని ఆమె దేశంలో విడిచిపెట్టేందుకు ‘భజరంగీ భాయిజాన్’ (2015)గా సల్మాన్ ఖాన్ చేసిన సాహసాలను సులభంగా మర్చిపోలేం. ఈ ఫిల్మ్‌కు సీక్వెల్ ఉంటుందని చిత్ర కథారచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
సామాన్యుల పరిస్థితి ఏంటి?
‘‘నాకు ఇష్టమైన దర్శకుడు భరత్. తను గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తాడు. కానీ, టైమ్ బాగా లేకనో, మరేంటో కానీ.. కొన్ని మిస్‌ఫైర్ అవుతున్నాయి. ‘మేరా భారత్ మహాన్’ పాటలు, ట్రైలర్స్ చూశాక సూపర్ హిట్ సాధించబోతున్నాడని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర చేశా. నిర్మాతలు ఎంతో అభిరుచితో ఈ సినిమా నిర్మించారు’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ జంటగా భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరా భారత్ మహాన్’. వరంగల్‌కు చెందిన వైద్యులు శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. లలిత్ సురేశ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను బాబూమో హన్ విడుదల చేసి, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌కు అందించారు. ‘‘విద్య, వైద్యం సామాన్యులకు అందడం లేదు. డబ్బున్న వాళ్లకే దక్కుతున్నాయి. డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి? అంటే వ్యవస్థలోని కొన్ని సమస్యలు. వాటిని సవరించమని చెప్పే ప్రయత్నమే తప్ప, ఎవరికీ వ్యతిరేకంగా ఉండదు’’ అన్నారు భరత్. శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాంబేష్, అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ, పాటల రచయిత పెద్దాడమూర్తి, మాటల రచయిత ఎర్రంశెట్టి సాయి, కథా రచయిత,నటుడు డా. శ్రీధర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్య.. వైద్యం.. యువతకు సందేశం
‘సామాన్యులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి. అప్పుడే సమాజం బాగుంటుంది’ అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మేరా భారత్ మహాన్’. అఖిల్ కార్తీక్, ప్రియాంకాశర్మ జంటగా భరత్ దర్శకత్వంలో ప్రథ ప్రొడక్షన్స్ పతాకంపై డా. శ్రీధర్ రాజు ఎర్ర, డా. తాళ్ల రవి, డా. టిపిఆర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పాటల రచయిత చంద్రబోస్ కెమెరా స్విచ్చాన్ చే యగా, దర్శకుడు బి.గోపాల్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘దేశం బాగుపడాలంటే యువత సంకల్పించాలి. సమాజంలోని సమస్యలను అరికట్టే బాధ్యత వారిదే. యువతను చైతన్యపరిచే విధంగా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘భారతీయుడు, అపరిచితుడు, ఠాగూర్’ చిత్రాల తరహాలో ఉండే కథ ఇది. ఈ సినిమా చేయడం నాకు సవాల్. ఇందులో నటించ నున్న ఓ స్టార్ హీరో పేరు త్వరలో చెబుతాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సోమర్తి సాంబేష్. -
ప్రవాస లాస్యం
నేడు NRI డే భారతీయులు ఇప్పుడు విశ్వమానవులు. అనితరసాధ్య విజయాల చిరునామాలు. కలల సాకారంలో భాగంగా దేశం మారినా తమదైన ‘కళల’ ప్రాకారాన్ని మాత్రం నిర్మిస్తూనే ఉన్నారు. ఈ గడ్డమీద నివసిస్తున్న మనవారెందరో... పొరుగింటి పుల్లకూర రుచికి మైమరచిపోతుంటే.. పొట్ట చేత్తో పట్టుకుని వెళ్లినవారు పొరుగింటికి మనింటి రుచుల కమ్మదనాన్ని చవిచూపుతున్నారు. మేరా భారత్ మహాన్ అని విదేశీయులతోనూ అనిపిస్తున్నారు. అలాంటి ఎన్నదగ్గ ఎన్నారైలకు ఉదాహరణ.. వీళ్లు. ..:: ఓ మధు భరతభూమిలో గజ్జెకట్టిన ఎందరో.. ప్రవాసులైన తర్వాత కూడా సంప్రదాయ నృత్యాన్ని కొనసాగిస్తున్నారు. విదేశీయులకు భారతీయ లాస్య విన్యాసాన్ని చూపుతున్నారు. అంతేనా కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేకంగా మాతృభూమికి తరలి వచ్చి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇటీవల నగరంలో ఈ ఎన్నారై కుటుంబాలు తమ నృత్యప్రదర్శనతో సిటీవాసులను అలరించారు. ఈ ‘కళ్చ’రల్ అంబాసిడర్స్తో ముచ్చటించినప్పుడు... పడమర వేదికపై.. ‘మాది చెన్నై. చిన్నప్పుడు అడియార్ కె.లక్ష్మణ్, ప్రొఫెసర్ చిత్రా విశ్వేశ్వరణ్ల దగ్గర నృత్యం నేర్చుకున్నాను. మంచి డ్యాన్సర్‌ని అవుదామనుకున్నాను. పెళ్లయ్యాక మన అభిరుచిని కంటిన్యూ చేయడం కష్టమే. అయినా ఆసక్తి పరిస్థితులను మనకు అనుకూలంగా మారుస్తుంది. పెళ్లి తర్వాత న్యూజెర్సీకి వెళ్లాక ఇక నా చిన్ననాటి ‘కళ’కు నీళ్లొదలాల్సిందే అనుకున్నా. కాని అనుకోకుండా అక్కడ కొంతమందిలో భారతీయ నృత్యాలపై చాలా ఆసక్తి ఉందని గమనించాను. వాళ్లకి నేర్పడం ద్వారా నేను కోల్పోతున్నదేదో భర్తీ అవుతుందనిపించింది. అలా మొదలై పాతికేళ్లుగా... 300కి పైగా స్టూడెంట్స్‌కు నేర్పించాను. మంచి శిక్షకురాలిగా పేరు తెచ్చుకున్నాను. నిజం చెప్పాలంటే.. అక్కడ మన కళలకు లభిస్తున్న గౌరవం చూస్తే.. ఇంత గొప్ప వారసత్వాన్ని అందించిన భారతమాతకు ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. అందుకే ఏటా ఇక్కడికి వచ్చి తప్పకుండా ప్రదర్శనలిస్తాను. డ్యాన్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నాను. నా స్టూడెంట్స్‌తో ఇక్కడ అరంగేట్రం చేయిస్తుంటాను. మా అబ్బాయికి కూడా నృత్యం నేర్పించా. 2012లో తను చెన్నైలో అరంగేట్రం చేశాడు. నేను నేర్పిన వారితో కలసి వేదిక మీద నృత్యం చేయడం కొత్త అనుభూతి. నా కొడుకుతో కలిసి చేయడం మరింత విచిత్రమైన అనుభూతి’ అని వివరించారు రమ్య రామ్‌నారాయణ్. నృత్యమే భవిష్యత్తు... చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ నృత్యం చూస్తూ పెరిగాను. అమ్మ ఎందరికో నేర్పిస్తుండటం చూసి నాకు నేర్చుకోవాలనిపించింది. భావం, భాషా అన్నీ అమ్మ వివరంగా చెప్పేది. కళ అంటే కేవలం కాళ్లు చేతుల కదలిక మాత్రమే కాదనీ అందులో ఎన్నో అద్భుతమైన అర్థాలున్నాయని తెలిసింది. దాంతో మనదైన కళ మీద మరింత ఇష్టం పెరిగింది. అందుకే నేర్చుకునేటప్పుడు ఎక్కువగా కష్టం అనిపించలేదు. కేవలం నృత్యమే కాకుండా ట్రంపెట్ వాయించడం కూడా నేర్చుకున్నాను. ఇక్కడైనా, ఎక్కడైనా మనం ఏదైనా నేర్చుకోవాలంటే టైం సరిపోదు, టైం లేదు అని ఏం ఉండదు. పొద్దున్నే స్కూల్‌కి వెళ్తాను. వచ్చాక నాకు నచ్చిన ఆసక్తి ఉన్న పని చేస్తాను. కొంచెం క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే ఎవరైనా వారికి ఆసక్తి వున్న కళను ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నేర్చుకోవచ్చు. అదృష్టవశాత్తూ నేను మా అమ్మ దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకుంటాను. భవిష్యత్తులోనూ డాన్స్ టీచర్‌గానే కొనసాగాలని అనుకుంటున్నాను’ అని చెబుతారు రంగరాజ్ తిరుమలై. నృత్యమే పండుగ.. మాది సికింద్రాబాద్. పెళ్లి కాకముందు శోభనాయుడు గారి దగ్గర కూచిపూడి శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నుంచి నాట్యవిశారద కోర్స్ పూర్తి చేశాను. పెళ్లయిన తర్వాత 1991లో యూఎస్‌కి వెళ్లాను. కళాకారిణిగానే ఉండాలనుకున్నాను. ఆ సమయంలో అక్కడ ప్రదర్శనలకు అవకాశాలు తక్కువ. నాట్యాన్ని కొనసాగించడానికి వీకెండ్ స్కూల్స్‌లో కూచిపూడి టీచర్‌గా ఐదేళ్లు పనిచేశాను. పిల్లలు పుట్టాక కూడా ఎప్పుడూ బ్రేక్ ఇవ్వలేదు. భర్త ప్రోద్బలంతో 1996లో కూచిపూడి డాన్స్ అకాడమీని మేం ఉండే మేరీల్యాండ్‌లో ప్రారంభించాం. ఇప్పుడు 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఇతర నృత్య శైలులకు చెందిన టీచర్స్ అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడి చాలా డాన్స్ ఫెస్టివల్స్ నిర్వహించాం. ఇండియాలో ఆసక్తి ఉన్న వారు మాత్రమే కళలు నేర్చుకుంటారు. కానీ యుఎస్‌లో కల్చర్‌ని కాపాడటం అనేది ఒక అవసరం. పిల్లలు భారతీయుల్లా పెరగాలంటే కల్చర్ గురించి, కళల గురించి తెలియాల్సిందే. - లక్ష్మీబాబు, మేరీల్యాండ్, యూఎస్ నాకు స్ఫూర్తి మా అమ్మ పిట్స్‌బర్గ్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను. మా కాలేజీల్లో ఇండియన్ డ్యాన్స్ టీమ్స్ ఉంటాయి. క్లాసికల్, ఫ్యూజన్, బాంద్రా, దాండియా గ్రూప్స్ ఉంటాయి. వాటికి కాంపిటీషన్స్ చాలా టఫ్‌గా నిర్వహిస్తారు. కాలేజ్‌లో ఆడిషన్స్ ద్వారా 10 మందిని సెలెక్ట్ చేస్తారు. మా కాలేజ్ క్లాసికల్ డ్యాన్స్ టీమ్‌కి నేనే కెప్టెన్. విదేశాల్లో మనదైన కళలకు ఆదరణ పెంచడం అనేది ఒక బాధ్యతగా అనిపిస్తుంది. అమ్మను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్నాను. - శ్రీయ బాబు, లక్ష్మీబాబు కూతురు నాట్యం ఒక భాగం.. నాట్యం మా జీవనశైలిలో ఒక భాగం. ఊహ తెలిసిన దగ్గర్నుంచి మా చుట్టూ డ్యాన్స్, స్టూడెంట్స్, క్లాసెస్, డ్యాన్స్షోలే ఉండేవి. అంత గొప్ప సంస్కృతి, సందడిని చూశాక, డ్యాన్స్ తప్ప వేరే ఎంచుకోవాలనే ఆలోచన కూడా లేదు. నృత్య సాధన ఇండియాలోనే చేయాలని ఆశిస్తున్నాను - స్నేహ బాబు, లక్ష్మీబాబు కూతురు