
అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ
‘‘నాకు ఇష్టమైన దర్శకుడు భరత్. తను గొప్పగా సినిమాలు తెరకెక్కిస్తాడు. కానీ, టైమ్ బాగా లేకనో, మరేంటో కానీ.. కొన్ని మిస్‌ఫైర్ అవుతున్నాయి. ‘మేరా భారత్ మహాన్’ పాటలు, ట్రైలర్స్ చూశాక సూపర్ హిట్ సాధించబోతున్నాడని అర్థమవుతోంది. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర చేశా. నిర్మాతలు ఎంతో అభిరుచితో ఈ సినిమా నిర్మించారు’’ అని నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ జంటగా భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేరా భారత్ మహాన్’. వరంగల్‌కు చెందిన వైద్యులు శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
లలిత్ సురేశ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను బాబూమో హన్ విడుదల చేసి, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్‌కు అందించారు. ‘‘విద్య, వైద్యం సామాన్యులకు అందడం లేదు. డబ్బున్న వాళ్లకే దక్కుతున్నాయి. డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి? అంటే వ్యవస్థలోని కొన్ని సమస్యలు. వాటిని సవరించమని చెప్పే ప్రయత్నమే తప్ప, ఎవరికీ వ్యతిరేకంగా ఉండదు’’ అన్నారు భరత్. శ్రీధర్ రాజు ఎర్ర, తాళ్ల రవి, టి.పల్లవి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాంబేష్, అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ, పాటల రచయిత పెద్దాడమూర్తి, మాటల రచయిత ఎర్రంశెట్టి సాయి, కథా రచయిత,నటుడు డా. శ్రీధర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment