తీయని కలవో... | Teyani Kalavo..... | Sakshi
Sakshi News home page

తీయని కలవో...

Published Wed, Apr 23 2014 11:14 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

తీయని కలవో... - Sakshi

తీయని కలవో...

అందరి మనసులకూ హత్తుకునే తీయని కలలాంటి ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు శివాజీ.యు పేర్కొన్నారు. అఖిల్ కార్తీక్, శ్రీతేజ, హుదుషా ముఖ్య తారలుగా బలమూరి రామమోహన్‌రావు నిర్మించిన ‘తీయని కలవో’ పాటల ఆవిష్కరణ హైరదాబాద్‌లో జరిగింది. పాటల సీడీని హీరోలు సుధీర్‌బాబు, నవీన్‌చంద్ర ఆవిష్కరించి దర్శకుడు శ్రీవాస్‌కి అందించారు. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు శివాజీ ఇంతకు ముందు నృత్య దర్శకునిగా చేశాడు. సినిమాను స్టయిలిష్‌గా తీశాడనుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీశాడని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో దామోదర్‌ప్రసాద్, శివాజీరాజా, సాయికార్తీక్, ధన్‌రాజ్, తాగుబోతు రమేశ్ తదితరులు పాలుపంచుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement