Sri Teja
-
యాక్షన్ రాంబో
‘నారప్ప, పుష్ప, ధమాకా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలుపొషించిన శ్రీ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ‘రాంబో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళవారం (ఆగస్టు 22) శ్రీతేజ్ బర్త్ డే సందర్భంగా ‘రాంబో’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఇటీవల జరిగిన వైజాగ్ షెడ్యూల్‌తో టాకీపార్ట్ పూర్తయింది. త్వరలోనేపాటలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రాజీవ్ సాలూరి, ఫర్నాజ్ శెట్టి, మైమ్ గోపి, గోలీసోడ మధు కీలకపాత్రలుపొషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, సునీల్ కుమార్ నామా. -
వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది
‘‘అవకాశం వచ్చినప్పుడే మనలో ఉన్న సామర్థ్యం బయటకు తెలుస్తుంది. నా పదిహేనేళ్ల కెరీర్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ కోసమే ఎదురుచూస్తున్నాను. సంగీతదర్శకునిగా ఇది నా 16వ సినిమా. వర్మగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశాను. నా కెరీర్‌ను బిఫోర్ ఆర్జీవీ (రామ్‌గోపాల్ వర్మ).. ఆఫ్టర్ ఆర్జీవీ అని చెప్పేంత స్పందన వచ్చింది ఈ సినిమాకు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను మెచ్చుకుంటున్నారు’’ అన్నారు కల్యాణీ మాలిక్. విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’. ఏ జీవీ, ఆర్జీవీ ఫిల్మ్స్ సమర్పణలో రాకేశ్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన కల్యాణీ మాలిక్, గీత రచయిత సిరాశ్రీ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. కల్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా సంగీత దర్శకుడిని అయ్యాను. మా అన్నయ్య (యం.యం. కీరవాణి), నేను ఇద్దరం మ్యూజిక్ డైరెక్టర్స్ విభాగంలోనే ఉన్నాం. క్రిష్ ‘యన్.టీ.ఆర్’కి అన్నయ్య సంగీత దర్శకునిగా చేశారు. నేను వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రానికి సంగీతం అందించాను. ఎవరి సృజనాత్మక శైలి వారికి ఉంటుంది. ఆయనతో నాకు పోలిక పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పోలికలు పెట్టడం కామనే. కానీ ఆయన స్థాయికి నేను అస్సలు సరిపోను. ఆయనతో నేను సరితూగుతానా? అన్న భయం నాకు జీవితాంతం ఉంటుంది. కానీ ట్రావెల్లో ముందుకు వెళ్లాలి. రాజమౌళి సినిమాలకు సౌండ్ సూపర్ విజనింగ్ చేస్తుంటాను. అన్నయ్య ప్రతి సినిమాకు నేను పని చేయలేదు. వర్మగారితో తొలిసారి పని చేయడం హ్యాపీ. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా ఈ సినిమాకు నాకు పేరు వచ్చింది. ఈ సినిమాకు ముందు రామ్‌గోపాల్‌వర్మగారితో నాకు పరిచయం లేదు. రచయిత సిరాశ్రీ వల్లే ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకు వచ్చింది. సిరాశ్రీగారితో కూడా నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మేము. ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం డెస్టినీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు ‘నేను సంగీతం అందించగలనా?’ అనే భయం వేసింది. వర్మగారు నా పై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ఇలాంటి పాటలు చేయలేదు. నా కెరీర్‌కు బాగా ఫ్లస్ అయ్యింది. వివాదాలను మా వరకు రానివ్వరు వర్మగారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉంటుంది. నా కెరీర్ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కల్యాణీ మాలిక్ మంచి సంగీతం ఇవ్వగలడనే పేరును నిలబెట్టుకోవాలి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘అస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం నేను పేర్లు మార్చుకోలేదు. ఇక కెరీర్లో కల్యాణీ మాలిక్గానే కొనసాగుతాను. కీర్తీసురేశ్ సినిమాకు వర్క్ చేస్తున్నాను. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఫైనల్ స్టేజ్‌లో సౌండ్ సూపర్ విజనింగ్లో నా పని మొదలవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన ఆంచనాలకు అందరు సిరాశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు దాదాపు 150 పాటలు రాశాను. అందులో 50కి పైగా పాటలు వర్మగారి చిత్రాలకు రాశాను. ఆయన పిలిస్తే ఇండస్ట్రీలో చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు. కానీ ఆయన నాకే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వర్మగారిని నేను ఒక ఈవెంట్‌గా చూస్తాను. మన మైండ్సెడ్తో ఆయన్ను అర్థం చేసుకోలేం. ఫిలసాఫికల్ ఔట్లుక్ వస్తుంది. వర్మగారు అంచనాలకు అందనివారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మ్యూజిక్ డిస్కషన్స్‌లో ‘ఇది ఆర్జీవీ మ్యూజిక్‌లా ఉండకూడదంటే ఏం చేయాలి. ‘శంకరాభరణం, మేఘ సందేశం’లా బెంచ్‌మార్క్ క్లాసిక్ సంగీతంలా ఉండాలి’’ అని నాతో ఆర్జీవీగారు అన్నారు. వెంటనే నాకు కల్యాణీ మాలిక్‌గారి పేరు మైండ్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని పాటను వినిపించాను. వెంటనే ఆర్జీవీగారు కల్యాణి మాలిక్‌ను తీసుకుందాం అన్నారు. వర్మగారికి సాహిత్యంపై పట్టు ఉంది. ఆయనకు ఎన్టీఆర్‌గారంటే విపరీతమైన అభిమానం. అగస్త్య మంజు ఈ సినిమాకు చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పడిన కష్టానికి దర్శకత్వంలో అర్ధభాగం ఇచ్చారు వర్మగారు. జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. నా కెరీర్ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఖాళీ లేకుండానే పని చేస్తున్నాను’’ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్ఎన్టీఆర్: అసలు కథ’ చిత్రం విడుదల కాకపోవడం చాలా బాధగా ఉంది. బాగా నిరుత్సాహపడ్డాను. ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ కూడా విడుదలైతే... ఇంత మంచి పేరు అక్కడ కూడా వచ్చి ఉండేదనే ఫీలింగ్ ఉంది. నా పరంగానే కాదు నిర్మాత కూడా చాలా నష్టపోయి ఉంటారు. నా సొంత ఊరు కొవ్వూరు. నా సొంత ఊరు కొవ్వూరులో నేను పని చేసిన సినిమా విడుదల కాలేదు. -
'తీయని కలవో' న్యూ మూవీ స్టిల్స్
-
తీయని కలవో...
అందరి మనసులకూ హత్తుకునే తీయని కలలాంటి ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు శివాజీ.యు పేర్కొన్నారు. అఖిల్ కార్తీక్, శ్రీతేజ, హుదుషా ముఖ్య తారలుగా బలమూరి రామమోహన్‌రావు నిర్మించిన ‘తీయని కలవో’ పాటల ఆవిష్కరణ హైరదాబాద్‌లో జరిగింది. పాటల సీడీని హీరోలు సుధీర్‌బాబు, నవీన్‌చంద్ర ఆవిష్కరించి దర్శకుడు శ్రీవాస్‌కి అందించారు. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు శివాజీ ఇంతకు ముందు నృత్య దర్శకునిగా చేశాడు. సినిమాను స్టయిలిష్‌గా తీశాడనుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీశాడని, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో దామోదర్‌ప్రసాద్, శివాజీరాజా, సాయికార్తీక్, ధన్‌రాజ్, తాగుబోతు రమేశ్ తదితరులు పాలుపంచుకున్నారు. -
అతలాకుతలం
వరంగల్, న్యూస్‌లైన్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం తో జిల్లా అతలాకుతలమవుతోంది. రికార్డు స్థాయిలో వర్షం కురవగా... వరద పోటెత్తిం ది. వర్షం ధాటికి జిల్లావ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లింది. కల్వర్టులు, రోడ్లు తెగి పోగా... చెరువులకు గండ్లు పడ్డాయి. ఇళ్లు నేలమట్టం కావడంతోపాటు వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు పూర్తిస్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. పంటలన్నీ నీటిలో కొట్టుకుపోగా... లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇల్లు కూలడంతో ఓ వృద్ధురాలు మృత్యువాత పడగా... ఎని మిది మందికి గాయాలయ్యాయి. 20 మేక లు, రెండు ఆవులు వర్షానికి బలయ్యాయి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులు తెగిపోవడంతో వాహనాలను దారి మళ్లించారు. ఇల్లు కూలి వృద్ధురాలి మృత్యువాత ఉర్సుగుట్టలోని ప్రతాప్‌నగర్‌లో ఇల్లు కూలడంతో ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు దిడ్డి రాధ(58) మృత్యువాత పడింది. ఆమె మనవడు మూడేళ్ల బాబు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలు కాగా అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తొర్రూర్-గోపాల్పూర్ మధ్య పొంగుతున్న వాగులో ఏడేళ్ల బాలుడు యశ్వంత్ గల్లంతయ్యాడు. నగరంలోని ఎన్టీఆర్ నగర్లో శుక్రవారం రాత్రి వరదలో చిక్కుకున్న బాలింత వీరమనేని దివ్యతోపాటు ఆమె ఏడు రోజుల బాబు, వృద్ధురాలు రాజ్యలక్ష్మిని అధికారులు శనివారం ఉదయం సురక్షితంగా రక్షించారు. బచ్చన్నపేట మండలం చిన్నరామన్చర్ల శివారులోని గోపాలపురంలో శనివారం ఉదయం ఇల్లు కూలి ఐదుగురు గాయపడ్డారు. వల్లాల శివరాములు, సత్యలక్షి, శిరీష, శ్రీకాంత్, ఉమకు గాయాలు కావడంతో వారిని జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నర్మెటలో ఇల్లు కూలి ప్రజ్ఞాపురం కనుకయ్య, అంజ య్యకు గాయాలయ్యాయి. స్టేషన్ ఘన్పూర్ మండలం లింగంపల్లిలో వీరనేని ఆగమయ్యకు చెందిన కొట్టం కూలడంతో 14 మేకలు మృత్యువాత పడ్డాయి. తెగిన రోడ్లు.. కొడకండ్ల మండల కేంద్రంలోని మైదం చెరువు మత్తడిపోయగా... వరదలో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మియాపూర్ డిపో బస్సు చిక్కుకుంది. అందు లో ఉన్న 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎటూ 5కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలి పోగా... మధ్యాహ్నం 2 గంటల తర్వాత వరద ఉధృతి తగ్గడంతో అధికారులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. రామవరం వద్ద పాత చెరువు మత్తడి పడడంతో కాజ్వే వద్ద ఓ బైక్ కొట్టుకుపోయింది. సంగెం మండలం కుంటపల్లి వద్ద చెరువుకు బుంగ పడింది. దేవరుప్పుల-కడవెండి ప్రధాన రహదారి తెగిపోవడంతో ఏడు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. స్టేషన్ ఘన్పూర్ మండలం కాశికొండ-కిష్టాయిగూడెం వద్ద రోడ్డు తెగిపోయింది. లింగపల్లి వద్ద కాజ్‌వేపైకి భారీగా నీరు చేరడంతో చిన్న పెండ్యాలతోపాటు పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పర్వతగిరి మండలం కల్లెడ పెద్ద చెరువుకు గండి పడింది. వుహేశ్వరం నుంచి గురిజాలకు వెళ్లే రహదారిపై వరద పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయుం ఏర్పడింది. చెన్నారావుపేట వుండలం గురిజాలలోని రెండు చెరువులు, వుుగ్ధుంపురం, అమీనాబాద్ చెరువులు వుత్తడి పోస్తున్నాయి. నల్లబె ల్లి మండలం రుద్రగూడెంలోని ఎర్రకుంట చెరువుకు గండిపడింది. వర్ధన్నపేట ఆకేరు వాగు పొంగి పొర్లుతుండగా... కోనారెడ్డి చెరువులోకి భారీగా నీరు చేరుతోంది. పున్నేలు చెరువు, డీసీతండ శివారు జగన్నాయకుంటకు బుంగలు పడ్డాయి. మడికొండలో ఇళ్లలోకి వర్షం నీరు చేరి ప్రజలు అవస్థలకు గురయ్యారు. హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ శివారులో కాజ్వే వద్ద వరద నీరు పొంగి ప్రవహించడంతో ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. సీతంపేట శివారులో రోడ్డు తెగిపోయింది. మునిపల్లి-చింతగట్టు వద్ద లోలెవల్ వంతెన తెగిపోవడంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయూయి. అన్నసాగర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చిట్యాల మండలం నైన్పాక-చైన్పాక మధ్య కల్వర్టుపై నుంచి నీరు భారీగా ప్రవహిస్తుండడంతో అలుగు తండా, వెంచరామి వరకు సంబంధాలు తెగిపోయాయి. ఒడిశెల- గోపాల్పూర్ వద్ద చెరువు అలుగు పడడంతో కొత్తపల్లి, దూద్‌పల్లి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పొంగుతున్న వాగులు భూపాలపల్లి వద్ద మోరంచ, కలివాగులు పొంగడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయూయి. ధర్మారావుపేట-గణపురం వద్ద మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 21 గ్రామాలను సం బంధాలు తెగిపోయూయి. ములుగు ప్రాంతంలోని దస్రుమాటు, బొగ్గులవాగు, ఏటూరునాగారం వద్ద దొడ్లవాగు, జంపన్నవాగు పొంగి ప్రపవహిస్తుండడంతో 13 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. మహబూబాబాద్ వద్ద నడివాగు పొంగడంతో లోలెవల్ వంతెనపై నీరు చేరింది. దీంతో అధికారులు వాహనాలను నిలిపివేశారు. పాకాల, లక్నవరం, రామప్ప, ఘన్పూర్, ధర్మసాగర్, బొమ్మకూర్ రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో రిజర్వాయర్లన్నీ నిండుకుండలా మారాయి. రామప్ప సరుస్సు అలుగు పోస్తోంది. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యూయి. ఎస్ఆర్నగర్, సాయిగణేష్‌కాలనీ, వివేకానందకాలనీ, జేఎంజే కాలనీ, శాంతినగర్, పద్మానగర్, ఎంహెచ్‌నగర్, వీవర్స్‌కాలనీ, దేశాయిపేట, హంటర్‌రోడ్డు, సమ్మయ్యనగర్ ప్రాంతా ల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. హంటర్‌రోడ్డులోని జూపార్క్ ఎదురుగా రోడ్డు తెగడం, వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో నాలుగు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. హన్మకొండ, వరంగల్, కాజీపేటలోని ప్రధాన దారులన్నీ వరద నీటితో నిండిపోయాయి. గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం నీటమునగగా... సర్క్యూట్ గెస్ట్‌హౌస్ వద్ద ఆడిట్ కార్యాలయం పైకప్పు కూలింది. ఆర్ఈసీ విద్యుత్ సబ్‌స్టేషన్ మొత్తం నీటితో నిండడంతో కరెంట్ సరఫరా నిలిపేశారు. శివనగర్‌లోని ఆర్‌ఎస్‌నగర్, మైసయ్య నగర్, పోచమ్మనగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అక్కడ జిల్లా యంత్రాంగం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. శివనగర్‌లోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 250 మందికి పునరావాసం కల్పించారు. -
నా సామి రంగ
దిలీప్, సాయికుమార్, శ్రీతేజ్, ప్రియాంక, యశస్విని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘నా సామి రంగ’. సుబ్రమణ్యం పచ్చా దర్శకుడు. సీహెచ్ కిరణ్‌కుమార్ రెడ్డి, జె.కృష్ణారెడ్డి, జీపి రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతల్లో ఒకరైన కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ- ‘‘దర్శకుడు సుబ్రమణ్యంతో 60 మందికి కథ చెప్పించాను. ఒక్కరు కూడా కథ బాగాలేదని చెప్పలేదు. అందుకే ధైర్యంగా ఈ కథను తెరకెక్కించాం. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. వచ్చేవారం పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఆద్యంతం నవ్వుల్లో ముంచే హాస్యచిత్రమిదని దర్శకుడు చె ప్పారు.ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: పి.బాల్‌రెడ్డి, ఎడిటింగ్: ఉపేంద్ర.