
‘నారప్ప, పుష్ప, ధమాకా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలుపొషించిన శ్రీ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాకు ‘రాంబో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళవారం (ఆగస్టు 22) శ్రీతేజ్ బర్త్ డే సందర్భంగా ‘రాంబో’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
‘‘ఇటీవల జరిగిన వైజాగ్ షెడ్యూల్‌తో టాకీపార్ట్ పూర్తయింది. త్వరలోనేపాటలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రాజీవ్ సాలూరి, ఫర్నాజ్ శెట్టి, మైమ్ గోపి, గోలీసోడ మధు కీలకపాత్రలుపొషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, సునీల్ కుమార్ నామా.
Comments
Please login to add a commentAdd a comment