Rambo movie
-
యాక్షన్ రాంబో
‘నారప్ప, పుష్ప, ధమాకా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలుపొషించిన శ్రీ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు ‘రాంబో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మంగళవారం (ఆగస్టు 22) శ్రీతేజ్ బర్త్ డే సందర్భంగా ‘రాంబో’ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఇటీవల జరిగిన వైజాగ్ షెడ్యూల్‌తో టాకీపార్ట్ పూర్తయింది. త్వరలోనేపాటలను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. రాజీవ్ సాలూరి, ఫర్నాజ్ శెట్టి, మైమ్ గోపి, గోలీసోడ మధు కీలకపాత్రలుపొషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, సునీల్ కుమార్ నామా. -
మరో సినిమా ప్రకటించనున్న ప్రభాస్?
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా ‘రాంబో’ సినిమా చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల ‘రాంబో’ టైగర్ కి బదులుగా ప్రభాస్ నటించనున్నాడనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. సిల్వెస్టర్ స్టలోన్ హీరోగా నటించిన ‘రాంబో’ చిత్రానికి రిమేక్. టైగర్ ష్రాఫ్ ‘వార్’ చిత్రం తర్వాత రాంబోని పట్టాలెక్కించాలని దర్శకుడు భావించాడు. అయితే టైగర్ గణపథ్ పార్ట్ 1 ,2, హీరోపంటి 2, బాఘి 4లకు ఇంతకు ముందే డేట్స్ ఇచ్చేశాడు. ఇక తన బిజీ షెడ్యూల్ చూస్తే వచ్చే ఏడాది చివరి వరకు డేట్స్ దాదాపుగా ఖాళీ లేనట్టే కనపడుతోంది. ఈ కారణంగా ‘రాంబో’ కోసం కాల్షీట్స్ని సర్దుబాటు చేయలేకపోతున్నాడు. ఇప్పటికే సినిమా ప్రకటించి చాలా కాలం గడవడంతో దీని ప్రభావం సినిమాపైన పడుతుందని చిత్ర దర్శకుడు భావిస్తున్నాడు. దాంతో ప్రభాస్‌ని ‘రాంబో’ సినిమా కోసం సిద్ధార్థ్ సంప్రదించాడట. వారు చెప్పిన కథ కూడా నచ్చడంతో ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ చేసేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. పైగా ప్రభాస్ నటిస్తే ఈ చిత్రం పాన్-ఇండియా ప్రాజెక్టుగా మారుతుందని, అది సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం టైగర్ లానే ప్రభాస్ కూడా వరుస సినిమాలతో కాల్ షీట్స్ ఖాళీ లేకుండా బీజీబిజీగా గుడుపుతున్నాడు. మరి ఈ కాంబో కుదిరి ‘రాంబో’ గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే మరి. ( చదవండి: వామ్మో 'ఆర్ఆర్ఆర్'కు ఓ రేంజ్లో బిజినెస్! ) -
హాలీవుడ్ ఎంట్రీ!
బాలీవుడ్ యాక్షన్ హీరోల లిస్ట్‌లో టైగర్ ష్రాఫ్ పేరు తప్పకుండా ఉంటుంది. ఏ ‘ప్లైయింగ్ జాట్, భాగీ సిరీస్’ చిత్రాల్లో టైగర్ యాక్షన్ టాలెంట్ ఏంటో చూశాం. ఇప్పుడీ యాక్షన్ హీరో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. ఇటీవల టైగర్ ష్రాఫ్‌ను హాలీవుడ్ నిర్మాత లారెన్స్ కసోనోఫ్ మీట్ అవ్వడమే ఇందుకు కారణం. టైగర్ ఫిజిక్కు లారెన్స్ ఇంప్రెస్ అయ్యారట. తాను తీయాలనుకుంటున్న యాక్షన్ మూవీకి టైగర్ నప్పుతాడని భావించారట. గతంలో ‘బ్లడ్ డిన్నర్, ఫార్ ఫ్రమ్ హోమ్, ట్రూ లైస్’ వంటి భారీ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు లారెన్స్. ఇదిలా ఉంటే.. హాలీవుడ్ ఫిల్మ్ ‘రాంబో’ హిందీ రీమేక్‌లో టైగర్ ష్రాఫ్ నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త టైమ్ పడుతుంది. -
హృతిక్... ఇండియన్ రాంబో!
1982లో వచ్చిన హాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘రాంబో’. హాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ సిల్వర్‌స్టర్ స్టాలెన్ స్వీయదర్శకత్వంలో రూపొందించి, హీరోగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మూడు భాగాలుగా వచ్చిన ‘రాంబో’ పలు దేశ, విదేశీ చిత్రాల్లోని పోరాట సన్నివేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. మరి... దీన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తే....? హీరోగా హృతిక్‌రోషన్ తప్ప వేరే ఎవరూ ఆ పాత్రకు సరిపోరనేది బాలీవుడ్ దర్శకుడు సిద్థార్థ్ ఆనంద్ మాట. టామ్ క్రూజ్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘నైట్ అండ్ ద డే’ను హృతిక్‌తో ‘బ్యాంగ్ బ్యాంగ్’గా రీమేక్ చేసిన సిద్థార్థ్ చాలా ఏళ్ల క్రితమే ‘రాంబో ’ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. మన నేటివిటీ అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు కూడా చేశారట. రీమేక్ హక్కులు కొన్నప్పుడే హృతిక్‌తోనే తీయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ఈ హీరోగారు కూడా ‘సై’ అన్నారని సమాచారం. ప్రస్తుతం ‘మొహెంజొదారో’, ‘కాబిల్’ చిత్రాలతో బిజీగా ఉన్న హృతిక్ త్వరలోనే ‘రాంబో’ రీమేక్ షూటింగ్లో పాల్గొనున్నారట.