హృతిక్... ఇండియన్ రాంబో! | Did Hrithik Roshan just confirm Rambo remake? | Sakshi
Sakshi News home page

హృతిక్... ఇండియన్ రాంబో!

Published Thu, Mar 10 2016 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

హృతిక్... ఇండియన్ రాంబో!

హృతిక్... ఇండియన్ రాంబో!

1982లో వచ్చిన హాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘రాంబో’. హాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ సిల్వర్‌స్టర్ స్టాలెన్ స్వీయదర్శకత్వంలో రూపొందించి, హీరోగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మూడు భాగాలుగా వచ్చిన ‘రాంబో’ పలు దేశ, విదేశీ చిత్రాల్లోని పోరాట సన్నివేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. మరి... దీన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తే....? హీరోగా హృతిక్‌రోషన్ తప్ప వేరే ఎవరూ ఆ పాత్రకు సరిపోరనేది బాలీవుడ్ దర్శకుడు సిద్థార్థ్ ఆనంద్ మాట.

టామ్ క్రూజ్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘నైట్ అండ్ ద డే’ను హృతిక్‌తో ‘బ్యాంగ్ బ్యాంగ్’గా రీమేక్ చేసిన సిద్థార్థ్ చాలా ఏళ్ల క్రితమే ‘రాంబో ’ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. మన నేటివిటీ అనుగుణంగా స్క్రిప్ట్‌లో మార్పులు కూడా చేశారట. రీమేక్ హక్కులు కొన్నప్పుడే హృతిక్‌తోనే తీయాలని ఆయన ఫిక్స్ అయ్యారట. ఈ హీరోగారు కూడా ‘సై’ అన్నారని సమాచారం. ప్రస్తుతం ‘మొహెంజొదారో’, ‘కాబిల్’ చిత్రాలతో బిజీగా ఉన్న హృతిక్ త్వరలోనే ‘రాంబో’ రీమేక్ షూటింగ్‌లో పాల్గొనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement