Kristen Stewart Wants Her Child Is Look Like To Hrithik Roshan: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అందం, ఆహార్యం, అద్భుత నటనతో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తాడు. హృతిక్‌కు ప్రపంచవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ నుంచి అభిమానులు ఉన్నారు. జనవరి 10న హృతిక్ పుట్టినరోజు సందర్భంగా సినీ స్టార్స్ బర్త్‌డే విషెస్ చేశారు. దీపికా పదుకొణె నుంచి రణ్‌వీర్ సింగ్ వరకు అనేక మంది బాలీవుడ్ తారలు హృతిక్ పట్ల ప్రేమను వ్యక్తం చేశారు. ఈ క్రిష్ పట్ల హాలీవుడ్ నటులు సైతం ప్రేమాభినాలు చూపకుండా ఉండలేకపోయారు. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవర్ట్ కూడా హృతిక్ అంటే ఎంత ఇష్టమో చెప్పి అందరినీ ఆశ్యర్యపరిచింది. అయితే ఆమె ఇప్పుడు చెప్పలేదు.
క్రిస్టెన్ నటించిన ప్రముఖ చిత్రాల్లో ఒకటైనా 'ట్విలైట్: బ్రేకింగ్ డాన్ పార్ట్ 2' సినిమా సమయంలో ఒక ఇంటర్వ్యూలో హృతిక్‌పై ఇష్టాన్ని వ్యక్తపరిచింది. 'ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో వస్తే బాలీవుడ్ చిత్రంలో నటించాలని ఉంది. హృతిక్ రోషన్‌తో కలిసి పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. అతను చాలా అద్భుతమైన నటుడు, అందంగా కూడా ఉంటాడు. ఒకవేళ నాకు కొడుకు ఉన్నట్లయితే, హృతిక్‌లా ఉండాలని, అతనిలా కనిపించాలని కోరుకుంటా. కానీ కళ్లు మాత్రం రాబ్‌ల (క్రిస్టెన్ ప్రియుడు రాబర్ట్ ప‍్యాటిన్సన్) ఉండాలి.' అని చెప్పింది ఈ హాలీవుడ్ భామ.
ఇదీ చదవండి: రక్తంతో తడిసిన హృతిక్ రోషన్.. బర్త్‌డే స్పెషల్ ట్రీట్
Comments
Please login to add a commentAdd a comment