వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది | Kalyani Malik and Lyricist Sirasri Interview About Lakshmi's NTR | Sakshi
Sakshi News home page

వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది

Published Sun, Mar 31 2019 6:12 AM | Last Updated on Sun, Mar 31 2019 6:12 AM

Kalyani Malik and Lyricist Sirasri Interview About Lakshmi's NTR - Sakshi

సిరాశ్రీ, కల్యాణీ మాలిక్‌

‘‘అవకాశం వచ్చినప్పుడే మనలో ఉన్న సామర్థ్యం బయటకు తెలుస్తుంది. నా పదిహేనేళ్ల కెరీర్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ కోసమే ఎదురుచూస్తున్నాను. సంగీతదర్శకునిగా ఇది నా 16వ సినిమా. వర్మగారితో ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేశాను. నా కెరీర్‌ను బిఫోర్‌ ఆర్జీవీ (రామ్‌గోపాల్‌ వర్మ).. ఆఫ్టర్‌ ఆర్జీవీ అని చెప్పేంత స్పందన వచ్చింది ఈ సినిమాకు. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ను మెచ్చుకుంటున్నారు’’ అన్నారు కల్యాణీ మాలిక్‌. విజయ్‌ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ ముఖ్య తారలుగా రామ్‌గోపాల్‌వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌: అసలు కథ’. ఏ జీవీ, ఆర్జీవీ ఫిల్మ్స్‌ సమర్పణలో రాకేశ్‌ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంగీతం అందించిన కల్యాణీ మాలిక్, గీత రచయిత సిరాశ్రీ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

కల్యాణీ మాలిక్‌ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా సంగీత దర్శకుడిని అయ్యాను. మా అన్నయ్య (యం.యం. కీరవాణి), నేను ఇద్దరం మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ విభాగంలోనే ఉన్నాం. క్రిష్‌ ‘యన్‌.టీ.ఆర్‌’కి అన్నయ్య సంగీత దర్శకునిగా చేశారు. నేను వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌: అసలు కథ’ చిత్రానికి సంగీతం అందించాను. ఎవరి సృజనాత్మక శైలి వారికి ఉంటుంది. ఆయనతో నాకు పోలిక పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఒకే డిపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు పోలికలు పెట్టడం కామనే. కానీ ఆయన స్థాయికి నేను అస్సలు సరిపోను.

ఆయనతో నేను సరితూగుతానా? అన్న భయం నాకు జీవితాంతం ఉంటుంది. కానీ ట్రావెల్‌లో ముందుకు వెళ్లాలి. రాజమౌళి సినిమాలకు సౌండ్‌ సూపర్‌ విజనింగ్‌ చేస్తుంటాను. అన్నయ్య ప్రతి సినిమాకు నేను పని చేయలేదు. వర్మగారితో తొలిసారి పని చేయడం హ్యాపీ. నేను ఊహించినదానికన్నా ఎక్కువగా ఈ సినిమాకు నాకు పేరు వచ్చింది. ఈ సినిమాకు ముందు రామ్‌గోపాల్‌వర్మగారితో నాకు పరిచయం లేదు. రచయిత సిరాశ్రీ వల్లే ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకు వచ్చింది. సిరాశ్రీగారితో కూడా నాకు ఇంతకుముందు పరిచయం లేదు. ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ మేము.

ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం డెస్టినీగా ఫీల్‌ అవుతున్నాను. ఈ సినిమాకు అవకాశం వచ్చినప్పుడు ‘నేను సంగీతం అందించగలనా?’ అనే భయం వేసింది. వర్మగారు నా పై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించింది. ఇందులో 11 పాటలు ఉన్నాయి. ఇలాంటి పాటలు చేయలేదు. నా కెరీర్‌కు బాగా ఫ్లస్‌ అయ్యింది. వివాదాలను మా వరకు రానివ్వరు వర్మగారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉంటుంది. నా కెరీర్‌ పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కల్యాణీ మాలిక్‌ మంచి సంగీతం ఇవ్వగలడనే పేరును నిలబెట్టుకోవాలి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘అస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం నేను పేర్లు మార్చుకోలేదు. ఇక కెరీర్‌లో కల్యాణీ మాలిక్‌గానే కొనసాగుతాను. కీర్తీసురేశ్‌ సినిమాకు వర్క్‌ చేస్తున్నాను. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ఫైనల్‌ స్టేజ్‌లో సౌండ్‌ సూపర్‌ విజనింగ్‌లో నా పని మొదలవుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

ఆయన ఆంచనాలకు అందరు
సిరాశ్రీ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు దాదాపు 150 పాటలు రాశాను. అందులో 50కి పైగా పాటలు వర్మగారి చిత్రాలకు రాశాను. ఆయన పిలిస్తే ఇండస్ట్రీలో చాలా మంది లిరిసిస్టులు ఉన్నారు. కానీ ఆయన నాకే అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వర్మగారిని నేను ఒక ఈవెంట్‌గా చూస్తాను. మన మైండ్‌సెడ్‌తో ఆయన్ను అర్థం చేసుకోలేం. ఫిలసాఫికల్‌ ఔట్‌లుక్‌ వస్తుంది. వర్మగారు అంచనాలకు అందనివారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ మ్యూజిక్‌ డిస్కషన్స్‌లో ‘ఇది ఆర్జీవీ మ్యూజిక్‌లా ఉండకూడదంటే ఏం చేయాలి.

‘శంకరాభరణం, మేఘ సందేశం’లా బెంచ్‌మార్క్‌ క్లాసిక్‌ సంగీతంలా ఉండాలి’’ అని నాతో ఆర్జీవీగారు అన్నారు. వెంటనే నాకు కల్యాణీ మాలిక్‌గారి పేరు మైండ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలోని పాటను వినిపించాను. వెంటనే ఆర్జీవీగారు కల్యాణి మాలిక్‌ను తీసుకుందాం అన్నారు. వర్మగారికి సాహిత్యంపై పట్టు ఉంది. ఆయనకు ఎన్టీఆర్‌గారంటే విపరీతమైన అభిమానం. అగస్త్య మంజు ఈ సినిమాకు చీఫ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పడిన కష్టానికి దర్శకత్వంలో అర్ధభాగం ఇచ్చారు వర్మగారు. జయాపజయాల గురించి పెద్దగా ఆలోచించను. నా కెరీర్‌ పట్ల నేను హ్యాపీగా ఉన్నాను. ఖాళీ లేకుండానే పని చేస్తున్నాను’’ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్‌ఎన్టీఆర్‌: అసలు కథ’ చిత్రం విడుదల కాకపోవడం చాలా బాధగా ఉంది. బాగా నిరుత్సాహపడ్డాను. ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అక్కడ కూడా విడుదలైతే... ఇంత మంచి పేరు అక్కడ కూడా వచ్చి ఉండేదనే ఫీలింగ్‌ ఉంది. నా పరంగానే కాదు నిర్మాత కూడా చాలా నష్టపోయి ఉంటారు. నా సొంత ఊరు కొవ్వూరు. నా సొంత ఊరు కొవ్వూరులో నేను పని చేసిన సినిమా విడుదల కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement