నా సామి రంగ
నా సామి రంగ
Published Mon, Aug 19 2013 1:47 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM
దిలీప్, సాయికుమార్, శ్రీతేజ్, ప్రియాంక, యశస్విని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘నా సామి రంగ’. సుబ్రమణ్యం పచ్చా దర్శకుడు. సీహెచ్ కిరణ్‌కుమార్ రెడ్డి, జె.కృష్ణారెడ్డి, జీపి రెడ్డి నిర్మాతలు.
ఈ చిత్రం ప్రచార చిత్రాల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతల్లో ఒకరైన కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ- ‘‘దర్శకుడు సుబ్రమణ్యంతో 60 మందికి కథ చెప్పించాను. ఒక్కరు కూడా కథ బాగాలేదని చెప్పలేదు. అందుకే ధైర్యంగా ఈ కథను తెరకెక్కించాం.
చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. వచ్చేవారం పాటలను, త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఆద్యంతం నవ్వుల్లో ముంచే హాస్యచిత్రమిదని దర్శకుడు చె ప్పారు.ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: పి.బాల్‌రెడ్డి, ఎడిటింగ్: ఉపేంద్ర.
Advertisement
Advertisement