
ఒకరు కమ్మగా ఆలపిస్తారు.. మరొకరు కట్టిపడేసేలా నటిస్తారు.. ఇద్దరూ జత కడితే ఎలా ఉంటుంది? బొమ్మ బ్లాక్‌బస్టర్ కదూ! ఆ జంటే గీతామాధురి - నందు. టాలీవుడ్‌లో చూడముచ్చటైన జంటగా రాణిస్తున్న ఈ దంపతుల ఇంట ఆనందాలు వెల్లివెరిశాయి. వీరికి ఇదివరకే దాక్షాయని అనే కూతురు ఉండగా ఇటీవల ఓ బాబు పుట్టాడు. ఫిబ్రవరి 10న బాబు జన్మించాడంటూ కొద్దిరోజుల క్రితమే అభిమానులతో గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంది సింగర్.
మీ బుడ్డోడే కాదు.. పేరు కూడా క్యూట్..
తాజాగా వీరు బాబు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. బుడ్డోడికి ధృవధీర్ తారక్ అని నామకరణం చేశారు. ఈ ఫంక్షన్‌కు బంధువులతో పాటు ఇండస్ట్రీ మిత్రులు కూడా హాజరయ్యారు. మీ బుడ్డోడే కాదు, అతడి పేరు కూడా భలే క్యూట్‌గా ఉందంటూ వేడుకకు హాజరైన సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు. ఈ బారసాల ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఒకరు సింగర్.. ఒకరు హీరో
గీతామాధురి సింగర్ రాణిస్తుండగా నందు ఓపక్క హీరోగా, మరోవైపు స్పోర్ట్స్ యాంకర్, టెలివిజన్ హోస్ట్‌గా ఫుల్ బిజీగా ఉంటున్నాడు. 2014లో వీరి పెళ్లి జరగ్గా 2019లో ఓ పాప పుట్టింది. ఐదేళ్ల తర్వాత బాబు పుట్టాడు. కొడుకు పుట్టడానికి ముందు వీరు ఉదకశాంతి పూజ చేయించడం విశేషం.
చదవండి: అదే రాళ్లపల్లి వీక్‌నెస్! జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఇదే!
Comments
Please login to add a commentAdd a comment