ఉదకశాంతి పూజలో గీతామాధురి.. ఎందుకు చేస్తారంటే? | Geetha Madhuri Performs Udhaka Shanti Pooja With Nandu | Sakshi
Sakshi News home page

Geetha Madhuri: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి..

Published Sat, Feb 3 2024 10:32 AM | Last Updated on Sat, Feb 3 2024 10:44 AM

Geetha Madhuri Perform Udhaka Shanti Pooja with Nandu - Sakshi

ఒకరు అద్భుతంగా ఆలపిస్తారు.. మరొకరు అంతే అద్భుతంగా నటిస్తారు. వీరిద్దరి జోడీ చూడచక్కగా ఉంటుంది. ఆ జంట మరెవరో కాదు గీతా మాధురి- నందు. టాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా రాణిస్తున్న గీతా త్వరలో తల్లి కాబోతోంది. రెండోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నెలలోనే ఆమె డెలివరీ డేట్‌ ఉంది. ఈ విషయాన్ని గీతా మాధురియే స్వయంగా వెల్లడించింది. 

ఉదకశాంతి పూజ చేసిన సింగర్‌
ఇకపోతే నిండు గర్భిణి అయిన గీతా సీమంతం రెండు రోజుల క్రితం ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా ఆమె ఉదకశాంతి పూజ చేసింది. భర్తతో కలిసి ఈ పూజ ఆచరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేయగా వైరల్‌గా మారాయి. ఇంతకీ ఉదక పూజ అంటే ఏంటి? ఎందుకు చేస్తారని చాలామంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఎందుకు చేస్తారంటే?
ఉదకశాంతి అనేది వేదమంత్రాలతో ఆచరించే ఓ ప్రక్రియ. మంత్రజలంతో చేస్తారు కాబట్టి దీన్ని ఉదకశాంతి అంటారు. గృహ సంబంధ దోషాలను తొలగించడానికి మంత్రంతో నీటిని పవిత్రం చేసి దాన్ని ఇల్లంతా చల్లుతారు. ముఖ్యమైన సందర్భాల్లో ఈ పూజ చేస్తారు. దీని వల్ల ఇల్లంతా పవిత్రమవుతుంది. అలాగే ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకునేవారు ఈ పూజ చేస్తారట!

చదవండి: 'మీ భర్త సినిమాలో జరిగింది చూశారా?'.. స్టార్ ‍హీరో మాజీ భార్యకు కౌంటర్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement