టాలీవుడ్ సింగర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ గీతా మాధురి గుడ్‌న్యూస్ చెప్పింది. మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది. ఇందులో నందు, గీతా మాధురితో పాటు వీరి కూతురు దాక్షాయని ఉంది. వచ్చే ఫిబ్రవరిలో దాక్షాయని అక్క కాబోతుందంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. అంటే తాను మళ్లీ గర్భం దాల్చానని చెప్పకనే చెప్పింది. ఈ పోస్ట్ చూసిన పలువురు సెలబ్రిటీలు.. నందు-గీతా మాధురి జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
కాగా నందు- గీతా 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2019లో దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టింది. గీతా మాధురి సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తోంది. బెస్ట్ సింగర్‌గా ఎన్నో అవార్డులు సైతం అందుకుంది. ఇక నందు విషయానికి వస్తే అతడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నాడు. క్రికెట్ సీజన్‌లోనూ యాంకర్‌గానూ అవతారమెత్తుతున్నాడు. ఓటీటీల పుణ్యమాని వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులకు టచ్‌లో ఉంటున్నాడు.
ఇక నందు, గీతా విడిపోతున్నారంటూ గతంలో అనేక పుకార్లు రాగా అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారీ దంపతులు. తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ ఈ విడాకుల వార్తలు చూసి నవ్వుకున్నామని చెప్పాడు నందు. అలాగే రెండో బిడ్డకు ప్లానింగ్ చేస్తున్నామని హింట్ ఇచ్చాడు. ఇంతలోనే గీతా మాధురి తాను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
చదవండి: దుర్గమ్మను దర్శించుకుని బాబాయ్ హోటల్‌లో టిఫిన్ చేసిన వెంకీ మామ
Comments
Please login to add a commentAdd a comment