చిందేసిన హీరోయిన్‌ రష్మి | rashmi dance at college | Sakshi
Sakshi News home page

చిందేసిన హీరోయిన్‌ రష్మి

Published Fri, Oct 7 2016 7:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

చిందేసిన హీరోయిన్‌ రష్మి

చిందేసిన హీరోయిన్‌ రష్మి

  • ఉత్సాహంతో ఉరకలేసిన కుర్రకారు
  • కాట్రేనికోన(తూర్పు గోదావరి జిల్లా):
     
    సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా శ్రీ అచ్యుత ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘తను వచ్చెనట’ చిత్ర బృందానికి చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు గురువారం స్వాగతం పలికారు. జబర్ధస్త్‌ ప్రొగ్రామ్‌తో సుపరిచితురాలైన రష్మి విద్యార్థులతో చిందేసింది. డైరెక్టర్‌ వెంకట్‌ అచ్యుత్, కథానాయికి రష్మి గౌతమ్‌లు చిత్రం విశేషాలను వివరించారు. డైరెక్టర్‌ వెంకట్‌ మాట్లాడుతూ జాంబీ కథనంతో చిత్రం షూటింగ్‌ హైదరాబాద్, శ్రీశైలంలో జరిగిందని తెలిపారు. జాంబి అంటే దెయ్యాలు, భూతాలు సినిమా కాదని, చనిపోయిన భార్య తిరిగి వచ్చి అందరితో కలసి తిరుగుతూ ఉంటే ఇరుగు పొరుగు వారి ప్రశ్నలకు భర్త చెప్పిన సమాధానమే ‘తను వచ్చెనట’చిత్రం అన్నారు.  చిత్రం షూటింగ్‌ పూర్తయిందని, ఈ నెల 14న విడదల చేసేందుకు సిద్ధం చేశామన్నారు. హీరోయిన్‌ రష్మి మాట్లాడుతూ హీరో తేజా మొదటి భర్తగాను, చలాకీ వెంకట్‌ రెండో భర్తగా నటించారన్నారు. చిత్రం ప్రొడ్యుషర్‌ చంద్ర శేఖర్‌ ఆజాద్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి చంద్ర, కొరియోగ్రాపీ ఆండే పిల్లే, ఫిష్‌ వెంకట్, చంటి,  ఇతర తారాగణం పని చేశారన్నారు.
     
    సినిమాలతోపాటు సామాజిక సేవ
    వెలుగుబంద (రాజానగరం) : సినిమాల్లో నటిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నానని సినీనటి, టీవీ యాంకర్‌ రష్మి అన్నారు. సామాజిక సేవకు సినీరంగం ఒక వేదికగా ఉపయోగపడుతుందన్నారు. తాను నటించిన ‘తనువొచ్చేనంట’ సినిమా ప్రమోషన్‌ వర్కులో భాగంగా గురువారం గైట్‌ కళాశాలను సందర్శించిన ఆమె, చిత్ర దర్శకుడు వెంకట్, ఇతర సభ్యులతో కలసి కొంతసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ‘తనువొచ్చేనంట’ సినిమా యువతను ఆకట్టుకునే కథాంశంతో రూపొందిందన్నారు. ఈ సిని మాను హిట్‌ చేస్తే విజయోత్సవ వేడుకలను ఈ కళాశాలలోనే జరుపుతామని చెప్పారు. దర్శకుడు వెంకట్‌ మాట్లాడుతూ, శ్రీ అచ్చుత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ పై నిర్మించిన  ‘తనువొచ్చేనంట’ సినిమాను ఈ నెల మూడో వారంలో విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు. ‘జాంబీ’ అనే పాత్రను తెలుగులో మొదటిసారిగా పరిచయం చేస్తున్నామని, ఆ పాత్రలో రష్మి నటన హైలెట్‌ కానున్నదని అ న్నారు. ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణ నటిస్తున్నారన్నారు. కార్యక్రమంలో చైతన్య విద్యాసంస్థల డీజీఎం ఎ.నరేష్, నిర్మాత అజా ద్, కో ఆర్డినేటర్‌ మంతెన రవిరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement