తాప్సీ
నిప్పు రవ్వ వెలిగిస్తే చాలు రాకెట్ రివ్వున ఆకాశంలోకి పరిగెడుతుంది. ‘గెట్ సెట్ గో’ అనే పదాలు వింటే చాలు రష్మీ కూడా రాకెట్‌లా దూసుకుపోతుంది. ఆమె పరుగు వేగాన్ని చూస్తే కచ్చితంగా రష్మీ ద రాకెట్ అనాల్సిందే. గుజరాత్‌కు చెందిన అథ్లెట్ రష్మి పాత్రలో తాప్సీ నటించనున్న చిత్రం ‘రష్మీ ద రాకెట్’. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి రోనీ స్క్రూవాల్లా నిర్మాత.
ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ‘‘కొన్నిసార్లు ముందుకు దూసుకువెళ్లాలంటే కొన్ని అడుగులు వెనక్కి వేయాలి. కొత్త ట్రాక్‌లో రేస్‌కి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది’’ అని తాప్సీ పేర్కొన్నారు. పరుగు పందెంలో తన సత్తా చాటే క్రీడాకారిణిగా ఇందులో తాప్సీ కనిపించనున్నారు. ఇదో ఊహాజనిత కథ అని, ఏ అథ్లెట్ బయోపిక్ కాదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment