vaasu
-
‘రొమాంటిక్’హోలీ.. రంగు పడింది.. ప్రేమ పుట్టింది
హోలీ వచ్చిందంటే ఆ సందడే వేరు. బంధువులు సన్నిహితులంతా ఒక్కచోట చేరి రంగుల్లో మునిగితేలుతూ సంబరాలు చేసుకుంటారు. ఆకాశంలోని ఇంద్ర దనుస్సు నేలకు దిగి వచ్చిందా అనేంతగా ప్రజలంతా రంగుల్లో మునిగిపోతారు. ఇక ఈ పండుగ ప్రత్యేకతను చాటుతూ వెండితెరపై ఎన్నో చిత్రాలు ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యంగా ప్రేమికులను కలిపేందుకు ఈ హోలీ పండుగను వేదికగా మలిచిన ప్రేమ కథ చిత్రాలేన్నో. కొట్టు కొట్టు కొట్టు…రంగు తీసి కొట్టు రంగులోన లైఫ్ ఉంది రా… అంటూ కింగ్ నాగార్జున అందాల భామలను పడేశాడు. రంగు రబ్బ..రబ్బ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇలియానాతో కలసి రంగుల్లో మునిగి తేలాడు. రంగేలీ హోలీ…హంగామా కేళీ అంటూ డార్లింగ్ ప్రభాస్ అందాల భామలతో సందడి చేశాడు. ఇలా ప్రేమకథా చిత్రాల్లో హీరోహీరోయిన్ల మధ్య సయ్యాటలు, పాటలకు ఈ రంగుల పండుగను చేర్చి మరితం ఆకర్షనీయంగా మలిచిన ఆ చిత్రాలేంటో ఓ సారి చూద్దాం! ‘మజిలి’లో చై-సామ్ హోలీ! ఈ సినిమా సమంత, హీరో నాగ చైతన్య చాటుమాటుగా ప్రేమిస్తుంది. క్రికెట్ ఆడుతూ తన స్నేహితులతో జాలిగా తిరుగుతున్న హీరోని ఫాలో అవుతూ ఉంటుంది. అతడి అల్లరి చూస్తూ మురిపోతుంటుంది. తన ప్రేమను చెప్పకుండా వన్ సైడ్ లవ్‌లో పడుతుంది. నేరుగా అతడికి ఎదురుపడేందుకు భయపడే సామ్ హోలీ పండగలో మాత్రం ఏకంగా హీరోకి చాటుగా కలర్ పూసి ఆనందపడిపోతుంది. అలా ఎన్నో ప్రేమ కథ చిత్రాల్లో హీరోహీరోయిన్ల ప్రేమకు ఈ హోలీ పండుగ వేదికగా నిలిచింది. నాని-లావణ్యల ‘భలే భలే’ హోలీ భలే భలే మగాడివో చిత్రంలో నాని-లావణ్య త్రిపాఠిల ప్రేమలో కూడా హోలీ పండుగను చేర్చారు. రోడ్డుపై హీరోయిన్ చూసిన నాని అప్పుడే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ వెంటనే మొట్ట మొదటి సారి అంటూ పాట వేసుకుంటాడు నాని. ఇక ఇందులో హీరోయిన్‌తో కలిసి హోలీ ఆడుతూ ఆమెతో ప్రేమ ఆటలు ఆడుతాడు. ఇక ఆ తర్వాత తన మతిమరుపు జబ్బు దాచి హీరోయిన్ ఎలాగోలా ప్రేమలో పడేస్తాడు. ఛార్మితో నాగ్ ‘మాస్’ హోలీ కింగ్ నాగార్జున కెరీర్లో హిట్ సినిమాల్లో ‘మాస్’ సినిమా ఒకటి. అన్నమయ్య, రామదాసు వంటి చిత్రాలతో తర్వాత నాగార్జున యూత్ మంచి క్రేజ్ తీసుకువచ్చిన సినిమా కూడా ఇదే. డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. 2004లో వచ్చిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇందులో జ్యోతిక, ఛార్మిలు హారోయిన్లుగా నటించారు. తన పగ కోసం చార్మి ఉంటున్న అపార్ట్మెంట్లో ఉండేందకు వచ్చిన నాగ్ తన ఉనికిని ఎవరికి తెలియకుండ జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలో నాగ్ అపార్ట్మెంట్ వాసులకు దగ్గరయ్యేందుకు లారెన్స్ హోలీ పండగను వేదికగా తీసుకున్నాడు. ఈ క్రమంలో కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు అంటూ నాగ్ ‘మాస్’లో ఛార్మితో ఆడిపాడాడు. ఈ పాట తర్వాతే ఛార్మీ నాగ్ ప్రేమలో పడుతుంది. రంగుల్లో భూమిక ప్రేమలో పడ్డ ‘వాసు’ తన ఫ్రెండ్‌ను కొట్టిన విలన్ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు వెళతాడు వెంకటేశ్. అయితే అప్పుడే హీరోయిన్‌తో వెంకి ప్రేమలో పడతాడు. ఈ సీన్ ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు రంగుల పండుగను తీసుకున్నాడు డైరెక్టర్. విలన్లను కొట్టేందుకు వచ్చిన వెంకీ రంగుల మబ్బుల్లో చందమామల హీరోయిన్ వైట్ డ్రెస్‌తో ఎంట్రీ ఇస్తుంది. తనపై రంగుల పడకుండా నవ్వుతూ పరుగెడుతుంటే వెంకీ ఆమెను అలా కళ్లార్పకుండా చూస్తునే ఉండిపోతాడు. అలా వైట్ డ్రెస్‌తో చందమామల మెరిసిపోయిన్ హీరోయిన్ భూమికతో లవ్‌లో పడతాడు. అమెరికాలో ‘దేవదాసు’ హోలీ సెలబ్రెషన్స్ రామ్-ఇలియాన వెండితెర ఎంట్రీ ఇచ్చిన చిత్రం దేవదాసు. ఇండియాలో ఉండే రామ్ అమెరికా సెనెటర్ కూతురైన ఇలియానతో ప్రేమలో పడతాడు. ఇండియాకు వచ్చిన మధుతో లవ్‌లో పడ్డ హీరో తన ప్రేమను గెలిపించుకునేందుకు అమెరికాకు వెళతాడు. అక్కడ ఆమెను కలుసుకునేందుకు హోలీని ప్లాన్ చేస్తాడు. హీరోయిన్ను ఎలా అయినా కలవాలి అన్న సాకుతో హోలీ రోజున హీరోయిన్ను తన తండ్రి చేతనే బయటకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేసి కలుస్తాడు. చివరకు హీరోయిన్ తండ్రితో చివరి వరకూ యుద్దం చేసి తన ప్రేమను గెలిపించుకుంటాడు. షామిలిని పడేసేందుకు హోలీని అడ్డుపెట్టుకున్న సిద్దూ ఈ సినిమాలో రిచ్ పర్సన్యాలిటీ అయినటువంటి హీరో, తనకు నచ్చిన షామిలీని ప్రేమించేందుకు అనేక పాట్లు పడుతూ ఉంటాడు. అందులో భాగంగానే షామిలీ కుటుంబంలో ఉన్న పిల్లలను తనకు సపోర్ట్‌గా చేసుకునేందుకు హోలీ పండుగను ఎంపిక చేసుకుని రంగుల్లో మునిగి తేలతాడు. ఇక ఆ పద్దతి నచ్చని షామిలీ తన ఇంట్లో పిల్లల్ని తీసుకెళ్ళి పోయి, హీరోకి పెద్ద షాక్ ఇస్తుంది. అలా ఎన్నో ట్రైల్స్ వేసి హీరో చివరకు ప్రేమ కథను ముగిస్తాడు. -
ఆయన 60 ఏళ్ల టీనేజర్!
‘‘కొత్త వారికి చాన్స్ ఇచ్చేందుకే వి4 బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. పెద్ద బ్యానర్స్‌లో కొత్త డైరెక్టర్స్‌తో వెంటనే రిస్క్ చేయలేం. టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఛాన్స్ ఇచ్చి, వారు వి4 బ్యానర్లో ప్రూవ్ చేసుకుంటే బిగ్ బ్యానర్లో చాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. రైటర్స్‌ని, మ్యూజిక్ డైరెక్టర్స్‌ని అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఆది, వైభవీ శాండిల్యా, రష్మీ గౌతమ్ ముఖ్య తారలుగా ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. ‘బన్నీ’ వాసు చెప్పిన విశేషాలు... ∙ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడుతున్నారు. కథలో ఉన్న ఎంటర్టైన్మెంట్ మీద నమ్మకంతోనే ఈ సినిమా నిర్మించా. ఆది చాలా ప్రొఫెషనల్. ఒక మంచి సక్సెస్ వస్తే స్టార్హీరో అవుతాడు. ఆ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్‌లో మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని నమ్మి, మారుతి బ్యానర్లో రికమండ్ చేశాను. ప్రభాకర్ «థర్డ్ మూవీ కూడా లైన్లో ఉంది. నా పార్టనర్స్ కూడా ఓకే అంటే వి4 బ్యానర్లోనే ఆ సినిమా ఉంటుంది. నెక్ట్స్ సినిమాకి ముగ్గరు కుర్రాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ∙అల్లు అరవింద్‌గారు 60 ఏళ్ల వయసున్న టీనేజర్. ‘టు బి విత్ యంగ్ పీపుల్’ అనేదే అరవింద్‌గారి బిజినెస్ సీక్రెట్ అనుకుంటున్నా. నాకు, వంశీ (వి4లో మరో నిర్మాత)కి ఆయన గురువులాంటి వారు. ∙పవన్ కల్యాణ్‌గారి ఫ్యాన్‌ని. ఆయనతో వర్క్ చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దానయ్యగారు ఒక్క మాట చెప్పి ఉండాల్సింది ‘‘అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను ఏప్రిల్ 27నే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మహేశ్‌బాబు సినిమాను అదే రోజు విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. మేమే ఫస్ట్ ఏప్రిల్ 27 అని డేట్ చెప్పాం. దానయ్య (మహేశ్ సినిమా నిర్మాత) గారు ఒక్క మాట ముందుగా చెబితే మేమిద్దరం కలసి వేరేలా ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఆయన చెప్పకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బాధ అనిపించింది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఇప్పుడు దానయ్యగారు మీకు చెబితే డేట్ మార్చుకుంటారా? అనడగితే.. ‘‘నేనే కాదు... ఇద్దరూ చొరవ తీసుకోవాలి. అది సమ్మర్ సీజన్. హిట్ సినిమాలు ఆడతాయి. నేను, లగడపాటి శ్రీధర్ (‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రనిర్మాత) గారితో మాట్లాడి ఇంకో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఐదు నిమిషాల పని. ఏప్రిల్ 27న ‘ఖుషీ’ సినిమా రిలీజైంది. ఏప్రిల్ 8న బన్నీగారి బర్త్‌డే. 7న మేం రిలీజ్ చేయొచ్చు కానీ, రామ్‌చరణ్ గారి సినిమా సమ్మర్లో వస్తుందేమోనని ఏప్రిల్ 27న అని అనౌన్స్ చేశాం. ఇప్పుడు మేం భయపడి వెళ్లినట్లు ఉండకూడదు. బేసిక్‌గా నాకది ఇష్టం లేదు. అవసరం లేదు కూడా. పెద్దలు ఉన్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో? ‘ఈగ’, ‘జులాయి’ చిత్రాల రిలీజ్ అప్పుడు రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండాలని మేం పోస్ట్‌పోన్ చేసుకున్నాం. అప్పుడు దానయ్యగారే ఒప్పుకున్నారు. అలా ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం ఉండాలి. కానీ, ‘నా పేరు సూర్య...’ డేట్ ఆల్రెడీ మేం అనౌన్స్ చేశాం. ఒక్క మాట కూడా చెప్పకుండా దానయ్యగారు అలా చేయడం అన్నది కరెక్ట్ కాదనిపించింది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు. -
వాసు పాటల బాటలో నడుద్దాం
– సంస్మరణ సభలో వక్తలు కర్నూలు (కల్చరల్): ప్రజానాట్య మండలి కవి, గాయకుడు వాసు పాటల బాటలో నడుద్దామని, ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేద్దామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ పిలుపునిచ్చారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం సీపీఎం, ప్రజానాట్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో వాసు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ.. అత్యంత సాదాసీదా జీవనం గడిపిన వాసు నిరంతరం శ్రమ జీవుల కష్టాలను అక్షరీకరించేందుకు కృషి చేశాడన్నారు. ఆయన రాసిన పాటలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయన్నారు. వాసు రాసిన ప్రతిపాట నిరుపేదల బతుకు చిత్రాన్ని తెలుపుతోందని ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రజానాట్యమండలి బాసటగా నిలుస్తుందన్నారు. రవీంద్ర విద్యాసంస్థ డైరెక్టర్ పుల్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చిన్న వయస్సుల్లోనే తనువు చాలించడం అత్యంత విషాదకరమన్నారు. పాట కోసం ఆయన పడిన తపన మరువలేనిదన్నారు. కళాకారులందరికీ వాసును ఆదర్శప్రాయుడని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య కొనియాడారు. వాసు కుటుంబానికి పలువురు ఆర్థిక సాయం అందించారు. వాసుకు స్వర నీరాజనం.. వాసు రాసిన గీతాలను పాడి నీరాజనం అర్పించారు. కథా రచయిత ఇనాయతుల్లా కవిత ద్వారా, గజల్ గాయకుడు మహమ్మద్‌మియా గజల్ ద్వారా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, చేతివృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శేషయ్య, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌బాబు, వాసు సోదరుడు అన్నయ్య, ప్రజానాట్య మండలి కళాకారులు నాగరాజు, జిల్లా అధ్యక్షులు బసవరాజు, వాసు సతీమణి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
పాటల ‘సెమట సుక్క’కు కన్నీటి వీడ్కోలు
– ప్రజా కవి వాసు అంతిమయాత్రకు తరలివచ్చిన కళాకారులు – గఫూర్, గేయానంద్ తదితరులు నివాళులు కర్నూలు(కల్చరల్): పాటవై మళ్లీ వస్తావా..! మా వాసన్న..!.. పోరు బాటకు తోడై ఉంటావా.. మా వాసన్న..! సెమట సుక్కవై నింగికెగిసావా.. మా వాసన్న..! అంటూ ప్రజా కవి ఆర్ఏ వాసుకు ప్రజానాట్య మండలి కళాకారులు నివాళులు అర్పిస్తూ పాడిన గీతం అందరినీ కంటతడి పెట్టించింది. స్థానిక సీపీఎం కార్యాలయ ఆవరణలో వాసు భౌతిక కాయాన్ని ఉంచి సీపీఎం నాయకులు, ప్రజా కళాకారులు, కవులు, గాయకులు నివాళులు అర్పించారు. అంతకుముందు స్థానిక మార్కెట్‌యార్డు సమీపంలోని ఇందిరాగాంధీ నగర్లో వాసు స్వగృహం వద్ద ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, ఎమ్మెల్సీ గేయానంద్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, ప్రజావైద్యశాల డైరెక్టర్ డా.బ్రహ్మారెడ్డి, డా.వీవీ లక్ష్మీనారాయణ, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి, గాయకుడు మహమ్మద్‌మియా, సహాయ కార్యదర్శి, రచయిత ఇనాయతుల్లా, కోశాధికారి బాల వెంకటేశ్వర్లు, టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు, విశ్వకళాసమితి అధ్యక్షుడు హనుమంతరాయచౌదరి, రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నాయకుడు చంద్రన్న, ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం నాయకులు సుధారాణి, చంద్రకంటి మద్దయ్య, రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ పుల్లయ్య, తదితరులు నివాళులు అర్పించారు. అంతిమయాత్రలో పేదల గాయకుడు వాసు అమర్ రహే, జోహార్.. జోహార్.. వాసు ఆశయాలు కొనసాగిస్తాం.. అనే నినాదాలు మార్మోగాయి. వాసు సతీమణి సుజాత, కుమార్తెలు లహరి, వెన్నెలను పలువురు పరామర్శించారు. స్థానిక సుంకేసుల రోడ్డులోని క్రై స్తవ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పాటల కెరటం వాసు: పేద ప్రజల కష్టాలను ప్రజా కవి వాసు సమీపం నుంచి పరిశీలిస్తూ దుర్భరమైన జీవనాన్ని గడుపుతున్న శ్రమజీవులు, హమాలీలు, కూలీల జీవితాలను వాసు అక్షరీకరించి పాటల కెరటమై నిలిచారని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయ ఆవరణంలో వాసు భౌతికకాయానికి నివాళులు అర్పిస్తూ ఆయన సంతాప సందేశాన్ని అందించారు. వాసు ఆశయాలను కళాకారులు, కార్యకర్తలు కొనసాగించాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు షడ్రక్ మాట్లాడుతూ వాసు తన జీవితాన్ని పాటలకే అంకితం చేసి ప్రజల్ని చైతన్యపరిచారన్నారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ పేదరికంపై, అణచివేతపై వాసు రాజీలేని పోరాటం చేశారన్నారు. తన పదునైన పాటలతో ప్రస్తుత రాజకీయ వ్యవస్థను తూర్పారబట్టారన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు విజయకుమార్, క్రాంతి, తెలంగాణా ప్రజానాట్య మండలి నాయకులు జగ్గరాజు, నరసింహా, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, సీఐటీయూ నాయకులు పుల్లారెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్లప్ప, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మద్దయ్య, కర్నూలు ప్రజానాట్య మండలి కార్యదర్శి బసవరాజు, గాయకులు ఆశన్న, కళాకారులు లోకేష్, కరుణాకర్, సీపీఎం కార్యకర్తలు, డప్పు కళాకారులు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. పాల్గొన్నారు.