Rashmi Gauthm
-
మహేశ్ బాబు భావోద్వేగం.. ఆరోగ్యంగా ఉండాలన్న భూమిక
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పీఆర్వో బీఏ రాజు హఠాన్మరణం పట్ల మహేశ్‌బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో స్పెషల్ బాండింగ్ ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది నటి భూమిక బ్లాక్ డ్రైస్‌లో అదరగొడుతన్న శివాత్మిక ఇంట్లోనే గడుపుతూ ఆరోగ్యంగా ఉండడంటున్న అమిషాపటేల్ View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
ఆ విషయంలో రాజీపడను!
‘‘ఓన్లీ వన్ టైప్ ఆఫ్ మూవీస్‌నే ఎందుకు చేస్తున్నారని కొందరు అడుగుతున్నారు. మహేశ్, ప్రభాస్ ఇలా ఇండస్ట్రీలోని స్టార్ట్స్ అందరితో నటించాలని నాకు ఉంది. కానీ, పర్టిక్యులర్ రోల్స్ కావాలని నేనెవర్నీ అప్రోచ్ కాలేదు. నాకు వచ్చిన చాన్సుల్లో నచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాను. కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలన్నదే నా కోరిక’’ అన్నారు రష్మీ గౌతమ్. ఆది, వైభవీ శాండిల్య, బ్రహ్మజీ, రష్మీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. రష్మీ గౌతమ్ చెప్పిన విశేషాలు.. ► మంచి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రమిది. ఇందులో గ్లామరస్ రోల్ చేశాను. ఈ సినిమా అంతా నేను శారీస్‌లోనే కనిపిస్తాను. నా రోల్ ఫస్ట్ హీరోయిన్నా? లేక సెకండ్ హీరోయిన్నా? అన్నది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. క్యారెక్టర్ నాకు నచ్చింది. నైట్ షూట్స్ బోర్ కొట్టేశాయి. అందుకే, ఇకపై హర్రర్ మూవీస్‌లో నటించకూడదనుకుంటున్నా. ► దర్శకుడు ప్రభాకర్ ముందు నటుడు కాబట్టి సెట్లో మా పని ఈజీ అయ్యింది. ఆయన నటించి చూపించేవారు. ఈ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను. సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే అది సినిమాలోని క్యారెక్టర్స్ పరంగానే ఉంటాయి. అయినా డైరెక్టర్స్ విజన్‌ని మనం నమ్మాలి. అల్లు అరవింద్‌గారు, ‘బన్నీ’ వాసు వంటి నిర్మాతల విజన్‌ను రెస్పెక్ట్ చేయాలి. ► డైరెక్టర్స్ నాకు కథ చెప్పినప్పుడు క్యారెక్టరైజేషన్ మాత్రమే ఆలోచిస్తాను. కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కాను. కంఫర్ట్‌గా ఉంటేనే వేసుకుంటాను. కాస్ట్యూమ్స్ సరిగా లేవని ఓ ఐటమ్ సాంగ్ వద్దనుకున్నాను. ► ప్రేక్షకులు చుస్తున్నారు కాబట్టే గ్లామరస్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అయినా నాకు గ్లామర్ ఉంది... చూపిస్తున్నాను. నాకు తెలిసి నేనిప్పటి వరకు 30 పర్సెంట్‌కు మించి స్కిన్ షో చేయలేదు. ఈ రోజుల్లో బికినీ అనేది కామన్ అయిపోయింది. కొన్ని వెబ్‌సైట్స్‌లో నా గురించి ఏవేవో వార్తలు రాశారు. వారి దగ్గర ప్రూఫ్ ఉండదు. అవి పుకార్లని నాకు తెలుసు కాబట్టి, సైలెంట్‌గా ఉంటాను. ► సినిమాలు చేస్తున్నాను. టీవీ షోస్‌లోనూ కంటిన్యూ అవుతాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. -
భయపెట్టడానికి రెడీ అవుతున్న రష్మీ
బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మి ఇప్పుడు వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే పలుచిత్రాల్లో చిన్నచిన్న పాత్రల్లో మెప్పించిన ఈ బ్యూటీ ప్రస్తుతం గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్గా సక్సెస్ కొట్టాలని భావిస్తోంది. జాతీయ అవార్డ్ సాధించిన దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అదే జోష్‌లో ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. తెలుగుతెర మీద ఇంత వరకు నేరుగా రాని జాంబి తరహా కథాకథనాలతో తెరకెక్కనున్న కామెడీ ఎంటర్టైనర్లో రష్మి లీడ్ రోల్లో కనిపించనుంది. జాంబీ కామెడీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు 'తను వచ్చెనంట' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. రష్మితో పాటు తేజ కాకుమాను, ధన్యా బాలకృష్ణన్, చలాకీ చంటి ఇతర ప్రదాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు బుల్లితెర మీద, వెండితెర మీద తన గ్లామర్‌తో, మంచి టైమింగ్‌తో నవ్వించిన రష్మి ఇప్పుడు ఈ హర్రర్ సినిమాతో ఎంత వరకు భయపెడుతుందో చూడాలి.