తలచినదే జరిగినదా... | Talachinade Jariginada Movie Opening at hyderabad | Sakshi
Sakshi News home page

తలచినదే జరిగినదా...

Jun 25 2019 3:13 AM | Updated on Jun 25 2019 3:13 AM

Talachinade Jariginada Movie Opening at hyderabad - Sakshi

ఊర్వశి, రామ్‌కార్తీక్‌

షైన్‌ పిక్చర్స్‌ పతాకంపై రామ్‌కార్తీక్, ఊర్వశి పరదేశి జంటగా సూర్యతేజ దర్శకునిగా పరిచయం అవుతున్న ‘తలచినదే జరిగినదా’ చిత్రం  సోమవారం ప్రారంభమైంది. శేఖర్‌ రెడ్డి, సంధ్య రెడ్డి నిర్మాతలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కళ్యాణ్‌ క్లాప్‌ ఇవ్వగా, ఎమ్‌. హరికృష్ణారావు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ‘దండు’ చిత్రదర్శకుడు సంజీవ్‌ కుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

సూర్యతేజ మాట్లాడుతూ– ‘‘2000 ఏళ్ల క్రితం మొదలైనటప్పటి జీవితాలకు ఇప్పటి జీవితాలకు ఉన్న తేడాను తెలిపే ఫిక్షన్‌ స్టోరీనే మా చిత్రం. ‘జెర్సీ’ చిత్రానికి అసిస్టెంట్‌ దర్శకునిగా, అనేక ప్రభుత్వ ప్రకటనలకు డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా తీస్తున్నాను’’ అన్నారు. శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘జూలై 8న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘వేర్‌ ఈజ్‌ వెంకట లక్ష్మీ’ చిత్రం తర్వాత నేను చేస్తున్న చిత్రం ఇది’’ అన్నారు రామ్‌కార్తీక్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement