వెంకటేష్‌గారి మాటే ‘వీక్షణం’కి మూలం | Director Manoj Palleti Talks About Veekshanam Movie | Sakshi
Sakshi News home page

వెంకటేష్‌గారి మాటే ‘వీక్షణం’కి మూలం

Published Tue, Oct 15 2024 10:34 AM | Last Updated on Tue, Oct 15 2024 10:47 AM

Director Manoj Palleti Talks About Veekshanam Movie

రామ్‌ కార్తీక్, కశ్వి జంటగా నటించిన చిత్రం ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్‌ పతాకంపై పి. పద్మనాభ రెడ్డి, అశోక్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మనోజ్‌ పల్లేటి మాట్లాడుతూ– ‘‘ఎమ్‌బీఏ పూర్తయ్యాక సినిమాలపై ఆసక్తితో రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌లో డీఎఫ్‌టీ కోర్సు పూర్తి చేశా. ‘జార్జి రెడ్డి, జోహార్‌’ వంటి చిత్రాలకు పనిచేశాను. 

ఓ సందర్భంలో వెంకటేష్‌గారితో మాట్లాడే అవకాశం లభించింది. ‘ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే.. మన పని మనం చూసుకోకపోవడమే’ అని అన్నారాయన. ఈ లైన్‌ నాకు ఎగ్ట్జైటింగ్‌గా అనిపించింది. ‘వీక్షణం’  కథకు ఈ లైన్‌ మూలం. సంతోషంగా జీవిస్తున్న ఓ అబ్బాయి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం వల్ల అతని జీవితం ఎలా ప్రభావితమైంది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్‌’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సమర్థ్‌ గొల్లపూడి మాట్లాడుతూ–‘‘కోటిగారి దగ్గర వర్క్‌ చేశాను. ఎమ్‌ఎస్‌ రాజుగారి ‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రానికి సంగీతం అందించాను. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ‘వీక్షణం’ రెండో చిత్రం. ఇందులో మూడు పాటలున్నాయి’’ అని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement