
ప్రనాలి, రామ్ కార్తీక్
డైరెక్టర్ దేవా కట్టా వద్ద ‘ప్రస్థానం’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన బాల బోడెపూడి తొలిసారి దర్శక–నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘మంచు కురిసే వేళలో’. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా నటించారు. ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై రూపొందింది. దర్శక–నిర్మాత బాల మాట్లాడుతూ– ‘‘అందమైన కథ, కథనాలతో తీసిన స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. సంగీతం, సినిమాటోగ్రఫీ హైలెట్‌గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్‌లో ఉత్తమ చిత్రం అవుతుంది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది. ఈ నెలలోనే ఆడియోను, డిసెంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి.
Comments
Please login to add a commentAdd a comment