
'ప్రతిపక్షంపై ఎదురుదాడి సరికాదు'
హైదరాబాద్: విపక్ష నాయకుడు కె.జానారెడ్డిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి జానారెడ్డి నిర్మాణాత్మక సూచనలు చేశారని చెప్పారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడం సమంజసం కాదని హితవు పలికారు.
ప్రతిపక్ష నేత జానారెడ్డివన్నీ చిల్లర విమర్శలని, కాంగ్రెస్ పార్టీలో ఉనికికోసమే ఆయన సంకుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం విమర్శించారు. ఎవరికి చేతనవుతుందో ప్రజలకు తెలుసని, అందుకే కాంగ్రెస్‌ను గద్దె దింపి టీఆర్‌ఎస్‌కు అధికారాన్ని అప్పగించారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రస్తుత సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు.