K. Jana Reddy
-
ఏపీలో ప్రతిపక్ష నేత మైకునే కట్ చేస్తున్నారు
⇒ ఇక్కడ ప్రతిపక్షానికే ఎక్కువ సమయం ఇస్తున్నాం: హరీశ్‌రావు ⇒ అయినా హుందాగా వ్యవహరించడం లేదంటే ఎలాగని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: పద్దులపై చర్చ సంద ర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి వ్యవహరించిన తీరు హుందాగా లేదన్న ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డిల ఆరోపణలను మంత్రి హరీశ్‌రావు ఖండించారు. ఆ చర్చలో డిప్యూటీ స్పీకర్ ప్రతి పక్షానికే ఎక్కువ అవకాశమిచ్చారని స్పష్టం చేశారు. ఎక్కువ సభ్యులున్న అధికార పక్షం 25 నిమిషాలు మాట్లాడితే.. కాంగ్రెస్ సభ్యులు గంటా ముప్పై నిమిషాలు, బీజేపీ సభ్యులు 46 నిమిషాలు మాట్లాడారని వివరించారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల మొత్తంగా చూసినా.. టీఆర్ఎస్ సభ్యులు ఆరు గంటల ముప్పైనిమిషాలు మాట్లాడితే, కాంగ్రెస్ సభ్యులు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడారని తెలిపారు. ప్రతిపక్ష నేత లేచిన ప్రతిసారి డిప్యూటీ స్పీకర్ మైకు ఇచ్చారని.. దాదాపు ఐదుసార్లు ఆయన చర్చ మధ్యలో మాట్లాడారని చెప్పారు. అయినా ప్రతిపక్షం పట్ల హుందాగా వ్యవహరించడం లేదన్న వ్యాఖ్యలు బాధాకరమని హరీశ్ వ్యాఖ్యా నించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత మైకును పదే పదే కట్ చేస్తున్నారని.. అదే మన శాసనసభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ తీరు ఆక్షేపణీయం మంగళవారం డిప్యూటీ స్పీకర్ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉందంటూ ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పీకర్ దృష్టికి తెచ్చారు. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే ఈ విషయాన్ని లేవనెత్తారు. సభ సజావుగా జరిగేందుకు అధి కార పక్షానికి ప్రతిపక్షం పూర్తిగా సహకరి స్తోందని.. ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడినా సమయమిచ్చిన డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షం నుంచి మాట్లాడితే అవకాశం ఇవ్వ లేదని ఆరోపించారు. దీనిపై ప్రతిసారి లేచి చెప్పడానికి తనకు హుందాగా లేదని, పద్దులపై తమ అభ్యంతరాలు వినకపోవడం విచారకర మన్నారు. ‘‘డిప్యూటీ స్పీకర్‌కు తగిన సూచ నలు, సలహాలు ఇవ్వండి. అవవసరమైతే ప్యానల్ స్పీకర్‌ను సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి డిప్యూటీ స్పీకర్‌తో చర్చించండి. సభను ఇలాగే జరుపుతామంటే ఇక్కడ కూర్చో వడంలో అర్థం లేదు..’’అని జానా వ్యాఖ్యానిం చారు. ఇక ప్రజల ఆవేదనను సభలో చెప్పేం దుకు వస్తే డిప్యూటీ స్పీకర్ పదేపదే తమ మైక్ కట్ చేశారని.. విపక్షాలను మాట్లాడ నివ్వడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపిం చారు. జానారెడ్డి అంటే అపార గౌరవముంది రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న జానారెడ్డి అంటే తమకు అపార గౌరవం ఉందని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. స్పీకర్ స్థానంలో ఎవరు కూర్చున్నా హుందాగానే వ్యవహరిస్తారని.. ఏపీలో కన్నా ఇక్కడ హుం దాగా సభను నడుపుకొంటున్నామని వ్యాఖ్యా నించారు. ఎవరికెంత సమయం ఇవ్వాలన్న దానిపై కొన్ని మినహాయింపులు ఉన్నాయని.. వాటిని పక్కనపెట్టి కూడా డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం కేటాయించారని చెప్పారు. -
కేసీఆర్ మార్కులు నాకెందుకు?: జానా
సాక్షి, హైదరాబాద్: ‘‘నా నియోజకవర్గంలో నాకు సానుకూల పరిస్థితులున్నాయి. కేసీఆర్ వేసే మార్కులు నాకు అవసరం లేదు. ఇలాంటి సర్వేలపై ఆధారపడి కాదు... ప్రజలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నా’’అని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం తర్వాత తన చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేలపై, వాస్తవ పరిస్థితులపై మీడియా కూడా సరైన విశ్లేషణలను అందించడం లేదన్నారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం సర్వేలను చేయించడం దుబారా ఖర్చన్నా రు. ‘‘నేను ఓడిపోతానని పోటీ చేసిన ప్రతీ సారి సర్వేలు చేసి చెప్పారు. అయినా అన్నిసార్లు గెలిచాను. ఈ సర్వేలు కేవలం చదువుకోవడానికే. ఎవరో సీఎం అవుతారని అనగానే అయిపోము. దానికి చాలా సమీకరణాలుంటాయి’ అన్నారు. తాను సీఎం అవుతానని ఏనాడూ, ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. -
ఎన్నేళ్లలో రోడ్లు పూర్తి చేస్తారు?
సభలో సర్కారును నిలదీసిన జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళికలు, ప్రస్తుతం నిధులు కేటాయిస్తున్న తీరు చూస్తుంటే వాటి పూర్తికి కనీసం మరో తొమ్మిదేళ్లు పట్టేలా ఉంది. రోడ్ల నిర్మాణాలను ఎన్నేళ్లలో పూర్తి చేస్తారో స్పష్టంగా చె ప్పాలి’ అని ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాం డ్ చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ రోడ్లు, బ్రిడ్జిలపై అసెంబ్లీలో లఘు చర్చలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వమిచ్చిన రూ.21 వేల కోట్ల ప్రణాళికలు గందరగోళంగా ఉన్నాయన్నారు. ‘రోడ్ల నిర్మాణాన్ని మరో తొమ్మిదేళ్లలో పూర్తి చేస్తారా? పదిహేనేళ్లలోనా? లేక పాతికేళ్లలోనా? అప్పటివరకు మీరే అధికారంలో ఉంటారా? మరో రూ.లక్ష కోట్లతో 50 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళికలిస్తే ఎలా గందరగోళంగా ఉంటుందో రోడ్ల ప్రణాళికా అలాగే ఉంది. రోడ్లను ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పండి. అప్పుడే ప్రజలకేం చెప్పాలో, ప్రభుత్వానికి ఏం సలహాలివ్వాలో ఇస్తాం. అసలు ఇప్పటిదాకా ఎన్ని రోడ్లకు ప్రణాళికలు వేశారు? ఎన్ని మంజూరు చేశారు? ఎన్నింటికి టెండర్లు పిలిచారో వివరించండి. ఆ రోడ్లకు ఏటా ఎన్ని నిధులు కేటాయిస్తారో, ఎన్ని పూర్తి చేస్తారో ప్రణాళికబద్ధంగా చెప్పాలి. వచ్చే బడ్జెట్లో పెట్టాలి. జాతీయ రహదారులకయ్యే రూ.14 వేల కోట్లలో కనీసం రూ.3 వేల కోట్లయినా తేవాల్సి ఉండగా 450 కోట్లు మాత్రమే తెచ్చారు’ అని అన్నారు. హైవేలపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మె ల్యే చిన్నారెడ్డి అన్నారు. సద్వినియోగపరచండి: కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి గడ్కారీకి రాష్ట్ర పరిస్థితి తెలుసు గనుకే రోడ్ల అభివృద్ధికి అడిగినన్ని నిధులిస్తున్నారని బీజేపీ శాసనసభ పక్ష నేత జి.కిష న్‌రెడ్డి అన్నారు. కేంద్ర సాయాన్ని సద్వినియోగపరచాలని సూచించారు. కాంగ్రెస్ హ యాంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. గోదావరిపై ఇన్లాండ్ వాటర్ సిస్టం రావాలన్నారు. పలు పార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రోడ్లను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ‘పథకం మాది...ప్రచారం టీఆర్ఎస్ది’ హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్న రూ.5 భోజన పథకంపై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ‘మా హయాంలో ప్రారంభించిన పథకం అ మలు తీరు గురించి తెలుసుకునేందుకు కె.జానారెడ్డి, నేను రూ.5 భోజనాన్ని తెప్పించుకుని భేష్ అంటే.. దాన్ని టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వాడుకొని మెజారిటీ సీట్లు కొట్టేసింది. భోజనం మాకు.. సీట్లు వారికి’ అని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి అనడంతో సభ్యులంతా ఘొల్లున నవ్వారు. ‘కాంగ్రెస్ టైమింగ్ మాకు అలా కలిసొచ్చింది’ అని కేటీఆర్ అనడంతో సభలో మళ్లీ నవ్వులు పూశాయి. త్వరలో వీధి అమ్మకందారుల బిల్లు: కేటీఆర్ త్వరలో వీధి అమ్మకందారుల బిల్లును తీసుకురానున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. దీన్ని త్వరలోనే కేబినెట్‌కు పంపించి వీలునుబట్టి ఈ సమావేశాల్లోనే బిల్లును తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఈ అంశంపై కొంపల్లి యాదవరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. విద్యుత్ కొనుగోళ్లన్నీ బహిర్గతమే: జగదీశ్ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లన్నీ బహిర్గతమేనని, కొనుగోళ్లలో పారదర్శ కతకు పెద్దపీట వేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మం డలి ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్ విపక్ష నేత షబ్బీర్‌అలీతో పాటు ఆ పార్టీ సభ్యుడు పొంగులేటి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఉపాధి కల్పనలో ఇబ్బందులను అధిగ మించడం, పారిశ్రామిక రంగాలను ఆదుకోవడం, వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ విద్యుత్ దొరికినా కొనుగోలు చేయాలన్న సీఎం ఆదేశాల మేరకే బహిరంగ టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోళ్ల నిర్ణయం జరిగిందన్నారు. -
మాకు మైకురాదు.. మీరు గట్టిగా మాట్లాడరు
-
మాకు మైకురాదు.. మీరు గట్టిగా మాట్లాడరు
జానారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆగ్రహం • మెతక వైఖరితో పార్టీకి నష్టం • టీఆర్ఎస్పై దూకుడుగా పోవాలన్న సభ్యులు • ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం దిశగా చర్చ! సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్ఎస్ వైఫల్యాలపై, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడదామంటే మాకు మైకు ఇవ్వరు. మీకు మైకు ఇచ్చినా టీఆర్ఎస్పై మీరు గట్టిగా మాట్లాడరు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక చర్యలను, వైఫ ల్యాల గురించి మాట్లాడకుంటే ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి ఏ సంకేతాలు వెళ్తాయి?’’ అంటూ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానా రెడ్డిని పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు నిలదీసినట్టు తెలిసింది. సీఎల్పీ నేతే మెతక వైఖరితో ఉంటే పార్టీకి నష్టమని వారు అభిప్రాయపడ్డారు. ‘‘శాసనసభాపక్ష నేతగా మీరు గతంలో ఉన్నట్టుగానే ఇప్పుడూ మెతకగా మాట్లాడితే ప్రయోజనం లేదు. టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోకుంటే ప్రజ ల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి’’ అని కరా ఖండిగా చెప్పినట్టు తెలిసింది. శుక్రవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభ మవుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ శాసనసభాపక్షం గురువారం అసెం బ్లీ హాలులో సమావేశమైంది. పార్టీ ఫిరా యింపులు, రైతులకు పంటరుణాల మాఫీ టీఆర్ఎస్ అవినీతి, గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌పై సిట్ విచారణ, హామీల అమ లులో వైఫల్యం వంటి కీలకమైన అంశాల్లో దూకుడుగా వ్యవహరించాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఏకపక్షంగా సభను నడుపుకుందని, మాట్లాడటంలో కాంగ్రెస్ విఫలమైందనే ప్రచారం మంచిది కాదని జీవన్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పొంగు లేటి సుధాకర్‌రెడ్డి తదితరులు అభిప్రాయ పడినట్టు సమాచారం. జానారెడ్డి బదులిస్తూ, ‘సభ్యులు ఎవరైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడతామంటే నేను వద్దన్నానా’ అని అన్నారని తెలిసింది. దాంతో, ‘మేం మాట్లా డదామంటే మాకు మైక్ ఇవ్వరు. ఇచ్చినా అసలు విషయం ప్రస్తావించగానే మైక్ కట్ చేస్తారు. మీకు మైక్ ఇచ్చినా మీరేమో మాట్లా డరు. ఇలాగైతే ఎలా?’ అంటూ పలువురు సభ్యులు నిలదీసినట్టు తెలిసింది. వీలైనంత మంది సభ్యులకు మైక్ ఇవ్వాలని అడుగు తానని జానా బదులిచ్చినట్టు సమాచారం. ‘నయీం’పై పట్టుబడదాం గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ ఉదంతంపై సిట్ విచారణ జరిగిన తీరుపై సభలో గట్టిగా మాట్లాడాలని పలువురు సభ్యులు జానాకు సూచించారు. నయీం దగ్గర భారీగా దొరికిన నగదు డంప్, డైరీ ఏమయ్యాయో అడగాలని, డైరీని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయాలని కోరారు. నయీంతో సంబంధా లున్న అధికార టీఆర్ఎస్ నేతల పేర్లు ఎందుకు బయటకు రావడం లేదని, వారి నెందుకు అరెస్టు చేయడం లేదని కూడా టీఆర్ఎస్ను సభలో నిలదీయాలని అన్నారు. టీఆర్ఎస్ నేతల ప్రమేయం వల్లే నయీం కేసును బలహీనం చేశారని, దీనిని సభలోనే నిలదీయాలని నిర్ణయించారు. సాగు ప్రాజె క్టులు, మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగిందని, వాటి టెండరు డాక్యుమెంట్లను సభలో పెట్టాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. దీనితోపాటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే అంశంపై చర్చ జరిగింది. అప్పుడు ఫిరాయింపులపై కూడా స్పష్టత వస్తుందని కొందరు సూచించారు. సభ్యుల సంఖ్యను బట్టి సభలో మాట్లాడే సమయం వస్తుందని, టీఆర్‌ఎస్‌కన్నా తక్కువ సభ్యుల సంఖ్య ఉండటం వల్ల కాంగ్రెస్ వాదనకు సమయం దొరకదని, కాబట్టి అవి శ్వాసం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదేమో నని జానా అభిప్రాయపడ్డారు. అయితే సభ ప్రారంభమైన రెండుమూడు రోజుల తర్వాత, ప్రభుత్వం సభను నిర్వహించే తీరును చూసి అవిశ్వాసంపై నిర్ణయం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చ జరిగేదాకా సమావేశాలను నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ఎన్ని రోజులన్న దానితో సంబంధం లేకుండా అన్ని అంశాలపై సమగ్ర చర్చ కోసం పట్టుబట్టాలని నిర్ణయించారు. సీఎల్పీ భేటీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. సమస్యలపై నిలదీద్దాం: భట్టి సీఎం కేసీఆర్‌కు మాటలతో కాలం వెళ్ల దీయడం అలవాటని భట్టి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఆయన ప్రజాస్వామ్యవాది ఎలా అవుతారని ప్రశ్నిం చారు. సీఎల్పీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వకుంటే, తప్పించుకునే ప్రయత్నం చేస్తేనే వెల్‌లోకి పోతాం. వెల్‌లోకి పోతే సస్పెండ్ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి కి విరుద్ధం’’ అంటూ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలులో మోసాన్ని సభలో ఎండగడతామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు. ‘‘ప్రజా సమస్యలను ప్రస్తావించడమే అరాచకమంటే ఎలా? ప్రజా సమస్యలే మా ప్రధాన ఎజెండా. వాటిపై సభలోనే చర్చించి, పరిష్కారానికి పట్టుబడతాం. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, ఉద్యోగుల పీఆర్సీ వంటివాటిపై నిలదీస్తాం. ఇందుకోసం అవసరమైతే సభలో అన్ని పార్టీలతో సమ న్వయం చేసుకుంటాం. సభలో చర్చ జరిగే తీరును బట్టి అవిశ్వాసంపై ఆలోచిస్తాం’’ అని భట్టి స్పష్టం చేశారు. -
ప్రజల కలలు కల్లలయ్యాయి
► టీఆర్ఎస్ హామీలతో ప్రజలు కలలు కన్నారు ► కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి సాక్షి, నిజామాబాద్: ‘‘ఎన్నికల సమయం లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటలతో ప్రజలు కలలు కన్నారు. డబుల్బెడ్రూం ఇళ్లలో పడుకున్నట్లు.. మూడెకరాల భూమిలో దున్నుకున్నట్లు.. రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినట్లు.. కేసీఆర్ మాటలు నమ్మి ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఆ కలలు కల్లలై ఇప్పుడు అనుభవిస్తున్నారు’’ అని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు.నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్వంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 4 రోజులుగా చేస్తున్న పాదయాత్ర ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా బోధన్‌లో జరిగిన సభలో జానారెడ్డి ప్రసంగించారు. షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని శాసనసభ, మండలిలో ప్రభుత్వంపై ఒత్తిడి పెం చుతామన్నారు. 2019లో తాము అధికారంలోకి వచ్చాక ఎన్డీఎస్ఎల్తోపాటు, సిర్పూర్ పేపర్ మిల్లు, వరంగల్ రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపించి రైతులు, కార్మికులను ఆదుకుంటామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్న కేసీఆర్ రైతుల రుణమాఫీకి రూ.6వేల కోట్లను ఏకకాలంలో బ్యాంకులకు విడుదల చేసి, 37 లక్షల మంది రైతుల పాస్‌బుక్కులు, బంగారు నగలను విడిపించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్డీఎస్ఎల్ను పున రుద్ధిస్తామన్న కేసీఆర్.. రెండేళ్లయినా చేయలేకపోవడానికి కారణం నిధుల కొరతా.. చెరుకు రైతులు, కార్మికులపై నిర్లక్ష్య వైఖరా చెప్పాలన్నారు. పోచారం పనితీరు బాగాలేదని తన సర్వేల ద్వారా కేసీఆర్ తేల్చారని, దీంతో ఆయన పదవి ఊడటం ఖాయమైనందున పదవి నుంచి తప్పుకోవాలని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్డీఎస్ఎల్ను సగం అమ్మితే, టీఆర్ఎస్ సర్కారు దాన్ని పూర్తిగా అమ్మేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ.. టీడీపీ బీ టీం అన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రాబందుల పార్టీగా తయారైందని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శిం చారు. ఎన్డీఎస్ఎల్లో చెరుకు క్రషింగ్ ప్రారంభించకపోతే, టీఆర్ఎస్ ఎన్నికల హెలికాప్టర్ క్రాష్ అవడం ఖాయమని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సభలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, నేతలు సునీతాలక్ష్మారెడ్డి, ఈరవత్రి అనిల్, జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బీన్ తదిత రులు పాల్గొన్నారు. -
నేనెట్ల కోవర్టునయిత?: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తనను కోవర్టుగా పార్టీ నాయకులే కొందరు అభివర్ణిస్తున్నారని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలు కె.జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎం.కోదండరెడ్డి తదితరులు సమావేశమయ్యారు. రుణ మాఫీపై రైతుల నుంచి దరఖాస్తు చేయించడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులతో దరఖాస్తు చేయించాలని టీపీసీసీ తీసుకున్న ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. నెలరోజుల పాటు గ్రామాల్లో రైతుల నుంచి, విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, దీనికి ప్రస్తుత జిల్లాల వారీగా బాధ్యులుగా ముఖ్యనేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి, టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టడంపై పార్టీ ముఖ్యులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తి వెలిబుచ్చినట్లుగా తెలిసింది. ఇదే సందర్భంలో జానారెడ్డి మాట్లాడుతూ.. తనపై కొందరు పార్టీ నేతలే అనుచితంగా మాట్లాడుతున్నారని, కోవర్టునంటూ తననుద్దేశించి మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. కోవర్టంటూ తాను మాట్లాడలేదని వి.హనుమంతరావు సమాధానం ఇవ్వడంతో ఈ చర్చ సద్దుమణిగింది. రేవంత్ విమర్శల గురించి కాంగ్రెస్‌పార్టీ ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని ఈ సమావేశంలో అభిప్రాయపడినట్టుగా సమాచారం. -
జానా, షబ్బీర్లతో బ్రిటిష్ హైకమిషనర్ భేటీ
♦ రాష్ట్ర ఏర్పాటు, అనంతర పరిణామాలపై చర్చ ♦ రాజకీయ అవసరాల కోసం జిల్లాలు వద్దు: జానా సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీలతో బ్రిటిష్ హైకమిషనర్ సర్ డొమినిక్ యాష్‌క్విత్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బుధవారం అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, వంశీ చంద్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, ప్రజల కోరికకు కారణాలు, రాష్ట్ర ఏర్పాటు అనంతర పరిణామాలపై చర్చ జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడం వల్లే రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని బ్రిటిష్ ప్రతినిధులకు జానా, షబ్బీర్ వివరించారు. భేటీ అనంతరం వివరాలను జానారెడ్డి మీడియాకు వెల్లడించారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో కొనసాగడంపై ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. బ్రిటన్ ఈయూలో ఉండాలా వద్దా అని బ్రిటిష్ ప్రతినిధులు తమను అడిగారని, ఈయూ లో ఉండాలని తాము చెప్పామన్నారు. ఇక కాంగ్రెస్‌లో అంతర్గతంగా జరిగే యువజన కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియను బ్రిటిష్ ప్రతినిధులు ఆసక్తిగా తెలుసుకున్నారని చెప్పారు. బ్రిటిష్ వారు తమను సలహా అడిగారని.. కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని జానారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాలు ఏర్పాటు చేస్తే మంచిదని, రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. జిల్లాల ఏర్పాటులో ప్రజల సెంటిమెంటు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. యాదగిరిగుట్టను జిల్లాగా చేయాలని కోరారు. బయ్యారం గనుల కోసమే ప్రతిపాదిత మహబూబాబాద్ జిల్లాలో బయ్యా రం, గార్ల మండలాలను కలిపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో గెలిపిస్తే ఇస్తాంబుల్ చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని అడిగారు. న్యాయవాదుల అరెస్టు సరికాదు: పొన్నం న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితాను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న న్యాయవాదులను అరెస్టు చేయడాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో ఖండించారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన న్యాయవాదులను అరెస్టు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సిగ్గుచేటని విమర్శించారు. న్యాయవాదులు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మిక సంఘాలను అణచివేస్తే కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుం దని హెచ్చరించారు. -
భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణానా?
♦ టీఆర్ఎస్ ప్రభుత్వంపై జానా ధ్వజం ♦ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై కేసీఆర్‌కు కృతజ్ఞత లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలు జుగుప్సాకరంగా, అత్యంత హేయంగా ఉన్నాయని సీఎల్పీ నేత కె.జానారెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని... తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపట్ల కేసీఆర్‌కు కనీస కృతజ్ఞతలేదని దుయ్యబట్టారు. భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణ తెస్తారా అని నిలదీశారు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఫిరాయింపులు అత్యంత హేయమైనవని విమర్శించారు. బంగారు తెలంగాణ కోసం తాము టీఆర్ఎస్లో చేరుతున్నామంటూ పార్టీ ఎంపీ గుత్తాతోపాటు ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్‌లు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి జానా విలేకరులతో మాట్లాడారు. అప్రజాస్వామ్యరీతిలో స్వార్థ ప్రయోజనాల కోసం నేతలు పార్టీలు మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారాలనుకునేవారు తమ పదవులకు రాజీనామా చేసి మరో పార్టీలోకి వెళ్లాలని జానా డిమాండ్ చేశారు. రాజకీయ విలువలేవీ... సామాజిక న్యాయం, ప్రజలు, ఉద్యోగుల కోసం కొత్త రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాలు ఉంటాయని తాను ఆశించానని..కానీ ఇప్పుడున్న రాజకీయాలు భ్రష్టుపట్టిపోయి, జుగుప్సాకరంగా ఉన్నాయని జానా విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి అన్యాయం చేస్తూ కాంగ్రెస్‌ను అడుగడుగునా కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రలోభాలకు గురిచేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శించా రు. ఫిరాయింపుల విషయంలో దేశంలోనే టీఆర్ఎస్ అప్రతిష్టను తెచ్చుకుందన్నారు. ఈ విషయంలో చట్టప్రకారం, న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు. అనైతిక ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేయడానికి ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని జానా కోరారు. సామాన్య కార్యకర్తగా పనిచేస్తా... సీఎల్పీ నాయకత్వం సహా పదవులన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని జానా తెలిపారు. పదవులను వదులుకు నే విషయాన్ని సోనియాకు తెలియజేసి ఆ తరువాత ముం దుకు నడుస్తానన్నారు. పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదని, తొలి నుంచీ నీతివంతమైన రాజకీయాల కోసమే పనిచేస్తూ వస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీఎం పదవిని కూడా వద్దనుకున్నట్లు జానా చెప్పారు. వయసు మీదపడినా పార్టీ కోసం పనిచేస్తున్నానని, పదవుల కోసం కాకుండా పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానన్నారు. భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని, నీతివంతమైన రాజకీయాలతోనే బంగారు తెలంగాణ వస్తుందన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తనకు ఆత్మబంధువు కాదని, ఆత్మయితే కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లేవాడే కాదని జానా స్పష్టం చేశారు. గుత్తాలో వచ్చిన మార్పేమిటో.. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని అభివృద్ధి నిరోధకుడని అసెంబ్లీ సాక్షిగా విమర్శించిన సీఎం కేసీఆర్... ఇంతలోనే ఆయనలో వచ్చిన మార్పు ఏమిటో ప్రజలకు చెప్పాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గుత్తా మిషన్ భగీరథకు అడ్డుపడుతున్నారని కేసీఆర్ అసెంబ్లీలోనే ఆరోపించారని గుర్తుచేశారు. ఇప్పటిదాకా తెలంగాణ ద్రోహి, అభివృద్ధి నిరోధకుడైన గుత్తా ఇప్పుడు అభివృద్ధి కాముకుడెలా అయ్యాడని ప్రశ్నించారు. సీఎల్పీ పదవి నుంచి జానా వైదొలగాల్సిన అవసరం లేదన్నారు. కష్టకాలంలో ఉన్న పార్టీ అభివృద్ధి కోసం అందరం కష్టపడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
మిగిలింది నలుగురే!
♦ టీఆర్ఎస్ ‘ఆపరేషన్ నల్లగొండ’ సక్సెస్ ♦ మండలి డిప్యూటీ చైర్మన్ నుంచి నల్లగొండ ఎంపీ దాకా ♦ కీలక నేతలంతా టీఆర్ఎస్లోకి... సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉన్న నల్లగొండలో ఆ పార్టీని టీఆర్ఎస్ దాదాపు ఖాళీ చేసేసింది. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుని వారి కంచు కోటను బద్దలు కొట్టింది. ఇప్పుడు నల్లగొండ కాంగ్రెస్‌లో మిగిలింది నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీయే. కాంగ్రెస్ శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమ ణి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇందులోనూ నలుగురు నేతలు రెండు కుటుంబాలకు చెందిన వారే. వీరు మినహా అక్కడక్కడా ఒకరిద్దరు నేతలు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్‌లో మిగిలారంటే నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ఎంత పకడ్బందీగా వ్యూహాన్ని అమలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ జిల్లాలో 8మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లతో టీఆర్ఎస్ బలీయంగా మారింది. ఒకరి వెనుక మరొకరు.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ నల్లగొండ జిల్లాలో చాప కింద నీరులా సాగింది. కాంగ్రెస్ కంచుకోటగా గుర్తింపు పొందిన ఈ జిల్లాను టీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా టార్గెట్ చేశారు. తొలుత అప్పటికే శాసనమండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ టీఆర్ఎస్లో చేరారు. తర్వాత ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ‘ఆకర్ష్’ ఊపందుకున్నది మాత్రం జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్తోనే. ఆయన అనూహ్యంగా అధికార పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్‌కు షాకిచ్చారు. ఆయనతో పాటు పలువురు జెడ్పీటీసీలు, దేవరకొండ నియోజకవర్గ నేతలు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహ కార పరపతి సంఘం, మదర్ డెయిరీ చైర్మన్లు వలస బాట పట్టారు. అదే సమయంలో ఒక్కొక్కరుగా మున్సిపల్ చైర్మన్లు కూడా చేరారు. మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సమయంలోనే మంత్రి జగదీశ్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని సూర్యాపేట మున్సిపాలిటీలో చక్రం తిప్పారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కౌన్సెలర్‌ను టీఆర్ఎస్లో చేర్చుకుని మున్సిపల్ చైర్మన్ చేశారు. తర్వాత దేవరకొండ, భువనగిరి, హుజూర్నగర్, కోదాడ, నల్లగొండ మున్సిపల్ చైర్మన్లు కూడా గులాబీ గూటికి చేరారు. వారంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. చివరికి కాంగ్రెస్‌కు మిగిలింద ల్లా ఒక్క మిర్యాలగూడ మున్సిపల్ చైర్‌పర్సనే. ఆమె కూడా పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగినా ఆచరణలోనికి రాలేదు. వీరేగాకుండా వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సెలర్లు, జెడ్పీటీసీలు, గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు వందల సంఖ్యలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఓ ఎంపీ, ఒక ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారు. ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, అక్కడక్కడా నియోజకవర్గాల ఇన్చార్జులు, 10 మంది వరకు జెడ్పీటీసీలే కాంగ్రెస్‌కు మిగిలారు. జానారెడ్డికీ ఎఫెక్ట్! నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా, రాష్ట్రంలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన సీఎల్పీ నేత జానారెడ్డికి కూడా అధికార పార్టీ ఎఫెక్ట్ తప్పలేదు. గత డిసెంబర్లో జరిగిన నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన అనుంగు అనుచరులుగా గుర్తింపు పొందిన నేతలు కూడా టీఆర్ఎస్లో చేరారు. జానారెడ్డి ఆత్మబంధువుగా పేరున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా తాజాగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. జానారెడ్డి మాత్రమే కాదు ఉత్తమ్, కోమటిరెడ్డి, పద్మావతిలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల పరిధిలోనూ పెద్ద ఎత్తున కేడర్ గులాబీ పార్టీ బాట పట్టడం గమనార్హం. -
'పార్టీ కష్టకాలంలో ఉంది'
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యాలు సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదంతోనే పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ నియమితులయ్యారని గుర్తు చేశారు. ఉత్తమ్ నియామకాన్ని తప్పుబట్టడమంటే హైకమాండ్ ను వేలెత్తిచూపడమేనని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉందని, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని హితవు పలికారు. టీపీసీసీకి సారథిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపిక వరస్ట్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉత్తమ్ పై బహిరంగంగా విమర్శలు చేసినందుకు పీసీసీ క్రమశిక్షణా సంఘం ఆదివారం కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. -
ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత అధికార పార్టీదే
సీఎల్పీ నేత జానారెడ్డి సాక్షి, హైదరాబాద్: త్యాగా లు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజ ల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీదేనని సీఎల్పీ నేత కె. జానారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. రాష్ట్ర ప్రజల ఆందోళన, ఆకాంక్షలను గమనించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. చారిత్రాకమైన సోనియా నిర్ణయాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని జానా పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాల్లో అవకాశాల పెంపు, సాగు నీరు, వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి మొదలైనవి సాధించడం ద్వారా సమతౌల్యతతో కూడిన రాష్ట్రాభివృద్ధి జరగాలని జానా ఆకాం క్షించారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన వారికి అభినందనలు తెలిపిన జానా... అమరవీరులకు శ్రద్ధాంజలి తెలిపారు. -
జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే అధికార పార్టీలో చేరతారని సొంత పార్టీ శ్రేణులే కామెంట్లు చేస్తుండటంపై సీఎల్పీ నేత జనారెడ్డి ఘాటుగా స్పందించారు. తాను టీఆర్ఎస్ లోకి వెళుతున్నాననే వార్తలు పీసీసీ ఆఫీస్ బేరర్లే రాయించారని మండిపడ్డారు. తనపై నమ్మకం లేకుంటే సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటానన్నారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన సీఎల్పీ భేటీలో జానారెడ్డి ప్రసంగం.. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను కలవరపాటుకు గురిచేసింది. 'పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే సీఎల్పీ నేతగా నేను వెంటనే ఖండిస్తా. అలాంటిది చాలా రోజులుగా నాపై సాగుతోన్న దుష్ప్రచారాన్ని ఎవ్వరూ ఖండించలేదు. నేను టీఆర్ఎస్ లో చేరుతానంటూ వచ్చిన వార్తలను ఉత్తమ్ కుమార్ ఖండించి ఉండాల్సింది. నిజానికి పీసీసీ ఆఫీస్ బేరర్లే ఆ వార్తలు రాయించారు. నా నాయకత్వంపై నమ్మకం లేకుంటే చెప్పండి.. సీఎల్పీ పదవి నుంచి తక్షణమే తప్పుకుంటా' అని జానారెడ్డి ఎమ్మెల్యేలతో అన్నారు. ఒక్కసారిగా సీఎల్పీ నేత అలా మాట్లాడటంతో విస్తుపోయిన ఎమ్మెల్యేలు.. క్షణాలపాటు బిత్తరపోయి, వెంటనే తేరుకున్నారు. 'మీరే మా నాయకుడిగా ఉండాలి' అని మూకుమ్మడిగా జనారెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత సాగునీటి ప్రాజెక్టులపై ఇవ్వాలనుకున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆలస్యం అవుతుండటంపై సీఎల్పీ చర్చించింది. వీలైనంత తొందరగా ప్రెజెంటేషన్ కు ఏర్పాట్లు పూర్తిచేయాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సమావేశానికి హాజరైనవారిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి, పద్మావతి, జీవన్ రెడ్డి, భాస్కర్ రావు, సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు. -
వినాశకాలే విపరీత బుద్ధి
చేరేవారు.. చేర్చుకొనేవారికి గుణపాఠం తప్పదు: జానా, షబ్బీర్ సాక్షి, హైదరాబాద్: వినాశకాలే విపరీత బుద్ధి అని, రాష్ట్రంలో జరుగుతున్న ఫిరాయింపులు వారి వినాశకానికి నాంది అవుతాయని శాసనసభ, శాసనమండలిలో ప్రతిపక్షనాయకులు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ హెచ్చరించారు. హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో వారు మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో రాజకీయాలు, అనైతిక ఫిరాయింపులు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా ప్రభుత్వం పనిచేయడం లేదన్నారు. ‘ప్రజాస్వామిక, నైతిక విలువలు పడిపోయాయి. పార్టీ ఫిరాయింపు లు బాధాకరం. స్వప్రయోజనాలు, వ్యాపార అవసరాల కోసం పార్టీ మారుతూ రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయాలి. ఇది వారి నైతికత, రాజకీయ విలువలకు సంబంధించిన అంశం. ప్రభుత్వానికి అభివృద్ధిలో సహకరిస్తున్నాం. అయినా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రలు చేయడం సీఎం కేసీఆర్‌కు తగదు. ఈ అనైతిక, అప్రజాస్వామిక రాజకీయాలపై ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వివరిస్తాం’ అని జానారెడ్డి అన్నారు. ఫిరాయింపులపై ఉత్తరాఖండ్ న్యాయస్థానం జోక్యంతో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని, వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్, శాసనమండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని జానారెడ్డి, షబ్బీర్ అలీ చెప్పారు. ఇలాంటి తీరుపై తుపానులాగా ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్‌కు రాజకీయాలే ముఖ్యం... కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కరువు పరిస్థితుల నుంచి ప్రజలను ఆదుకోవాలని జానా, షబ్బీర్ అలీ అన్నారు. కరువు, ఎండలతో ప్రజలు ఓ పక్క చనిపోతున్నా, వలసలు పోతున్నా... రాజకీయాలు తప్ప వారిని కాపాడుకోవాలనే యోచన సీఎంగా కేసీఆర్‌కు లేకపోవడం బాధాకరమన్నారు. పార్టీలో చేరికలు, ఫిరాయింపులు, ప్లీనరీలంటూ రాజకీయాలు తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. పదవులకు రాజీనామాలు చేయించకుండా ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను బెదిరించి, ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకుంటూ రాజకీయ పునరేకీకరణ అనడం కేసీఆర్ స్థాయికి తగదన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, నైతిక విలువలతో వ్యవహరించాలని సూచించారు. -
ఫిరాయింపులపై ప్రధానికి ఫిర్యాదు : జానా
పార్టీలు మారేవారు రాజీనామా చేసి గెలవాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పార్టీ ఫిరాయింపులు భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి హెచ్చరించారు. ఈ ఫిరాయింపులపై వెంటనే చర్యలు తీసుకునేలా, అనర్హత చట్టంలో అవసరమైన మార్పుచేర్పులు చేసేలా చూసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కలిసి కోరుతానని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీ తదితరులతో కలిసి గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయాలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పార్టీని వీడి అధికార టీఆర్ఎస్లో చేరడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో నైతిక విలువలు పూర్తిగా నశించాయని విమర్శించారు. ‘‘పార్టీ మారేవారు, వారిని చేర్చుకునేవారు చేస్తున్న రాజకీయాలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి. పార్టీ మారాలనుకున్నప్పుడు, ఆ పార్టీ వల్ల వచ్చిన పదవులకు రాజీనామా చేయాలి. తాము చేరిన పార్టీ నుంచి మళ్లీ పోటీ చేసి గెలవాలి’’ అని సవాలు విసిరారు. తాను కూడా పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి గెలిచానని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్టీలు ఫిరాయిస్తున్నవారు ఎలాంటి నైతిక విలువలూ పాటించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. ‘‘నూతన రాజకీయాలకు అంకురార్పణ చేయాల్సిన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి అసహ్యకర రాజకీయాలు జరగడం దురదృష్టకరం. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం అంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి ఫిరాయింపులతో కాంగ్రెస్‌కు జరిగే నష్టమేమీ లేదు. గతంలో రెండు లోక్‌సభ స్థానాలతో చిన్న పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు కేంద్రంలో స్పష్టమైన మెజారిటీతో అధికారంలో ఉంది. తమిళనాడులో జయలలితా అంతే. పదవులు, అధికారం శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నవారు అడ్రస్ లేకుండా పోవడం, విపక్షంలో ఉన్నవారు అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యంలో సహజం. అధికారంలో ఉన్నప్పుడు హుందాగా, ప్రజాస్వామికంగా వ్యవహరించామా లేదా అన్నది ముఖ్యం’’ అన్నారు. కొత్తగా కోటి ఎకరాలెలా తెస్తారు? సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో గొప్ప, కొత్త విషయాలేమీ లేవని జానా పెదవి విరిచారు. కోటి ఎకరాలకు నీరిస్తామంటున్న కేసీఆర్, అసలు కొత్తగా కోటి ఎకరాలు ఎక్కడినుంచి తెస్తారని ప్రశ్నించారు. ‘‘ప్రజెంటేషన్ అంటే కంప్యూటర్లు, మ్యాపులు పెట్టే ఇవ్వాల్సిన అవసరం లేదు.సీఎం కంటే బ్రహ్మాండంగా, ప్రజలకు అర్థమయ్యేలా కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్థితులను వివరిస్తుంది. కొన్ని ప్రాజెక్టులను రీ డిజైన్ చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. వాటిలోని సాంకేతిక మంచి చెడులపై నిపుణులతో లోతుగా చర్చిస్తున్నాం. నిజానికి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో, అహంకారంతో విర్రవీగుతోంది. ప్రభుత్వం చెబుతున్నట్టు నిజంగానే కోటి ఎకరాలకు నీరు పారిస్తే మేం కొట్టుకుపోతాం. నీరు పారకపోతే ఆ బూటకపు ప్రచారంలో టీఆర్ఎస్ కొట్టుకుపోతుంది’’ అని అన్నారు. -
ప్రభుత్వ అసమర్థత వల్లే ఆత్మహత్యలు
భువనగిరి: రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కాంగ్రెస్ శాసనసభపక్ష నేత కె.జానారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా ఆలేరు మండల కేంద్రంలో శుక్రవారం రైతుభరోసా యాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానా మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని, ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి నేడు విస్మరించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ లోపభూయిష్టంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలనే నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం పేర్లు మార్చి అమలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే రైతుభరోసా యాత్ర చేపట్టామని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అవగాహన లేని అసమర్థ, అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు. రైతు రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయడానికి రూ.8,500 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని మండిపడ్డారు. ఫాంహౌస్‌లో నిద్రించే ముఖ్యమంత్రికి సమీప గ్రామాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించకపోవడం బాధాకరమని శాసనమండలి నేత షబ్బీర్ఆలీ అన్నారు. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, మాజీ ఎంపీలు ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీగౌడ్, వివేక్, బలరాంనాయక్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, అద్దంకి దయాకర్, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ తదితరులు ఉన్నారు. పర్యటన సాగిందిలా: నల్లగొండ జిల్లాలో రైతు భరోసా యాత్ర బీబీనగర్ నిమ్స్ నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకబస్సులో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ నేతలంతా వచ్చారు. వారికి భువనగిరి మండలం రాయగిరి వద్ద డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆధ్యర్యంలో స్వాగతం పలికారు. ఆత్మకూర్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు పొన్నగాని సంతోష్‌కుమార్ భార్య వాణికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అక్కడే రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అక్కడి నుంచి ఆలేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వైఎస్ హయాంలో బాగుండేది కోరే బీరయ్య ఆత్మకూరు(ఎం): నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. రైతు కోరె బీరయ్యకు పీసీసీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది ఉత్తమ్: ఎన్నెకరాల్లో వ్యవసాయం సాగు చేశావు. బీరయ్య: ఐదు ఎకరాలు ఉంది. అందులో పత్తి, వరి పంటలు వేశాను. ఉత్తమ్ : దిగుబడి ఎలా ఉంది. బీరయ్య: దిగుబడి మామూలుగానే ఉంది. ఉత్తమ్ : మద్దతు ధర ఎలా ఉంది. బీరయ్య: మద్దతు ధర మామూలుగానే ఉంది. వరికి ధర రూ.1,300లకు తీసుకుంటున్నారు. పత్తి రూ.3,500 అడుగుతున్నారు. ఇంతవరకు పత్తి గుర్తింపుకార్డులు ఇవ్వలేదు. ఉత్తమ్ : వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది. బీరయ్య: అధ్వానంగా ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందినవి. ఇప్పుడు రుణమాఫీని మూడుసార్లు ఇస్తామనడంతో ఇబ్బందులు పడుతున్నాం. -
'రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రోత్సహిస్తా?'
-
రెండో ప్రాధాన్యత ఓటు అనవసరం
ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎల్పీ సమావేశంలో నిర్ణయం ఉత్తమ్, జానాకు బాధ్యతల అప్పగింత ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏం చేయాలన్న దానిపై చర్చ హైదరాబాద్: శాసనసభ్యుల కోటా నుంచి శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకునే బాధ్యతను టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డికి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. ఈ అంశంపై చర్చించడానికి మంగళవారం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ ఆర్.సి.కుంతియా సమక్షంలో ఈ సమావేశం జరిగింది. రెండో ప్రాధాన్యతా ఓటు, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీసుకోవాల్సిన చర్యలు, ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి వంటి వాటిపై చర్చ జరిగింది. రెండో ప్రాధాన్యతా ఓటును వేద్దామా, వద్దా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సభ్యుల బలంతో మొదటి ప్రాధాన్యతా ఓటుతోనే గెలుస్తామని, రెండో ప్రాధాన్యతా ఓటును వేయాల్సిన అవసరం లేదని సీనియర్లు అభిప్రాయపడినట్టుగా సమాచారం. రాష్ట్రంలో అధికారపార్టీ టీఆర్ఎస్ను ఓడించాలని, కేంద్రంలో ప్రత్యర్థి పార్టీగా ఉన్న బీజేపీతో జతకట్టిన టీడీపీతోనూ అంతే దూరం పాటించాలని ఈ సమావేశంలో మాట్లాడిన సీని యర్లు గట్టిగా సూచించారు. రెండో ప్రాధాన్యత ఓటును వినియోగించుకోవాల్సిన అవసరమే లేదని స్థూలంగా నిర్ణయించారు. అలాగే ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు విప్‌ను జారీచేయొచ్చా, విప్ ఉల్లంఘిస్తే అనర్హతవేటుకు అవకాశముందా అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. దీనిపై నిపుణులతో చర్చించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల పూర్తి బాధ్యతను ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డికి ఈ సమావేశం అప్పగించింది. ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డిపై జరిగిన దాడిపైనా చర్చించి, గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. సమావేశానికి ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, పువ్వాడ అజయ్, జె.గీతారెడ్డి, వంశీచంద్ రెడ్డి హాజరు కాలేదు. అధికార పార్టీకి బుద్ధ్ది చెబుతాం : సంపత్ అధికార పార్టీకి బుద్ధి చెబుతామని కాంగ్రెస్ పార్టీ విప్ సంపత్‌కుమార్ అన్నారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి తమకు వ్యూహం ఉందన్నారు. ఎమ్మెల్యేల బలం లేకున్నా ఐదో అభ్యర్థిని బరిలోకి దించడం ద్వారా అధికార పార్టీయే అనైతిక కార్యకలాపాలకు దిగిందని విమర్శించారు. జూన్ 2న సోనియాకు కృతజ్ఞతా దినోత్సవం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రచారం: ఉత్తమ్ హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన జూన్ 2ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞతా దినోత్సవంగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాలను జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా, మండల స్థాయిల్లో పతాకావిష్కరణలు చేయాలని సూచించారు. రాష్ర్ట ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైన విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఫల్యాలపై జూన్ 3న హైదరాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్వహించిన పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
‘సమాధానాలు వచ్చేలా సహకరిస్తున్నాం’
హైదరాబాద్: సభ సజావుగా జరిగేలా, ప్రభుత్వం నుంచి సమాధానాలు వచ్చేలా తాము సహకరిస్తున్నామని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీలో వైద్య, విద్య, తదితర పద్దులపై చర్చ జరుగుతుండగా రాత్రి7.45 గంటల ప్రాంతం లో సభను బుధవారానికి వాయిదా వేయాలని ఆయన కోరారు. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ.. పద్దులపై చర్చను బుధవారం మధ్యాహ్నంలోగా పూర్తిచేసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత బిల్లులపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1.30 లోగా పద్దులపై చర్చ ముగిసేందుకు సహకరిస్తామంటే సభ వాయిదాకు అభ్యంతరం లేదని చెప్పారు. దీనిపై జానారెడ్డి మాట్లాడుతూ.. సమాధానాలు వచ్చేలా ప్రభుత్వమే కాదు విపక్షాలు కూడా సహకరిస్తున్నాయని చెప్పారు. దీనిపై హరీశ్ స్పందిస్తూ.. అందరి సహకారంతోనే సభ జరగాలని తమకు భేషజాలు లేవన్నారు. -
'ఊహాలోకంలో విహరించినట్టు ఉంది'
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ చదువుతుంటే ఊహాలోకంలో విహరించినట్టు ఉందని ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. 2015-16 సంవత్సరానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ఆచరణాత్మకంగా లేదన్నారు. ఈ బడ్జెట్ కు విశ్వసనీయత లేదన్నారు. శుక్రవారం శాసనసభలో బడ్జెట్ పై చర్చలో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్ ను పూర్తిగా అధ్యయనం చేసి ముందుకు సాగాల్సివుంటుందన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా బడ్జెట్ ఉండాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఆర్థి బడ్జెట్ ను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఈనెల 11న ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. -
టీపీసీసీపై నేడు ఉత్తర్వులు?
ఢిల్లీలోనే జానారెడ్డి, పొన్నాల సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు నాయకత్వ మార్పు ఖాయమైనా ఆదివారం రాత్రిదాకా ఏఐసీసీ నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీతో పాటు ఢిల్లీ, పంజాబ్ వంటి మరో ఆరు రాష్ట్రాలకు కలిపి మార్పులు చేస్తూ ఒకేసారి అధికారిక ప్రకటన వెలువడవచ్చునని సీనియర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి వంటి నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. పొన్నాలను అందుబాటులో ఉండాలంటూ అధిష్టానం సూచించింది. సీఎల్పీ నాయకుడిగా ఉన్న కె.జానారెడ్డి కూడా అధిష్టానం సూచనల మేరకు ఢిల్లీలోనే ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షునిగా మల్లు భట్టి విక్రమార్క పేర్లలో మార్పులేమీ ఉండవని పార్టీ ఉన్నతవర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ముఖ్యనేతలను ఏఐసీసీలోకి తీసుకోవడం, త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ పదవులివ్వనున్నట్టుగా తెలుస్తోంది. మార్పును వ్యతిరేకిస్తున్న సీనియర్లు టీపీసీసీ అధ్యక్షునిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యను తొలగించి, ఆ స్థానంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి నియామకాన్ని పార్టీలోని కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. బీసీలకు పార్టీలో స్థానం లేకుండా చేయడాన్ని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ వంటివారు వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. వి.హనుమంతరావు దీనిపై ఇప్పటికే పలువురు పార్టీ అధిష్టాన పెద్దలను కలిసి వ్యతిరేకతను తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ మార్పును, ఉత్తమ్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. -
రెండోపంటకు నీరివ్వాలి: జానా
ప్రజాసేవ మరిచి రాజకీయాలా అని ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగానికి రెండో పంటకు నీరివ్వాలని సీఎల్పీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం జానారెడ్డి మాట్లాడుతూ అయోమయంలో ఉన్న సాగర్ ఆయకట్టు రైతాంగానికి నీరిచ్చే విషయంలో వెంటనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలన్నారు. మొదటిపంటకు నీరిచ్చే విషయంలోనే ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని విమర్శించారు. రెండో పంటకు నీరిచ్చే విషయంలోనూ గతంలో చేసిన పొరపాట్లు చేయవద్దని జానా కోరారు. ప్రజలు, రైతుల సమస్యలను పట్టించుకోకుండా రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులకే ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. ప్రజా సేవను మరిచిపోయి రాజకీయాలకే పరిమితమైతే తగిన సమయంలో వారే బుద్ది చెప్తారని జానా రెడ్డి హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుని మార్పు ఉంటుందా అని విలేకరులు ప్రశ్నిస్తే అది తన స్థాయి కాదని, తనను అలాంటి ప్రశ్నలు అడగొద్దంటూ విలేకరులపై జానా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తున్నదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. సాగర్ రెండో పంటకు నీరిచ్చే విషయంలో ఇంకా జాప్యం చేస్తూ రైతాంగాన్ని అయోమయంలోకి నెడుతోందన్నారు. -
భ్రమలన్నీ తొలగిపోయాయి: టి. కాంగ్రెస్
హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కల్పించిన భ్రమల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఏడు నెలల పాలనలో మోదీ సర్కారు పలు అంశాల్లో యూటర్న్ తీసుకుందని విమర్శించారు. హామీలపై వెనక్కు తగ్గుతున్న వైనాన్ని ఎండగడతామన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పుస్తక ముద్రణ కాదు, ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని పొన్నాల తెలిపారు. ఎన్నికలకుముందు మోదీ చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పొంతన లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. మోదీ సర్కార్ కల్పించిన భ్రమలన్నీ తొలగిపోయాయని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంతో అధికారంలోకి వచ్చిన మోదీ ఇప్పుడు తమ పార్టీ బాటలోనే నడుస్తున్నారని మరో నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 'మోదీ యూ టర్న్' పుస్తకాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆవిష్కరించారు. -
ఫిరాయింపులు సిగ్గుచేటు: జానారెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య అని తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి దుయ్యబట్టారు. ఫిరాయింపుల అంశంలో స్పీకర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా ఫిరాయింపులను తాను ఖండించానని గుర్తుచేశారు. భవిష్యత్ లో కాంగ్రెస్ ఎటువంటి ఫిరాయింపులు ప్రోత్సహించదని చెప్పారు. పార్టీ ఫిరాయింపులు అసెంబ్లీ గౌరవానికి భంగకరమన్నారు. ఫిరాయింపుదారులపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. -
ప్రశ్నిస్తే దుర్మార్గులంటారా?: జానారెడ్డి
ప్రతిపక్షాన్ని తూలనాడటం కేసీఆర్ మానుకోవాలి సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను విస్మరించినందువల్లే తమను ప్రతిపక్షంలో కూర్చోపెట్టారని, ప్రస్తుతం ఆ సమస్యలను సరిచేయాలని అడిగితే దుర్మార్గులు, దుశ్శాసనులని తూలనాడతారా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిపక్షనేత కె.జానారెడ్డి ప్రశ్నించారు. దీనిపై సీఎం ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అధికార దర్పాన్ని పక్కన పెట్టి, గతంలో జరిగిన తప్పులను ప్రభుత్వం సరిచేయాలని, అది ధర్మమని పేర్కొన్నారు. లేదంటే తమను పక్కన పెట్టినట్లే టీఆర్ఎస్ను కూడా ప్రజలు పక్కన పెడతారన్నారు. సమస్యలపై అసూయ, ద్వేషంతో కాకుండా సామాజిక అభివృద్ధి కోణంలో చూడాలని, నిందలు వేయడం మంచిది కాదని హితవు పలికారు. సోమవారం విద్యుత్‌పై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అనంతరం జానా మాట్లాడారు. ‘గతంలో అనేకమార్లు ప్రభుత్వాలు మారాయి. రెండు సీట్లున్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నాలుగు వందల సీట్ల నుంచి కాంగ్రెస్ విపక్షంలోకి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో జరిగేదే. వాటిని గౌరవించాలి తప్పితే హేళన చేయరాదు’’ అన్నారు. విద్యుత్ సమస్యకు కాంగ్రెస్ కారణం కాదన్నారు. విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేం దుకు అధికార పక్షానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. విభజన చట్టం మేరకు ఏపీ సీఎం చంద్రబాబు విద్యుత్ వాటా ఇవ్వాల్సిందేనని, లేదంటే కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. విద్యుత్ వాటాలపై ప్రజల మధ్య విద్వేషాలు పెరగకముందే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు. రాష్ట్రాల మధ్య తగాదాలు తీర్చేందుకు అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయాలని, అఖిలపక్షంగా వెళ్లి ప్రధానిని కలవాలని డిమాండ్ చేశారు. మూడేళ్లలో 21 వేల మెగావాట్ల విద్యుత్ ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు చేయలేదని ఈ సమయంలో టీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నించారు. దాంతో జానారెడ్డి సీఎం కుర్చీని చూపిస్తూ... ‘నేనెందుకు అక్కడ లేనంటే ఏం చెబుతాం’ అని అన్నారు! విద్యుదుత్పత్తి, వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని, రాష్ట్రానికి వాటా దక్కేందుకు న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ బదులిచ్చారు. -
ఘనంగా రాజీవ్ సద్భావన యాత్ర
హైదరాబాద్ : మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ దేశ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు చార్మినార్ కట్టడం నుంచి సద్భావన యాత్ర చేపట్టి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని తెలంగాణ సీఎల్పీ నాయకులు కె.జానారెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం సందర్భంగా ఆదివారం సద్భావన యాత్ర కమిటీ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు-2014 ను ప్రముఖ కార్మిక నాయకుడు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా శాంతి భద్రతలు క్షీణించి హైదరాబాద్‌లో మతకలహాలు నెలకొనడంతో శాంతిని నెలకొల్పేందుకు రాజీవ్ ముందుకొచ్చారన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కోదండ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షులు దానం నాగేందర్ పాల్గొన్నారు. -
పేలవంగా టీపీసీసీ సభ్యత్వ నమోదు
పార్టీ ముఖ్యనేతలు గైర్హాజరు కసితో సభ్యత్వం చేయించాలని పొన్నాల పిలుపు హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం తొలిరోజు పేలవంగా సాగింది. గాంధీభవన్ ఆవరణలో శనివారం చేపట్టిన కార్యక్రమానికి సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీని వాస్సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు రాలేదు. కార్యకర్తలు, నాయకుల హాజరు శాతం కూడా పలుచగా ఉంది. వచ్చిన వారూ సభ్యత్వ నమోదుపట్ల అంతగా ఆసక్తి చూపలేదు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సభ్యత్వ నమోదును గంట సేపటికే ముగించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తొలి సభ్యత్వ రశీదును మాజీమంత్రి దానం నాగేందర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ గొప్ప చరిత్ర కలిగిన కాం గ్రెస్ పార్టీలో సభ్యుడిగా కొనసాగే అవకాశం దక్కడం తన జీవి తంలో మర్చిపోలేని అదృష్టమన్నారు. నాయకులంతా వాడవాడలా పర్యటించి కసిగా కాంగ్రెస్ సభ్యత్వాన్ని నమోదు చేయిం చాలని పిలుపునిచ్చారు. ఇంట్లో కూర్చుని సభ్యత్వ నమోదు పుస్తకాలను నింపితే పార్టీని మోసం చేసినట్లేనని, ఒక్క సంక్షిప్త సందేశమిస్తే పార్టీ కార్యక్రమానికి హాజరయ్యే వారికే సభ్యత్వం ఇవ్వాలని కోరారు. శాసనమండలిలో ఉపనేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, వంశీచంద్‌రెడ్డితోపాటు సీనియర్ నేతలు అంజన్‌కుమార్‌యాదవ్, బలరాం నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళకళలాడిన డీఎస్ నివాసం మండలి ప్రతిపక్షనేత డి. శ్రీనివాస్ నివాసం శనివారం కళకళలాడింది. డీఎస్ 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర కార్పొరేటర్లు, మాజీ మంత్రులు ఆయన నివాసానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఇష్టం లేనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరపాల్సిందేనని కార్యకర్తలు ఒత్తిడి తేవడంతో వారి మాటను కాదనలేకపోయానని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో బతుకమ్మ వేడుకలు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కోదాడ ఎమ్మెల్యే పద్మా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలితతోపాటు పలువురు మహిళా నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ ఆడారు. పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ సాంప్రదాయక నృత్యాలు చేశారు. -
'తెలంగాణలో ఉన్నవారంతా ఈ రాష్ట్ర పౌరులే'
ఇబ్రహీంపట్నం: ప్రతిపక్షపార్టీగా ప్రజాసమస్యలపై పోరాడతామని తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సులో రెండో రోజు ఆయన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణమాఫీ, దళితులకు భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య, పేదలకు ఇళ్లు వంటి టీఆర్ఎస్ హామీలను అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కరువు, విద్యుత్ కోతలు వంటి సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు, పంటనష్టం జరుగుతున్నా టీఆర్ఎస్ సర్కారుకు చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. తెలంగాణలో ఉన్నవారంతా ఈ రాష్ట్ర పౌరులేనని వారికి అన్ని హక్కులుంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం వివక్ష చూపితే వ్యతిరేకిస్తామని, బాధితులకు అండగా ఉంటామని హామీయిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ ప్రతీకార దాడులకు పాల్పడుతోందని, ఈ దాడులను ఎదుర్కొంటామని జానారెడ్డి అన్నారు. -
'ప్రతిపక్షంపై ఎదురుదాడి సరికాదు'
హైదరాబాద్: విపక్ష నాయకుడు కె.జానారెడ్డిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి జానారెడ్డి నిర్మాణాత్మక సూచనలు చేశారని చెప్పారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరారు. ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేత జానారెడ్డివన్నీ చిల్లర విమర్శలని, కాంగ్రెస్ పార్టీలో ఉనికికోసమే ఆయన సంకుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం విమర్శించారు. ఎవరికి చేతనవుతుందో ప్రజలకు తెలుసని, అందుకే కాంగ్రెస్‌ను గద్దె దింపి టీఆర్ఎస్కు అధికారాన్ని అప్పగించారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రస్తుత సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. -
'2 నెలల్లో 80మందికి పైగా ఆత్మహత్య'
హైదరాబాద్: రుణమాఫీపై రైతులు ఆందోళనలో ఉన్నారని తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. 2 నెలల్లో 80మందికి పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశంలో విద్యార్ధుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఓయూ విద్యార్ధులపై లాఠీచార్జ్ చేయడం బాధాకరమన్నారు. ఓయూ విద్యార్ధులపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిరంతర విద్యుత్ ఇస్తామన్న తెలంగాణ సర్కారు రోజుకు మూడు గంటలు కూడా విద్యుత్ ఇవ్వలేకపోతుందని విమర్శించారు. ఉద్యోగుల ఖాళీలను శాఖల వారీగా భర్తీ చేయాలని జానారెడ్డి సూచించారు. -
'పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం బాధాకరం'
పార్లమెంట్లో పోలవరం ఆర్డినెన్స్ ఆమోదం పోందటం బాధాకరమని తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జానారెడ్డి మాట్లాడుతూ... ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికత అంశంలో సెటిలర్లకు నష్టం జరగదని అన్నారు. పోలీసు భద్రత కల్పించైనా ఆర్డీఎస్కు మరమ్మతులను పూర్తి చేయాలని జానారెడ్డి ఏపీ సర్కార్‌కు హితవు పలికారు. పోలవరం ఆర్డినెన్స్ ఈ రోజు పార్లమెంట్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. -
నేనెప్పుడూ వెల్‌లోకి వెళ్లలేదు: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తన రాజకీయ జీవితంలో ఎన్నడూ శాసనసభ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలపలేదని శాసనసభలో ప్రతిపక్షనేత కె.జానారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు శాసనసభ సంప్రదాయాలు, మర్యాదలను పాటిస్తూ వచ్చానని పేర్కొన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలయ్యేలా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సభా మర్యాదలకు లోబడే ఆయా కార్యక్రమాలను చేపడతామని స్పష్టంచేశారు. శాసనసభ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, విపక్ష నేత చంద్రబాబు సభలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే వారని, మధ్యలో టీఆర్ఎస్ నేతలు వాళ్లిద్దరిపై విమర్శలు చేసేవారని ఆరోపించారు. తాము మాత్రం రాజకీయ విమర్శల జోలికి పోకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని జానారెడ్డి తెలిపారు. -
'కేసీఆర్ వెనక్కి తగ్గడంపై రైతుల్లో ఆందోళన'
హైదరాబాద్: రైతుల రుణమాఫీకి టీఆర్ఎస్ కట్టుబడి ఉండాలని తెలంగాణ సీఎల్పీ నేత కె జానారెడ్డి డిమాండ్ చేశారు. లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామన్న కేసీఆర్ ఇప్పుడు వెనక్కి తగ్గడంపై రైతుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేయడం, ఇచ్చిన మాటను తప్పడం విశ్వాసఘాతుకమేనని అన్నారు. ఒక ఏడాది పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న నిర్ణయాన్ని కేసీఆర్ సర్కార్ పునరాలోచించాలని సూచించారు. గతేడాది పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని నిన్న జరిగిన బ్యాంకర్ల సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చాయి. -
ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ నేతల డుమ్మా
హైదరాబాద్: కేసీఆర్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీనియర్ నాయకులు హాజరుకాలేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కె. జానారెడ్డి సహా పలువురు నేతలు ఈ కార్యక్రమానికి రాలేదు. టీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వక విలువలు పాటించలేదని కాంగ్రెస్ నేతల అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరి మాదిరిగానే కాంగ్రెస్ నాయకులకు ఆహ్వాన పత్రాలు అందాయి. అయితే ఫోన్‌చేసి పిలవడం సంప్రదాయమని సీనియర్ నేతలు అంటున్నారు. ఈ సంప్రదాయాన్ని పాటించనందువల్లే తాము కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. -
కాపలాకుక్కలా ఉంటానని కారుకూతలా?: జానారెడ్డి
గుర్రంపోడు, న్యూస్‌లైన్: తెలంగాణ ఇచ్చాక కాపలాకుక్కలా ఉంటానని అన్న కేసీఆర్ ఇప్పుడు మాటమార్చి రాజ్యాన్ని ఏలుతానని అంటున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో గురువారం పలు ప్రచారసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 1992 లో అసెంబ్లీలో తాను తెలంగాణ ఇవ్వకపోతే మరో ఉద్య మం వస్తుందని హెచ్చరించానని తెలిపారు. తెలంగాణ కోసం 1998లో తాను, 2000లో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియాకు వినతిపత్రాలు సమర్పిం చామని తెలిపారు. పార్లమెంట్లో సొంత పార్టీ నుంచి ప్రతిఘటన ఎదురైనా సాహసోపేతంగా సోనియా తెలంగాణ ఇచ్చార నీ, ఆమె రుణం తీర్చుకోవాలన్నారు. -
జానారెడ్డి ఆవేదన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని బలంగా నమ్మిన కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి తన ఆవేదనను అధిష్టానంతో పంచుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఉనికిని నిలబెట్టుకుంటూ వస్తే చివరకు తనకు అవమానమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే పీసీసీల కూర్పు వెనక అనివార్య పరిస్థితుల్లో సామాజిక సమీకరణలు చూడాల్సి వచ్చిందని, ఇది అవమానించడం కాదని దిగ్విజయ్ సర్దిచెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం దిగ్విజయ్‌సింగ్ జానారెడ్డిని సోనియాగాంధీ వద్దకు తీసుకెళ్లారు. బలహీనవర్గాలకు కేటాయించడం కారణంగా ఇవ్వలేకపోయామని, మంచి జరుగుతుందన్న నమ్మకంతో ముందుకు సాగుతూ పార్టీని విజయపథంలో నడిపించాలని సోనియా సూచించినట్టు సమాచారం. -
టీఆర్ఎస్తో పొత్తు వద్దు
* హైకమాండ్‌కు టీ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి * ఒంటరిగానే పోటీ చేసి మెజారిటీ సీట్లు సాధిస్తాం * హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే అది పార్టీకి తీవ్ర నష్టమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తేల్చారు. మారుతున్న సమీకరణాల్లో టీఆర్ఎస్కు ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక తీర్మానం చేసి దాన్ని హైకమాండ్ పెద్దలకు పంపించారు. టీఆర్ఎస్తో పొత్తు లేకుంటే అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవచ్చనే ధీమా వ్యక్తం చేశారు. తాజా మాజీమంత్రి కె.జానారెడ్డి నివాసంలో శనివారం సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ మేరకు తీర్మానం చేసి హైకమాండ్ పెద్దలకు పంపారు. కేంద్ర మంత్రి బలరాంనాయక్, తాజామాజీ మంత్రులు జె.గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, బసవరాజు సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఈరవత్రి అనిల్, ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కె.శ్రీధర్, మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, ప్రేంసాగర్‌రావు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఆర్ఎస్తో పొత్తు, స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, తెలంగాణలో ప్రజల సమస్యలు, విద్యుత్ కోత వంటి అంశాలపై చర్చించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70 వరకు అసెంబ్లీ స్థానాలను కోరుతున్నారని, పొత్తు ఖరారైతే కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని సమావేశంలో నేతలంతా అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణమే లేదని, దక్షిణ తెలంగాణలో ఆ పార్టీకి బలం కూడా లేదని అభిప్రాయపడ్డారు. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నందున టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదని, కాంగ్రెస్‌తో పొత్తు కోసం దిగిరాక తప్పదని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. ఒకరిద్దరు ఎంపీలు మాత్రం టీఆర్ఎస్ పొత్తుపెట్టుకుంటే తెలంగాణ వాదుల ఓట్లన్నీ గంపగుత్తగా ఇరు పార్టీలకు పడతాయని, లేనిపక్షంలో కొంత నష్టపోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒంటరిగా పోటీ చేయడంవల్ల కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని తిరిగి అధికారంలోకి రాగలదన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఓ లేఖను రూపొందించి హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలను సవాల్‌గా తీసుకుని వెంటనే సమాయత్తం కావాలని తీర్మానించారు. జిల్లాల వారీగా కమిటీలు వేసుకుని అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు వంటి కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంతోపాటు అత్యధిక ఎంపీ సీట్లను గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని తీర్మానించారు. కాగా, తెలంగాణ రాష్ట్రమిస్తే ఈ ప్రాంత ప్రజలంతా కాంగ్రెస్ వెంట ఉంటారని సోనియాగాంధీకి హామీ ఇచ్చామని జానారెడ్డి చెప్పారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. రెండు సీట్లున్న పార్టీ కూడా తెలంగాణ తామే తెచ్చామంటున్నారని పరోక్షంగా టీఆర్ఎస్ను ఎద్దేవా చేశారు. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఇటీవల అకాల వర్షాలతో మరణించిన వారి కుటుంబాలకు, పంటలు నష్టపోయిన రైతులందరికీ తక్షణమే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ సమన్వయకర్తగా జానా తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ సమన్వయకర్తగా జానారెడ్డిని నియమించుకున్నారు. టీఆర్ఎస్తో పొత్తుకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల తరపున హైకమాండ్‌తో సంప్రదింపులు జరపడంతోపాటు స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా జానారెడ్డిని ఎన్నుకున్నారు. శనివారం సమావేశమై ఆయన పేరును ఏకగ్రీవంగా తీర్మానించారు. జానారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ తెలంగాణ జిల్లాల డీసీసీ అధ్యక్షులు సోనియాగాంధీకి లేఖ రాశారు. ఒంటరి పోటీ మేలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలంతా టీఆర్ఎస్తో పొత్తు వద్దని, ఒంటరిగా పోటీ చేయాలని కోరుతున్నారని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రాములు యాదవ్ సహా 30 మంది శనివారం జైపాల్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణ సాధనలో కీలకమైన కృషి చేశా. ఆ వివరాలు సందర్భం వచ్చినప్పుడు వెల్లడిస్తా. తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటవుతుంది. నేను మాత్రం టీపీసీసీ చీఫ్ రేసులో లేను. మాజీ సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టడం సంతోషంగా ఉంది. ఆయన తన బలం గురించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నార’’ని అన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి: టీ-నేతలు
తెలంగాణ పోరాటంలో ఇది సంధి కాలం దత్తాత్రేయ ‘అలయ్ బలయ్’లో టీ-నేతల పిలుపు సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ తెలంగాణ పోరాటంలో ఇప్పుడు నడుస్తున్నది సంధికాలమని.. తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని పలువురు రాజకీయ వేత్తలు, ఉద్యమనేతలు, మేధావులు, కవులు, కళాకారులు పిలుపిచ్చారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరుతున్న తరుణంలో కొందరు మోకాలడ్డే ప్రమాదం ఉందన్నారు. సమన్యాయమనే వాదన వట్టి డొల్ల వాదనని విమర్శించారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో దసరా మిలాప్- అలయ్ బలయ్-ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సభకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాంలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మరో ముఖ్య అతిధిగా రావాల్సిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ గైర్హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఏడేళ్లుగా దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే కళారూపాల ప్రదర్శనతో పాటు ఆ ప్రాంత పిండివంటలు ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఈ సందర్భంగా ఆయా నేతలు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, ఉద్యమ కార్యాచరణ గురించి మాట్లాడారు. విడిపోయి.. కలుసుందాం... తెలంగాణ కల సాకారమయ్యేవేళ ఈ ప్రాంత సంస్కృతిని దేశవ్యాప్తం చేయాలని మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. ఆప్యాయత, ఆత్మీయత తెలంగాణ సద్గుణమని, అటువంటి సంస్కృతిని ప్రతిబింబించేలా మున్ముందు మరిన్ని ఆత్మీయ సమ్మేళనాలు జరగాలని జస్టిస్ ఈశ్వరయ్యగౌడ్ ఆకాంక్షించారు. తెలంగాణ ఏర్పాటులో కొన్ని చిక్కులు, ప్రలోభాలు, రాజకీయ ఇబ్బందులు వస్తాయని సురవరం వ్యాఖ్యానించారు. ప్రధాన రాజకీయ పక్షాలు తమ వాగ్దానం నుంచి వెనక్కు వెళ్లకుండా తెలంగాణ కల సాకారమయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం ముందయినా ఈ ప్రాంతంలోని రాజకీయ పక్షాలన్నీ కలిసికట్టుగా ఒకే గొంతు వినిపించాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందామన్నారు. త్యాగాల ఫలితంగా తెలంగాణ వస్తోందని, పార్లమెంటులో బిల్లు పాసయ్యేవరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని కిషన్‌రెడ్డి సూచించారు. తెలంగాణ కల సాకారమయ్యేంత వరకు కదం కదం కలిపి నడవాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. విజయం సిద్ధించుతున్న వేళ వినమ్రంగా ఉండాలన్నారు. వచ్చే అలయ్ బలయ్ స్వతంత్ర తెలంగాణలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌పై కాంగ్రెస్ కిరికిరి పెట్టడం తథ్యమని.. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని టీఆర్ఎస్ నాయకుడు కె.కేశవరావు పిలుపిచ్చారు. వెంకయ్య అడ్డుపుల్లగా మారారు... వెంకయ్యనాయుడు తెలంగాణకు అడ్డుపుల్లగా మారారని, మరోపక్క చంద్రబాబునాయుడు కూడా వస్తున్నారని ప్రముఖ కవి అంద్శైవిమర్శించారు. గడ్డిపోచ మాదిరి వెంకయ్య అడ్డం వస్తే ఒక్కసారిగా భగ్గుమనక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ యూ టర్న్ తీసుకునే ప్రశ్నే లేదని.. ఇక తెలంగాణ వచ్చేలా చూడాల్సిన బాధ్యత బీజేపీదేనని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఏపీఎన్జీవోలు చేస్తున్న ఆందోళన దొబ్బిపోయిన ఉద్యోగాలు క్రమబద్ధీకరించమనా? అని ఎంపీ రాజయ్య ప్రశ్నించారు. తెలంగాణలో దొంగలు పడ్డారని నాయిని నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతి కార్మిక సంస్కృతితో ముడిపడి ఉందని చుక్కా రామయ్య చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో తమ పార్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కుపోదని, లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సీమాంధ్రకు వ్యతిరేకమైంది కాదని మురళీధర్‌రావు పేర్కొన్నారు. దత్తాత్రేయ సహా ప్రముఖులకు సన్మానం... ఈ కార్యక్రమంలో దత్తాత్రేయను కురుమ సంఘం సన్మానించింది. అలాగే.. వివిధ రంగాల నుంచి పలువురు ప్రముఖుల్ని కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. వీరిలో పి.వేణుగోపాల్‌రెడ్డి (ఆర్ఎస్ఎస్ ప్రచారక్), డాక్టర్ వ్యాకరణం నాగేష్ (గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్), రసమయి బాలకిషన్ (తెలంగాణ కవి, గాయకుడు), ఖాన్ అక్తర్ (ప్రముఖ సంగీత విద్వాంసుడు), సంఘంరెడ్డి సత్యనారాయణ (జై తెలంగాణ పత్రిక వ్యవస్థాపకులు), దరువు ఎల్లన్న (ఉస్మానియా జేఏసీ నేత), మాడభూషి శ్రీధర్ (నల్సార్ యూనివర్శిటీ), యడ్లపాటి రఘునాథ్‌బాబు (బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ) తదితరులు ఉన్నారు. వివిధ పార్టీల నేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, సి.హెచ్.విద్యాసాగరరావు, బద్దం బాల్‌రెడ్డి, డాక్టర్ కె.హరిబాబు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు, నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, పుష్పలీల, పి.చంద్రశేఖర్‌రావు, ఎన్.రామమోహనరావు, దాసరి మల్లేశం, శాంతారెడ్డి (బీజేపీ), ఈటెల రాజేందర్, వివేక్ (టీఆర్ఎస్), మధుయాష్కీ (కాంగ్రెస్), అజీజ్‌పాషా (సీపీఐ), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ), కఠారి శ్రీనివాస్ (లోక్‌సత్తా), టీజేఏసీ నేతలు దేవీప్రసాద్, శ్రీనివాసగౌడ్, అద్దంకి దయాకర్, విఠల్, సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్, అల్లం నారాయణ, శైలేష్‌రెడ్డి, హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కృష్ణబాబు, పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విభజనపై అపోహలు తొలగించండి: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేస్తూ వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి అన్నారు. ఇందుకోసం పీఆర్టీయూ ముందుండి కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన జరిగితే ఉద్యోగులకు భద్రత ఉండదని, చిక్కులు వస్తాయంటూ కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, సీమాంధ్ర ఉద్యోగులు కావాలనే ఆందోళనలు చేస్తున్నారేమోనని అన్నారు. వాటిని తిప్పికొట్టేవిధంగా ఉపాధ్యాయులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ భవన్లో యూనియన్ అధ్యక్షుడు పి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం’- అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జానారెడ్డి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగితే సమస్యలు వస్తాయా? ప్రభుత్వం చేయాల్సిందేమిటి? అనే అంశాలపై సీమాంధ్ర ఉద్యోగులకు తెలియజేసేలా, అందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టేలా ఆచరణాత్మక నివేదికను రూపొందించాలని జానారెడ్డి పేర్కొన్నారు. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయడంతోపాటు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఉద్యోగులకు సంబంధించి పదో పీఆర్సీ నివేదిక త్వరగా వచ్చేలా కృషిచేస్తామని, ఒకవేళ ఆలస్యమైతే మధ్యంతర భృతి త్వరగా ఇచ్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు సమస్యగా ఉన్న ఆర్టికల్ 371-డిని తొలగించాల్సిన అవసరం లేదని, సవరణకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. సమైక్య ఉద్యమం మీడియా వల్లే వచ్చిందని మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. హైదరాబాద్‌లో వందల ఎకరాలు ఉన్న వారు, పెట్టుబడిదారులు కొంతమంది ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యోగులది గంటన్నర, రెండు గంటల ఉద్యమమని అన్నారు. హైదరాబాద్‌లో ఉద్యోగులకు భద్రత లేదన్న వాదన సరికాదని సమాచార శాఖ మంత్రి డీకే అరుణ అన్నారు. విభజన సమయంలో మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తారని, అందులో పంపకాలు, సర్వీసు రూల్స్ అన్నీ చర్చించి నిర్ణయిస్తారన్నారు. తెలంగాణ ప్రక్రియకు కృషి చేయండి: ఎమ్మెల్సీలు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు న్యాయం చేసేలా 371-డి సవరణకు, తెలంగాణ ఏర్పాటును వేగవంతం చేసేందుకు ఇక్కడి మంత్రులు, ఎంపీలు కృషి చేయాలని ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి మంత్రులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, వారింట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. 371-డిలో ప్రభుత్వ టీచర్లు అనేది ఉందని, పంచాయతీరాజ్ అనేది లేనందున లక్షల మంది టీచర్లు అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త సర్వీసు రూల్స్ తెచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు.